E-Paper
Advertisement

రేట్ రూ.18.79 లక్షలు.. రేంజ్ 665 కిలో మీటర్లు.. టాటా సియెర్రా EV వచ్చేసింది!

రేట్ రూ.18.79 లక్షలు.. రేంజ్ 665 కిలో మీటర్లు.. టాటా సియెర్రా EV వచ్చేసింది!
Advertisement

Tata Sierra EV Launched: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EV అధికారికంగా విడుదల అయ్యింది. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర రూ.18.79 లక్షలు (ఎక్స్‌ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే వచ్చిన పెట్రోల్, డీజిల్ సియెర్రా మోడల్‌ కు కొనసాగింపుగా ఈ EV వెర్షన్‌ను తీసుకొచ్చింది. టాటా ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ తో వచ్చే రెండో మోడల్ కావడం విశేషం. కొత్త సియెర్రా EV మార్కెట్లో మహీంద్రా BE 6, మారుతి సుజుకి ఈ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, విన్‌ ఫాస్ట్ VF6 లాంటి ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

పలు వేరియంట్లలో అందుబాటులోకి సియెర్రా ఈవీ

ఈ SUVను టాటా పలు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ వేరియంట్ రూ.18.79 లక్షల నుంచి మొదలవుతుండగా, టాప్ ఎండ్ AWD వేరియంట్ ధర రూ.25.99 లక్షల వరకు ఉంది. వినియోగదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా మోడల్‌ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సియెర్రా EVలో 63kWh, 75kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. రెండు బ్యాటరీలతోనూ రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ లభిస్తుంది. 75kWh బ్యాటరీలో డ్యూయల్ మోటార్‌తో AWD ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ గరిష్టంగా 504Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బూస్ట్ మోడ్‌ను ఉపయోగిస్తే కేవలం 5.8 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని టాటా తెలిపింది.

Advertisement

AWD వెర్షన్‌ లో సాధారణ డ్రైవింగ్‌ తో పాటు గ్రాస్/స్నో, మడ్/గ్రావెల్, సాండ్, రాక్ క్రాల్, కస్టమ్ లాంటి మొత్తం ఆరు టెర్రైన్ మోడ్స్ ఉన్నాయి. తక్కువ వేగంలో క్రూయిజ్ కంట్రోల్, 540 డిగ్రీల కెమెరా లాంటి ఆఫ్ రోడ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సింగిల్ ఛార్జ్ తో 665 కిలో మీటర్ల ప్రయాణం

ఈ కారు 75kWh బ్యాటరీతో గరిష్టంగా 665 కిలోమీటర్లు, 63kWh బ్యాటరీతో 565 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. 120kW DC ఫాస్ట్ ఛార్జర్‌ తో కేవలం 15 నిమిషాల్లోనే సుమారు 263 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ లభిస్తుంది. అలాగే 20 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ కావడానికి సుమారు 26 నిమిషాలు మాత్రమే పడుతుంది. బ్యాటరీపై 15 సంవత్సరాల వారంటీ కూడా టాటా అందిస్తోంది.

డిజైన్ గురించి..

Advertisement

సియెర్రా EV, ICE వెర్షన్‌ ను ఎక్కువగా పోలి ఉంటుంది. అయితే, ముందు భాగంలో కొన్ని చిన్న మార్పులు చేశారు. కొత్త బంపర్ డిజైన్, ప్రత్యేక EV బ్యాడ్జింగ్ ఈ మోడల్‌ కు ప్రత్యేక లుక్ ను అందిస్తున్నాయి. 205 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో అన్ని రకాల రోడ్లపై సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

ప్రీమియం ఫీచర్లు

క్యాబిన్‌లో  ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 ADAS, డిజిటల్ కీ, OTA అప్‌ డేట్స్, ఆటో పార్క్ అసిస్ట్, హెడ్ అప్ డిస్‌ ప్లే, V2L, V2V టెక్నాలజీ లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సూపర్ డిజైన్, ఎక్కువ రేంజ్, అత్యాధునిక టెక్నాలజీతో టాటా సియెర్రా EV భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది.

Read Also: రూ.10 లక్షల్లో పవర్‌ ఫుల్ టర్బో కార్లు.. టాప్ మాన్యువల్ మోడల్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×