E-Paper
Advertisement

మారుతి ఫస్ట్.. టాటా సెకెండ్.. జూన్ 2026 కార్ల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ బ్రాండ్స్!

మారుతి ఫస్ట్.. టాటా సెకెండ్.. జూన్ 2026 కార్ల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ బ్రాండ్స్!
Advertisement

June 2026 Auto Sales Report: భారత ఆటోమొబైల్ మార్కెట్‌ లో జూన్ 2026 నెలలో కూడా మంచి అమ్మకాలు కొనసాగాయి. చాలా కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయి. కొన్ని బ్రాండ్లు నెలవారీ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి టాప్ పొజిషన్ ను మళ్లీ నిలబెట్టుకోగా, టాటా మోటార్స్ స్వల్ప ఆధిక్యంతో మహీంద్రాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో అమ్మకాల్లో సత్తా చాటిన టాప్ బ్రాండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి సుజుకి: 1,47,187

జూన్ నెలలో మారుతి సుజుకి మొత్తం 1,47,187 ప్యాసింజర్ కార్లను అమ్మింది. యుటిలిటీ వెహికల్స్ తో పాటు చిన్న కార్లకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎర్టిగా లాంటి మోడళ్లు మంచి అమ్మకాలు సాధించాయి. స్విఫ్ట్, డిజైర్, వాగన్ ఆర్, బాలెనో లాంటి కార్లు కూడా కంపెనీ అమ్మకాల్లో సత్తా చాటాయి.

2.టాటా మోటార్స్: 62,076

Advertisement

టాటా మోటార్స్ జూన్‌లో 62,076 కార్లను అమ్మి రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహీంద్రాతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, సుమారు 1,700 యూనిట్ల ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఇటీవల విడుదలైన సియెర్రా ఈవీపై మంచి రెస్పాన్స్  రావడంతో పాటు కంపెనీ తన ICE, EV మోడళ్ల ధరలను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది.

3.మహీంద్రా: 60,393  

మహీంద్రా 60,393 SUVలను అమ్మి మూడో స్థానంలో నిలిచింది. స్కార్పియో-N, థార్, XUV 3XO, XUV 7XO లాంటి మోడళ్లకు మార్కెట్లో మాంచి సత్తా చాటాయి. SUV సెగ్మెంట్‌ లో కంపెనీ ప్రభావం ఇంకా బలంగానే కనిపిస్తోంది.

4.హ్యుందాయ్: 39,635

Advertisement

హ్యుందాయ్ జూన్‌ లో 39,635 యూనిట్లు విక్రయించింది. క్రెటా, వెన్యూ, ఎక్స్టర్ మోడళ్లు మంచి అమ్మకాలు సాధించాయి.

5.టయోటా: 28,441

టయోటా 28,441 కార్లను అమ్మి ఐదో స్థానంలో నిలిచింది. ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, గ్లాంజా మోడళ్లు కంపెనీ అమ్మకాల్లో సత్తా చాటాయి. త్వరలో కొత్త తరం హిలక్స్ పికప్‌ ను కూడా భారత మార్కెట్లోకి తీసుకురానుంది.

6.కియా: 24,552

కియా జూన్‌ లో 24,552 యూనిట్లను అమ్మింది. సెల్టోస్, సోనెట్‌ కు మంచి డిమాండ్ కొనసాగుతుండగా, కేరెన్స్ క్లావిస్, సైరోస్ కూడా అమ్మకాల్లో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో కంపెనీ కేరెన్స్ క్లావిస్ EV కోసం BaaS ప్రోగ్రామ్‌ ను కూడా ప్రారంభించింది.

7.ఎంజీ మోటార్: 7,568

ఎంజీ మోటార్ 7,568 యూనిట్లతో మంచి వృద్ధిని నమోదు చేసింది. విండ్సర్ EV, కామెట్ EV, హెక్టర్ లాంటి మోడళ్లు కంపెనీ అమ్మకాలకు సపోర్టుగా నిలిచాయి. జూలైలో కొత్త న్యూ ఎనర్జీ వెహికల్‌ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

8.హోండా: 5,243

హోండా 5,243 కార్లను అమ్మింది. ఇటీవల విడుదలైన సిటీ ఫేస్‌ లిఫ్ట్‌ కు మంచి స్పందన రావడంతో పాటు ZR-V SUV బుకింగ్‌లు ప్రారంభం కావడం కంపెనీకి కలిసి వచ్చింది.

Read Also: ఎలక్ట్రిక్ కారు vs పెట్రోల్ కారు.. 2026లో ఏ కారు కొనడం బెస్ట్?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×