E-Paper
Advertisement

హీరో జూమ్ 125 అడ్వెంచర్ డిజైన్‌ కు పేటెంట్.. త్వరలో మార్కెట్ లోకి క్రేజీ స్కూటర్ ఎంట్రీ!

హీరో జూమ్ 125 అడ్వెంచర్ డిజైన్‌ కు పేటెంట్.. త్వరలో మార్కెట్ లోకి క్రేజీ స్కూటర్ ఎంట్రీ!
Advertisement

ప్రముఖ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ జూమ్ 125 స్కూటర్‌ కు అడ్వెంచర్ స్టైల్‌ లో కొత్త వెర్షన్ తీసుకురావడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగానే తాజా జాగా హీరో జూమ్ 125 అడ్వెంచర్ డిజైన్‌కు పేటెంట్ దాఖలు చేసింది. ఈ కొత్త కాన్సెప్ట్‌ లో ఇప్పుడున్నజూమ్ 125తో పోలిస్తే మరింత రగ్గడ్ లుక్ తో ఆకట్టుకోబోతోంది.

EICMA మోటార్ షోలో తొలిసారి ప్రదర్శన

Advertisement

ఈ స్కూటర్‌ ను తొలిసారిగా 2024లో జరిగిన ఈఐసీఎంఏ మోటార్ షోలో హీరో ప్రదర్శించింది. అప్పట్లో చూపించిన కాన్సెప్ట్ మోడల్‌ కు అడ్వెంచర్ స్కూటర్ల మాదిరిగా స్పెషల్ డిజైన్ ఇచ్చారు. ముందు భాగంలో క్రాష్ గార్డ్స్, హై రైజ్ ఫ్రంట్ ఫెండర్, బీక్ డిజైన్, నాకిల్ గార్డ్స్, నాబీ టైర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వైట్ కలర్ బాడీపై ఎరుపు, నలుపు, బూడిద రంగు గ్రాఫిక్స్‌ తో డాకర్ ర్యాలీ తరహా డిజైన్ ను కలిగి ఉంది.

ఇక తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ డిజైన్‌ లో కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో ముందు భాగంలో ఒకే క్రాష్ గార్డ్ ఉంది. బీక్ డిజైన్, నాకిల్ గార్డ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. అదనంగా బాడీ క్లాడింగ్ ఇవ్వడం వల్ల స్కూటర్ మరింత పవర్ ఫుల్ లుక్ ను కలిగి ఉంది. రానున్న రోజుల్లో దీనిని కొత్త కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే  అవకాశం ఉంది.

ఇంజిన్ గురించి..

Advertisement

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న జూమ్ 125లో 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంది. ఇదే ఇంజన్ ను కొత్త మోడల్ లోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 10 PS పవర్, 10.4 Nm టార్క్‌ ను ఇవ్వనుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్‌ తో పాటు 14 అంగుళాల వీల్స్, ముందు 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌ ను ఇందులో అందించే అవకాశం ఉంది.

అత్యాధునిక ఫీచర్లు

ఫీచర్ల పరంగా కూడా స్టాండర్డ్ జూమ్ 125లో ఉన్నవి కంటిన్యూ కనానున్నాయి. అంతేకాకుండా అదనపు ఫీచర్లు వచ్చే చేరనున్నాయి. ఇందులో పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశముంది. అయితే, ఈ స్కూటర్ ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ లోనే మార్కెట్‌లోకి వస్తుందా? లేదా? అనేది త్వరలో తెలియనుంది. కొంత మంది ఈ కాన్సెప్ట్ హీరో ఫ్యాక్టరీ రేసింగ్ టీమ్ కోసం రూపొందించి ఉండవచ్చని భావిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే అసలు విషయం తెలియనుంది. ఇక రీసెంట్ గా హోండా కూడా భారత మార్కెట్ కోసం ADV160 స్కూటర్ డిజైన్‌ కు పేటెంట్ ను తీసుకుంది. ఈ నేపథ్యంలో అడ్వెంచర్ స్టైల్ స్కూటర్ల విభాగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

Read Also: సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో హీరో కొత్త ఈవీ.. మూడు చక్రాల స్కూటర్ ఏముంది భయ్యా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×