E-Paper
Advertisement

ఎంజీ To BYD.. భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVలు ఇవే!

ఎంజీ To BYD.. భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVలు ఇవే!
Advertisement

Upcoming Plug in Hybrid SUVs 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌ లోకి 2026 చివరి నాటికి పలు కొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు(PHEVలు) అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా MG, BYD, Jetour కంపెనీల కొత్త మోడళ్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఈ కొత్త కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1.MG కొత్త PHEV SUV

JSW MG మోటార్ నుంచి రాబోతున్న కొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV ఇది. చైనాలో ఉన్న Wuling Starlight 560 ఆధారంగా ఈ మోడల్ రూపొందుతోంది. ఈ కారు జూలైలో విడుదల కానుంది. కానీ, మార్కెట్‌లోకి  దీపావళి సీజన్‌ లో అడుగు పెట్టే అవకాశం ఉంది. ఈ SUVలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. మొత్తం కలిపి సుమారు 195 bhp పవర్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్‌ తో 1000 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌ లో సుమారు 125 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ MG PHEV SUV సుమారు రూ.20 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మహీంద్రా, టాటా  SUVలకు పోటీగా నిలవనుంది.

2.BYD Seal U PHEV

Advertisement

BYD కంపెనీ కూడా భారత మార్కెట్‌లో తొలి PHEV SUVని తీసుకురానుంది. దీనికి Seal U అనే పేరు ఉండే అవకాశం ఉంది. ఈ SUVలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. మొత్తం పవర్ అవుట్‌ పుట్ సుమారు 218 bhp వరకు ఉంటుంది. AWD వెర్షన్‌ లో ఇది 300+ bhp పవర్ అందిస్తుంది. 0 నుండి 100 kmph వేగాన్ని సుమారు 6 సెకన్లలో చేరుకుంటుంది. ధర విషయానికి వస్తే, ఇది సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ లగ్జరీ PHEV సెగ్మెంట్‌ లో గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: మార్కెట్ లోకి సియెర్రా EV ఎంట్రీ.. ధర, రేంజ్, ఫీచర్లు సహా పలు 10 క్రేజీ డీటైల్స్ మీకోసం..

3.Jetour T2 PHEV

Advertisement

JSW మోటార్స్ భాగస్వామ్యంతో భారత మార్కెట్‌ లోకి రాబోతున్న మరో ముఖ్యమైన SUV Jetour T2. ఇది 2026 అక్టోబర్‌లో విడుదల కావచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని కొత్త ప్లాంట్‌ లో దీన్ని అసెంబుల్ చేయనున్నారు. ఈ SUVలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు సుమారు 26.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ మోటార్ FWD,  డ్యూయల్ మోటార్ AWD సెటప్‌ లో అందుబాటులోకి రానుంది.  పూర్తి ఎలక్ట్రిక్ మోడ్‌లో సుమారు 139 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది.

Read Also: రెనాల్ట్ To టయోటా.. జూలైలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 7 క్రేజీ మోడల్స్ ఇవే!

Related News

మారుతి బంపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.90 వేల డిస్కౌంట్!

400+ కి.మీ రేంజ్‌.. కళ్లు చెదిరే లుక్.. కియా సైరోస్ EV వచ్చేస్తోంది!

రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ హెల్మెట్.. అంత స్పెషల్ ఏంటంటే?

లిథియం ఐరన్ ఫాస్ఫేట్ vs నికెల్ మాంగనీస్ కోబాల్ట్.. ఈవీకి ఏ బ్యాటరీ బెస్ట్?

పెట్రోల్ అవసరం లేదు.. నీటితో నడిచే స్కూటర్ వచ్చేసింది!

బాబోయ్.. మహిళల పేరుతో కారు కొంటే ఇన్ని లాభాలా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

బైక్స్, కార్ల వెంట కుక్కలు ఎందుకు పడతాయో తెలుసా? అసలు రహస్యం ఇదీ!

చిన్న సైజ్.. పెద్ద చరిత్ర.. BMW తలరాతను మార్చిన లెజెండరీ ఇసెట్టా గురించి మీకు తెలుసా?

Big Stories

Advertisement
×