E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ కారు vs పెట్రోల్ కారు.. 2026లో ఏ కారు కొనడం బెస్ట్?

ఎలక్ట్రిక్ కారు vs పెట్రోల్ కారు.. 2026లో ఏ కారు కొనడం బెస్ట్?
Advertisement

Electric Cars vs Petrol Cars: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. కొత్త కారు కొనాలనుకునే చాలా మంది ఇప్పుడు పెట్రోల్ కారు తీసుకోవాలా? లేక ఎలక్ట్రిక్ కారు కొనాలా? అని ఆలోచిస్తున్నారు. కొనుగోలు సమయంలో ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ,లాంగ్ రన్ లో మెయింటెనెన్స్ ఖర్చులు, ఫ్యూయల్ ఖర్చు పరంగా  ఎక్కువ ఆదా చేస్తాయని ఆటో నిపుణులు చెప్తున్నారు.

రోజువారీ వినియోగంలో..

పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు లీటరుకు దాదాపు రూ.120 వరకు ఉండగా, సగటున ఓ పెట్రోల్ కారు లీటరుకు 14 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీంతో ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి సుమారు రూ.9 వరకు ఖర్చవుతుంది. మరోవైపు, ఎలక్ట్రిక్ కార్లు 100 కిలోమీటర్లకు సుమారు 15 నుంచి 18 యూనిట్ల కరెంటును వినియోగిస్తాయి. ఇంటి దగ్గర ఛార్జ్ చేస్తే కిలో మీటర్‌ కు సుమారు రూ.1.2 నుంచి రూ.1.5 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ లో ఛార్జ్ చేసినా ఖర్చు కిలోమీటర్‌ కు రూ.2.5 నుంచి రూ.4.5 మధ్యే ఉంటుంది. అంటే, రోజువారీ ప్రయాణంలో ఎలక్ట్రిక్ కారు యజమానులు ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

వార్షిక ఖర్చులు కూడా ఎలక్ట్రిక్ కార్లకే తక్కువగా ఉన్నాయి. ఏడాదికి 15,000 కిలోమీటర్లు ప్రయాణించే పెట్రోల్ కారు యజమాని ఫ్యూయల్ కోసం దాదాపు రూ.1 లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కారుకు విద్యుత్ ఖర్చు రూ.20,000 నుంచి రూ.25,000 మధ్యే ఉంటుంది. దీంతో సంవత్సరానికి సుమారు రూ.80,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

మెయింటెనెన్స్ ఖర్చుల గురించి..

మెయింటెనెన్స్ ఖర్చుల విషయంలోనూ ఎలక్ట్రిక్ కార్లు ముందుంటాయి. పెట్రోల్ కార్లలో ఇంజిన్ ఆయిల్ మార్పులు, ఫిల్టర్లు, స్పార్క్ ప్లగ్స్, క్లచ్, గేర్‌ బాక్స్ లాంటి భాగాలకు తరచూ సర్వీసింగ్ అవసరం అవుతుంది. దీంతో ప్రతి సంవత్సరం రూ.12,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు అవుతుంది.  ఎలక్ట్రిక్ కార్లలో కదిలే భాగాలు తక్కువగా ఉండటం వల్ల మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏడాదికి రూ.4,000 నుంచి రూ.8,000 వరకు మాత్రమే సర్వీస్ ఖర్చు వచ్చే అవకాశం ఉంది. సో, లాంగ్ రన్ లో మంచి మనీ బెనిఫిట్స్ అందిస్తాయి.

ధర గురించి..

Advertisement

కొనుగోలు ధర పరంగా పెట్రోల్ కార్లు ఇప్పటికీ చవకగానే ఉన్నయి. భారత మార్కెట్‌ లో  కాంపాక్ట్ పెట్రోల్ SUV ధర సుమారు రూ.13–14 లక్షల మధ్య ఉంటే, అదే స్థాయి ఎలక్ట్రిక్ SUV ధర రూ.16–18 లక్షల వరకు ఉంటుంది. ప్రారంభంలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

Read Also: భారత మార్కెట్‌ లోకి విన్‌ఫాస్ట్ VF3.. చిన్న సైజులో స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×