E-Paper
Advertisement

ప్రమాదంలో పాలపిట్ట.. రాష్ట్ర పక్షి ఇక కంటికి కనిపించదా?

ప్రమాదంలో పాలపిట్ట.. రాష్ట్ర పక్షి ఇక కంటికి కనిపించదా?
Advertisement

Indian Roller Conservation: ఒకప్పుడు చెరువులు, పొలాలు, జలాశయాల పరిసరాల్లో గుంపులుగా కనిపించే పాలపిట్టలు.. ఇప్పుడు ఎప్పుడో, ఎక్కడో ఒకచోట అత్యంత అరుదుగా కనిపిస్తున్నాయి. పట్టణీకరణ, గడ్డి భూములు తగ్గిపోవడం, సహజ ఆవాసాలు నాశనం కావడంతో ఈ అందమైన పక్షుల సంఖ్య ఏటా తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన పాలపిట్ట భవిష్యత్తుపైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సహజ ఆవాసాల నాశనమే ప్రధాన కారణం

ఇటీవల విడుదలైన స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ నివేదిక ప్రకారం దేశంలోని అనేక పక్షి జాతులు అంతరించిపోయేందుకు రెడీ అయ్యాయి. వాటిలో పాలపిట్ట కూడా ఒకటి. గడ్డి భూములు, మేత ప్రాంతాలు వేగంగా తగ్గిపోవడం వల్ల పాలపిట్టలకు ఆహారం దొరకడం కష్టమవుతోంది. సాధారనంగా ఈ పక్షులు మిడతలు, కీటకాలు, చిన్న సరీసృపాలు, కప్పలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవుల సంఖ్య కూడా తగ్గుతుండటంతో పాలపిట్టల మనుగడ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. పక్షుల పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. గడ్డి భూములు తగ్గిపోవడం, చెట్లతో పాటు సహజ పర్యావరణ వ్యవస్థలు మారిపోవడం పాలపిట్టల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

Advertisement

రైతులకు మేలు చేసే పక్షి

పాలపిట్టను రైతు నేస్తం అని పిలుస్తారు. పంటలను నాశనం చేసే మిడతలు, కీటకాలు, చిన్న కప్పలు, బల్లులు లాంటి జీవులను తిని రైతులకు సాయం చేస్తుంది. అందువల్ల వ్యవసాయానికి ఉపయోగపడే పక్షిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పాలపిట్టలు సాధారణంగా చెట్ల తొర్రల్లో గూళ్లు కట్టుకుంటాయి. ఒకేసారి మూడు నుంచి ఐదు గుడ్లు పెడతాయి. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య వీటి సంతానోత్పత్తి కాలం ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం.. వీటి జీవితకాలం 17 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

దసరా సమయంలో ఎక్కువ ముప్పు

Advertisement

దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను చూడటం శుభమనే నమ్మకంతో కొందరు అక్రమంగా వాటిని పట్టుకుని పంజరాల్లో బంధిస్తుంటారు. రెక్కలు కత్తిరించడం, ఎగరకుండా చేయడం లాంటి చర్యల వల్ల అనేక పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి సంరక్షణ సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి.

పాలపిట్టను బంధించడం లేదా హింసించడం చట్టరీత్యా నేరమని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి, కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఎక్కడైనా పాలపిట్టలను పంజరాల్లో బంధించి ఉంచినట్లు కనిపిస్తే వెంటనే సంబంధిత అటవీ శాఖ, జంతు సంరక్షణ సంస్థలకు సమాచారం ఇవ్వాలని అధికారులు, పక్షి ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పాలపిట్ట సంరక్షణకు తక్షణ చర్యలు

పాలపిట్ట ఉనికికి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పక్షి నిపుణులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాన ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. పాలపిట్టల వేటను అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అదే సమయంలో అటవీ శాఖ ద్వారా వీటి వేటగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఎలాగైనా పాలపిట్టల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకుంటుంది.

Read Also: కాంక్రీట్ జంగిల్ కాదు.. పక్షుల స్వర్గధామంగా మారుతున్న భాగ్యనగరం!

Tags

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×