E-Paper
Advertisement

Kissik Talks: భార్యభర్తలు సంతోషంగా లేనప్పుడు విడాకులే బెటర్- వరలక్ష్మి

Kissik Talks: భార్యభర్తలు సంతోషంగా లేనప్పుడు విడాకులే బెటర్- వరలక్ష్మి
Advertisement

Kissik Talks: ఒక జంట మధ్య ఇష్టం లేనప్పుడు, కలిసి జీవించలేకపోతున్నప్పుడు విడిపోతేనే మంచిదని అన్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). సంతోషం లేకుండా కలిసి ఉండటం కంటే, విడిపోయి ఎవరి బతుకు వాళ్లు బతకడం మంచిదనేలా ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె కిస్సిక్ టాక్స్ (Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని.. మ్యారేజ్, విడాకులపై చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆమె చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే..

Also Read- Big TV Kissik Talks: నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టారు.. కర్మ అనుభవిస్తున్నారు- వరలక్ష్మి

విడాకులను ప్రొమోట్ చేయడం లేదు.. కానీ,

Advertisement

ప్రతి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటారంటే.. అది నిజం కాదు. కొన్ని సార్లు కొన్ని కొన్ని వర్కవ్వవు. సహజమైన కారణాలతోనే రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. కొంతమంది వచ్చి డివోర్స్ వద్దు అని చెప్పి, సంతోషం లేకుండా కాపురాలు చేయమనే బదులు.. వాళ్ల వాళ్ల లైఫ్‌లో హ్యాపీగా ఉంటే మంచిదే కదా. నేనేమీ విడాకులను ప్రొమోట్ చేయడం లేదు. కానీ, అందులో తప్పేం లేదని అంటున్నాను. ఎందుకంటే, ఇద్దరు హ్యాపీగా లేనప్పుడు ఎందుకు కలిసి ఉండాలి? మన లైఫ్ ఉండేదే చాలా తక్కువ. దానిని సంతోషం లేకుండా ఎందుకు గడపాలి? ఏదైనా మొదటి నుంచి మంచి పేరేంటిగ్ ఉంటే ఇలాంటివి జరగవు. జీవితం అనేది ఒక సర్కిల్ వంటిది. ఈ రోజు తల్లిదండ్రులను సరిగా చూసుకోలేని వాళ్లు.. రేపు తల్లిదండ్రులు అవుతాని గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు తమ పరిస్థితి ఏంటో కూడా ఆలోచించుకోవాలి. సరైన పేరేంటింగ్ ఉండే ఇలాంటివి జరగవు.

Also Read- Big TV Kissik Talks: 70 ఏళ్ల వాళ్లకి ఎందుకు పాలిటిక్స్?.. నేను రాజకీయాల్లోకి వస్తా!- వరు

మ్యారేజ్ పుట్టుకకు కారణమిదే!

Advertisement

అసలు మ్యారేజ్ (Marriage) అనేది సొసైటీలోకి ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు ఆడవాళ్లను రక్షించడానికి మగాళ్లు అవసరమయ్యారు. ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఇండిపెండింట్‌గా జీవించగలుగుతున్నారు. అప్పట్లో భర్త ఏం చెబితే భార్య అది పాటించాలి. ఎందుకంటే, అంతా అప్పుడు భర్తే చూసుకోవాలి. ఈ రోజు అలా లేదు.. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. నువ్వు చెప్పే మాటలు, విధానం నచ్చకపోతే.. నేను విడిగా ఉండొచ్చు. అప్పుడు ఆ ఛాయిస్ లేదు. మ్యారేజ్ కాన్సెఫ్ట్ కూడా మారుతూ వస్తుంది. మ్యారేజ్ అనేది బ్యూటీఫుల్ ఇనిస్టిట్యూషన్. కానీ, ఎందుకలా ఫామ్ అయింది? అది ఎలా ఛేంజ్ అయిందనేదే ఇప్పుడు ప్రశ్న. డొమెస్టిక్ వైలెన్స్ చేసే వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లని కలిసి ఉండమని అంటారా? అందుకే చెప్పేది.. ఏది ఎక్కువైనా అది పాయిజన్ అవుతుందని’’ అని విడాకులపై వరలక్ష్మీ శరత్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read- Varalaxmi Sarathkumar: వరలక్ష్మిలోని ఈ యాంగిల్ తెలుసా? విజయ్ పాలిటిక్స్‌పై ఒక్కటే మాట!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×