E-Paper
Advertisement

Actress Laya: ఓన్లీ వెజిటేరియన్.. నటి లయ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా!

Actress Laya: ఓన్లీ వెజిటేరియన్.. నటి లయ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా!
Advertisement

Actress Laya: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుని, ఆ తర్వాత పెళ్లి, పిల్లలంటూ ఇండస్ట్రీకి దూరమైన నటి లయ (Actress Laya), ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళుతున్నారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ (Sampradayini Suppini Suddapoosani) సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించారు. అంటే, ఇంకా ఆమెలో ఆ సత్తా ఉందన్నమాట. అయితే ఇన్నాళ్లైనా, ఆమెలో ఎలాంటి మార్పులేకపోవడానికి కారణం ఏంటి? అని అంతా అనుకుంటూ ఉంటారు. అసలు ఇలా మెయింటైన్ చేయడానికి వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అలాంటి వాళ్లందరి కోసం లయ తాజాగా ‘కిస్సిక్ టాక్స్’ (Kissik Talks)లో తన డైట్ సీక్రెట్ ఏంటో చెప్పేశారు.

Also Read- Big TV Kissik Talks: నువ్వేంటి నాకు చెప్పేది? అనే వారే కానీ.. శివాజీ కాంట్రవర్సీపై లయ!

సాలిడ్‌గా తింటాను

Advertisement

‘‘నేను చేసేది చెప్తాను.. ఇలాగే చేయమని ఎవరికీ చెప్పడం లేదు. నేను ఏం చేస్తున్నాననేది మాత్రమే చెబుతున్నాను. చాలా ఏళ్ల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయను.. ఎందుకంటే, బ్రేక్ ఫాస్ట్ టైమ్‌కి లంచ్ టైమ్‌కి నాకు ఎక్కువగా గ్యాప్ ఉండదు. అది నాకు వర్కవుట్ అవదు.. అందుకే డైరెక్ట్‌గా లంచ్ చేస్తాను. 11 గంటలకు అలా తినేస్తాను. ఇక స్నాక్స్ అంటూ ఏమీ ఉండవు. ఫ్రూట్స్ కూడా పెద్దగా తినను. సీజనల్ ఫ్రూట్స్ మాత్రం తింటాను. మళ్లీ 6 గంటలకు అలా ఆకలి వేస్తే, అప్పుడు డిన్నర్ ఫినిష్ చేసేస్తాను. కానీ, తినేది మాత్రం సాలిడ్‌గా తింటాను. ఇద్దరు ముగ్గురుకి సరిపడా కర్రీ నేను ఒక్కదానినే తింటాను. రైస్ మాత్రం తక్కువగా తింటాను. మా ఇంట్లో వండే కూరల క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా చూస్తే.. ఏంటి ఎవరైనా వస్తున్నారా? అని అడుతారు.

Also Read- Nandamuri Mokshagna: నారా దేవాన్ష్ పంచల ఫంక్షన్‌లో స్పాట్‌లైట్‌లో మోక్షజ్ఞ.. హీరో అవ్వాలంటే ఇంకా మారాలా?

నాకు వర్కవుతుంది

Advertisement

ఓన్లీ కూర తింటున్నానని అనుకోకుండా ఉండటానికి మాత్రమే రైస్ తింటుంటాను. ప్రొడక్షన్ ఫుడ్ పెట్టినప్పుడు.. అక్కడ చాలా రకాలు పెడతారు. నేను చాలా రకాలు తినలేను. అన్ని టేస్ట్ చేసి, అందులో ఒకటో, రెండో తీసుకుని ఫుల్ డబ్బా ఫినిష్ చేస్తాను. ఇంకా పెరుగు ఫుల్ డబ్బా ఫినిష్ చేస్తాను. పాలు, కాఫీ, టీ వంటివి తాగను.. కాల్షియం కావాలి కదా.. పెరుగు మాత్రం ఫుల్‌గా తీసుకుంటాను. ఇది నేను చేశాను కాబట్టి, అందరినీ చేయమని చెప్పడం లేదు. అసలు నేను చేసే పద్దతే తప్పేమో.. నాకు తెలియదు. నాకు వర్కవుతుంది.. అలాగే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఓన్లీ వెజిటేరియన్. ఈ రోజు ఆకు కూర, రేపు వెజిటిబుల్స్.. అలా ప్లాన్ చేసుకుంటాను..’’ అని లయ ఈ కార్యక్రమంలో తెలిపారు.

Also Read- Dhanush:ఆ బాలీవుడ్ హీరోతో ధనుష్ మల్టీస్టారర్.. డిజాస్టర్ స్టార్ డైరెక్టర్‌కు హిట్ దక్కేనా..!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×