E-Paper
Advertisement

మార్కెట్ లోకి సియెర్రా EV ఎంట్రీ.. ధర, రేంజ్, ఫీచర్లు సహా పలు 10 క్రేజీ డీటైల్స్ మీకోసం..

మార్కెట్ లోకి సియెర్రా EV ఎంట్రీ.. ధర, రేంజ్, ఫీచర్లు సహా పలు 10 క్రేజీ డీటైల్స్ మీకోసం..
Advertisement

Tata Sierra EV Launch 2026: ఎలక్ట్రిక్ కార్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సియెర్రా EVని మార్కెట్ లోకి అడుగు పెట్టారు. అదిరిపోయే డిజైన్, అధునాతన ఫీచర్లు, మంచి రేంజ్‌ తో ఈ ఎలక్ట్రిక్ SUV వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ కారుకు సంబంధించి జూలైలో ధరలను ప్రకటించి బుకింగ్‌ లను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టాటా కొత్త ఈవీకి గురించి10 ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1.మార్కెట్ లోకి ఎంట్రీ!

టాటా మోటార్స్ సియెర్రా EVని ఇవాళ(జూన్ 30, 2026న) అధికారికంగా ఆవిష్కరించింది. జూలైలో ధరలను ప్రకటించి బుకింగ్‌లను ప్రారంభించే అవకాశం ఉంది.

2.క్లాసిక్ లుక్‌ తో కొత్త డిజైన్

Advertisement

పాత సియెర్రా మోడల్‌ కు గుర్తుగా ఉండే వెనుక గ్లాస్ డిజైన్‌ ను ఈ కొత్త మోడల్‌ లో కూడా కొనసాగించారు. అయితే, EVకి క్రేజీ లుక్ కోసం ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కొత్త హెడ్‌ ల్యాంప్‌ లు, ఏరోడైనమిక్ వీల్స్ లాంటి మార్పులు చేశారు.

3.కొత్త ప్లాట్‌ ఫారమ్‌ పై నిర్మాణం

ఈ SUVని టాటా కొత్త acti.ev+ ప్లాట్‌ ఫారమ్‌ మీద తయారు చేశారు. బ్యాటరీని ఫ్లోర్ కింద అమర్చడం వల్ల క్యాబిన్‌ లో ఎక్కువ స్థలం లభించడంతో పాటు, భద్రత కూడా పెరగనుంది.

4.AWD ఆప్షన్

Advertisement

సియెర్రా EVలో సింగిల్ మోటార్‌ తో పాటు డ్యూయల్ మోటార్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. టాటా దీనిని క్వాడ్ వీల్ డ్రైవ్(QWD) అని పిలుస్తోంది. సరిగా లేని రోడ్ల మీద కూడా మంచి పర్ఫార్మెన్స్  అందించేలా దీనిని రూపొందించారు.

5.మూడు బ్యాటరీ ఆప్షన్లు

టాటా సియెర్రా ఈవీ 55kWh, 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌ లతో వస్తోంది. పెద్ద 75kWh బ్యాటరీతో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ లభించే అవకాశం ఉంది.

6.ట్రిపుల్ స్క్రీన్ డాష్‌ బోర్డ్

ఈ కారు టాప్ వేరియంట్‌ లో మూడు డిజిటల్ స్క్రీన్లు ఉంటాయి. డ్రైవర్ డిస్‌ ప్లే, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్, ముందు ప్రయాణికుడి కోసం ప్రత్యేక స్క్రీన్ అందించనున్నారు. బేసిక్ సహా, ఇతర వేరియంట్లలో రెండు స్క్రీన్ల సెటప్ ఉంటుంది.

7.ప్రీమియం ఫీచర్లు

ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌ రూఫ్, పవర్డ్ టెయిల్‌ గేట్, JBL 12 స్పీకర్ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్‌ బాక్స్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

8.BaaS సౌకర్యం

టాటా బ్యాటరీ యాస్ ఏ సర్వీస్(BaaS) విధానాన్ని ఈ మోడల్‌ లో కూడా అందించే అవకాశం ఉంది. బ్యాటరీని ప్రత్యేక ప్లాన్ ద్వారా ఉపయోగించుకుంటూ, కారును తక్కువ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

9.ధర ఎంత అంటే?

టాటా సియెర్రా EV ప్రారంభ ధర రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉంటుంది. విడుదల తర్వాత ఇది క్రెటా EV, ఇ-విటారా, మహీంద్రా BE 6 లాంటి ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

10.భద్రతకు పెద్దపీట

ఈ SUVలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్, నాలుగు డిస్క్ బ్రేక్‌లు, 360 డిగ్రీ కెమెరా లాంటి భద్రతా ఫీచర్లు స్టాండర్డ్‌ గా లభించనున్నాయి. టాప్ వేరియంట్లలో లెవెల్-2+ ADASతో పాటు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్  లాంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థలు కూడా ఉన్నాయి.

Read Also: 2028 నుంచి పెట్రోల్,సీఎన్జీ బైక్స్ బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Related News

మారుతి ఫస్ట్.. టాటా సెకెండ్.. జూన్ 2026 కార్ల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ బ్రాండ్స్!

ఎలక్ట్రిక్ కారు vs పెట్రోల్ కారు.. 2026లో ఏ కారు కొనడం బెస్ట్?

భారత మార్కెట్‌ లోకి విన్‌ఫాస్ట్ VF3.. చిన్న సైజులో స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది!

యూజ్డ్ కార్ బయ్యర్స్ కు బెస్ట్ ఛాయిస్.. ఈ 5 డిస్కంటిన్యూడ్ కార్లు మిస్ అవ్వొద్దు!

హీరో జూమ్ 125 అడ్వెంచర్ డిజైన్‌ కు పేటెంట్.. త్వరలో మార్కెట్ లోకి క్రేజీ స్కూటర్ ఎంట్రీ!

రేట్ రూ.18.79 లక్షలు.. రేంజ్ 665 కిలో మీటర్లు.. టాటా సియెర్రా EV వచ్చేసింది!

రూ.10 లక్షల్లో పవర్‌ ఫుల్ టర్బో కార్లు.. టాప్ మాన్యువల్ మోడల్స్ ఇవే!

ఎంజీ To BYD.. భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVలు ఇవే!

Big Stories

Advertisement
×