E-Paper
Advertisement

Fantasy Drama OTT: అంధకారాన్ని జయించే అభిమన్యుడు… చావులోనూ చెరగని చిరునవ్వు… హార్ట్ టచింగ్ స్టోరీ

Fantasy Drama OTT: అంధకారాన్ని జయించే అభిమన్యుడు… చావులోనూ చెరగని చిరునవ్వు… హార్ట్ టచింగ్ స్టోరీ
Advertisement

Fantasy Drama OTT : గత ఏడాది సుమారు 1 గంట 50 నిమిషాల నిడివితో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా, జీవితాన్ని కొత్త కోణంలో చూపిస్తోంది. ఈ సినిమా కథ వెనుక నుండి ముందుకు సాగుతుంది. చార్లెస్ అనే వ్యక్తి మరణం నుండి అతని బాల్యం వరకు మూడు భాగాలుగా కథను చూపిస్తారు ఇందులో. మార్వెల్ సినిమాల్లో ‘లోకి’ పాత్రతో పాపులర్ అయిన టామ్ హిడిల్‌స్టన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో టామ్ హిడిల్‌స్టన్ రోడ్డు మీద చేసే 7 నిమిషాల డాన్స్ సీన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. మరి చావును కూడా చిరునవ్వుతో జయించవచ్చు అని చెప్పే, ఈ చూడచక్కని సినిమాపై ఓ లుక్ వేసెయ్యండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ప్రముఖ హారర్ దర్శకుడు మైక్ ఫ్లానగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫాంటసీ డ్రామా పేరు ‘ది లైఫ్ ఆఫ్ చక్’ (The Life of Chuck). ఇందులో ‘లోకి’ ఫేమ్ టామ్ హిడిల్‌స్టన్ మెయిన్ రోల్ చేయగా, స్టార్ వార్స్ నటుడు మార్క్ హమిల్, చివెటెల్ ఇజియోఫోర్, కరెన్ గిల్లాన్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు. ఇది ప్రఖ్యాత రచయిత స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. 2024 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాకు ప్రతిష్టాత్మకమైన పీపుల్స్ ఛాయిస్ అవార్డు లభించింది. ఇక 2025 జూన్ 6న యునైటెడ్ స్టేట్స్‌లోని థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $19 మిలియన్లు వసూలు చేసింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ప్రపంచం అంతా వినాశనం అయిపోతుంటుంది. ఇంటర్నెట్ కూడా ఆగిపోతుంది, ఊర్లు కూడా మునిగిపోతుంటాయి. సరిగ్గా అదే సమయంలో చక్ అనే వ్యక్తికి థాంక్స్ చెబుతూ ఊరంతా బోర్డులు కనిపిస్తాయి. అసలు విషయం ఏంటంటే, ఈ లోకం అంతా చక్ అనే ఒక సాదాసీదా అకౌంటెంట్ తలలో ఉన్న ఊహాలోకం. అతను హాస్పిటల్‌లో చనిపోతుంటే, అతని మెదడులో ఉన్న జ్ఞాపకాలు, మనుషులు కూడా మెల్లగా అంతమైపోతుంటారు. అంటే ఒక మనిషి చనిపోతే అతనితో పాటు అతని లోపల ఉన్న ఒక పెద్ద ప్రపంచం కూడా ముగిసిపోతుందని దీని అర్థం.

ఇక కథలో చక్ గత జీవితాన్ని చూపిస్తారు. అతను చిన్నప్పుడే తన తాతయ్య ఇంట్లోని ఒక విచిత్రమైన గదిలో తన చావును ముందే చూస్తాడు. తను త్వరగానే చనిపోతానని తెలిసినా, చక్ భయపడకుండా తన జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు. ఒక మామూలు వ్యక్తిగా ఉంటూనే, రోడ్డు మీద అపరిచితులతో కలిసి స్టెప్పులేస్తూ జీవితంలోని చిన్న చిన్న క్షణాలను ఎంజాయ్ చేస్తాడు. చనిపోయే ముందు తన జీవితం ఎంత విలువైందో గుర్తుచేసుకుంటూ, తన లోపల ఉన్న ప్రపంచానికి వీడ్కోలు పలకడమే ఈ సినిమా స్టోరీ.

Advertisement

Read Also : ప్రేమ జంటకు అదిరిపోయే షాక్ …ఒక్క రాత్రిలో ఇద్దరికి కడుపు… ఔరా అనిపించే విచిత్రం

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×