E-Paper
Advertisement

రూ.10 లక్షల్లో పవర్‌ ఫుల్ టర్బో కార్లు.. టాప్ మాన్యువల్ మోడల్స్ ఇవే!

రూ.10 లక్షల్లో పవర్‌ ఫుల్ టర్బో కార్లు.. టాప్ మాన్యువల్ మోడల్స్ ఇవే!
Advertisement

Budget Turbo Petrol Cars Under Rs 10 Lakh: భారత కార్ల మార్కెట్‌ లో గత కొన్నేళ్లుగా టర్బో పెట్రోల్ ఇంజిన్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఈ ఇంజిన్లు ప్రీమియం కార్లకే పరిమితమయ్యేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. టాటా, మహీంద్రా, హ్యుందాయ్, కియా, మారుతి సుజుకి, స్కోడా, రెనాల్ట్, నిస్సాన్, సిట్రోయెన్ లాంటి పాపులర్  కంపెనీలు రూ.10 లక్షల లోపే టర్బో పెట్రోల్ మాన్యువల్ కార్లను అందిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌ లో మంచి పనితీరు, సూపర్ యాక్సిలరేషన్, డ్రైవింగ్ ఎంజాయ్‌మెంట్ కోరుకునే వారికి అనుకూలంగా ఉండే టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ టాటా నెక్సాన్  

ఈ లిస్టులో మొదటి స్థానంలో టాటా నెక్సాన్‌  ఉంటుంది. దీని టర్బో-పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ.7.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 120 PS పవర్, 170 Nm టార్క్‌ తో ఈ SUV నగర రోడ్లపై డ్రైవింగ్ కు అనుకూలంగా ఉంటుంది. హైవే ప్రయాణాల్లో కూడా ఆకట్టుకుంటుంది. రూ.10 లక్షలలోపు పలు వేరియంట్లు అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత.

⦿ C3X, XUV 3XO  

Advertisement

సిట్రోయెన్ C3X  1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ తో సాఫ్ట్ రైడ్, మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. అటు మహీంద్రా XUV 3XO 200 Nm టార్క్‌ తో పవర్ ఫుల్ పనితీరును కలిగి ఉంటుంది. సిటీ డ్రైవింగ్ తో పాటు లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఈ రెండు మోడళ్లు అనువుగా ఉంటాయి.

⦿ స్కోడా కైలాక్, రెనాల్ట్ కైగర్

పనితీరు విషయంలో స్కోడా కైలాక్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 1.0 లీటర్ టర్బో ఇంజిన్, మాన్యువల్ గేర్‌ బాక్స్ తో డ్రైవింగ్‌ ను మరింత క్రేజీగా మారుస్తుంది. అదే సమయంలో రెనాల్ట్ కైగర్ కూడా తక్కువ ధరలో మంచి మైలేజీ, ఈజీ హ్యాండ్లింగ్‌ను అందించే SUVగా నిలుస్తోంది.

⦿ టాటా పంచ్, హ్యుందాయ్ వెన్యూ  

Advertisement

టాటా పంచ్ టర్బో ఇప్పుడు మరింత పవర్ ఫుల్ గా మారింది. చిన్న SUV అయినప్పటికీ పనితీరు పరంగా ఆకట్టుకుంటుంది. కియా సైరోస్, హ్యుందాయ్ వెన్యూ మోడళ్లు కూడా 120 PS పవర్‌ తో వేగవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తున్నాయి. ట్రాఫిక్‌ లో ఈజీగా నడపడంతో పాటు హైవేల్లో కూడా మంచి స్టెబులిటీని అందిస్తున్నాయి.

⦿ ఫ్రాంక్స్, సోనెట్, i20 N లైన్  

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.0 లీటర్ టర్బో ఇంజిన్‌తో స్మూత్ డ్రైవింగ్‌ను అందిస్తుంది. కియా సోనెట్ iMT వేరియంట్ క్లచ్ ఉపయోగించకుండా డ్రైవ్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. స్పోర్టీ హ్యాచ్‌ బ్యాక్ కోసం చూస్తున్న వారికి హ్యుందాయ్ i20 N లైన్ బెస్ట్ ఆప్షన్. దీని సస్పెన్షన్ సెటప్, పవర్ ఫుల్ ఇంజిన్ డ్రైవింగ్‌ ను మరింత థ్రిల్లింగ్‌ గా మారుస్తాయి.

⦿ మాగ్నైట్, స్లావియా  

నిస్సాన్ మాగ్నైట్ రోజువారీ వినియోగానికి సరిపోయే టర్బో SUVగా నిలుస్తోంది. మరోవైపు స్కోడా స్లావియా ఈ జాబితాలోని ఏకైక సెడాన్. హైవేల్లో అద్భుతమైన స్టెబులిటీ, పవర్ ఫుల్ ఫర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఎంజీ To BYD.. భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVలు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×