// // Family Drama OTT: కొడుకుల కోసం తపించే తండ్రి... ప్రశంసలతో -->
E-Paper
Advertisement

Family Drama OTT: కొడుకుల కోసం తపించే తండ్రి… ప్రశంసలతో పరుగులు తీస్తున్న సినిమా… గుండెను పిండే ఎమోషన్స్

Family Drama OTT: కొడుకుల కోసం తపించే తండ్రి… ప్రశంసలతో పరుగులు తీస్తున్న సినిమా… గుండెను పిండే ఎమోషన్స్
Advertisement

Family Drama OTT : రీసెంట్ గా ఒక మూవీ థియేటర్లలో వచ్చింది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నైజీరియా దేశంలో 1993లో ఎలక్షన్ల టైమ్ లో సాగే ఈ ఫ్యామిలీ సినిమా ‘మై ఫాదర్స్ షాడో’. ఈ సినిమా దర్శకుడు చిన్నతనంలో తన తండ్రితో గడిపిన జ్ఞాపకాల ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. అందుకే ఇందులో ఎమోషన్స్ చాలా సహజంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సినిమాను పాత కాలపు పద్ధతిలో 16mm ఫిలిం మీద షూట్ చేశారు. దీనివల్ల 1990ల నాటి నైజీరియా వాతావరణం, ఆ రంగులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. అనవసరపు సీన్లు లేకుండా చాలా క్రిస్పీగా, ఎమోషనల్‌గా సాగుతుంది ఈ సినిమా.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

‘మై ఫాదర్స్ షాడో’ (My Father’s Shadow) అకినోలా డేవిస్ జూనియర్ దర్శకత్వం వహించారు. ఇందులో తండ్రి పాత్ర వేసిన సోపే దిరిసు ఇప్పటికే ‘గ్యాంగ్స్ ఆఫ్ లండన్’ సిరీస్‌తో చాలా ఫేమస్. కానీ ఇందులో పిల్లలుగా నటించిన గాడ్విన్ ఎగ్బో, చిబుయిక్ మార్వెలస్ ఎగ్బో అనే ఇద్దరు అబ్బాయిలు, ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యారు. వారి నటనకు విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు దక్కాయి. ఇది ఫిల్మ్ వన్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా 19 సెప్టెంబర్ 2025న నైజీరియాలో థియేటర్లలో విడుదలైంది.ఇక దీని గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను MUBI కొనుగోలు చేసింది. ఏప్రిల్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘అఫీషియల్ సెలక్షన్’లో నిలిచిన మొట్టమొదటి నైజీరియన్ సినిమా ఇదే కావడం విశేషం.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నైజీరియా దేశంలో 1993లో ఎలక్షన్ల టైమ్ అది. ఊరంతా ఒకటే గొడవలు జరుగుతుంటాయి. ఆ టైమ్‌లో ఇద్దరు చిన్న పిల్లలు, చాలా కాలంగా దూరంగా ఉంటున్న తమ తండ్రి తో కలిసి, ఒక రోజంతా నగరం చుట్టూ తిరగడానికి బయలుదేరుతారు. ఆ పిల్లలకి బయట ఏం జరుగుతుందో తెలీదు కానీ, వాళ్ల నాన్నతో కలిసి గడపడం అంటే భలే సంబరం. కానీ లోపల ఆ తండ్రికి మాత్రం తన వ్యక్తిగత జీవితంలో, ఆర్థికంగా బోలెడు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ తన మొహంలో కనిపించకుండా, పిల్లల ముందు తనే ఒక పెద్ద హీరోలా కనిపించాలని తెగ తాపత్రయపడతాడు.

కానీ ఆ రోజంతా సాగే ప్రయాణంలో పిల్లలకి ఒక విషయం అర్థమవుతుంది. తమ నాన్న వాళ్ళు అనుకున్నంత పెద్ద బలవంతుడేం కాదు. ఆయనకు కూడా భయాలు, బాధలు ఉన్నాయని వాళ్లకి చిన్నగా తెలుస్తుంది. బయట దేశంలో ఎలక్షన్ల వల్ల గొడవలు జరుగుతుంటే, లోపల ఆ తండ్రి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే యుద్ధమే ఈ సినిమా. ఒక తండ్రి తన కొడుకుల కళ్లలో తక్కువైపోకూడదని పడే ఆరాటం, ఆ పిల్లల అమాయకత్వం చుట్టూ ఈ కథ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.

Advertisement

Read Also : మునుపెన్నడూ చూడని సిక్కు యోధుల వీర గాధ… ఓటీటీలో స్ట్రీమింగ్ షురూ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×