E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  దీప కార్తీక్‌ వెళ్లి సూరజ్‌ వివరాలు అడుగుతారు. ఎందుకు మీరేమైనా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా..? అని అడగ్గానే.. అవునని చెప్తారు కార్తీక్‌. దీంతో సూరజ్‌ జ్యోత్స్న పెళ్లితో పాటు నా పెళ్లి కూడా చేస్తారా..? అని అడగ్గానే.. అవునని ఎన్ని రోజులు పెళ్లి లేకుండా ఉంటావు అని దీప చెప్తుంది. అయితే సూరజ్‌ మనసులో జ్యోత్స్న ను ప్రేమించే విషయం బయట పెట్టించాలని కార్తీక్‌, దీపలు నాటకం ఆడతారు. వీళ్లు ముగ్గురు మాట్లాడుతుంటే.. డోర్‌లోంచి తొంగి చూస్తుంది జ్యోత్స్న.

వీడు నా పేరు చెప్తాడా ఏంటి..? అని జ్యోత్స్న అనుకుంటుంది. దీప, కార్తీక్‌ గట్టిగా నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో చెప్పు ఇక్కడెవ్వరూ లేరు కదా అంటుంది. సూరజ్‌ సిగ్గుపడుతూ.. జ్యోత్స్న అని చెప్తాడు. అప్పుడే జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్లి సూరజ్‌ కాలర్‌ పట్టుకుని తిడుతుంది. అప్పుడే సూరజ్‌  దీప ఇక్కడే ఎవ్వరూ లేరని చెప్పింది కానీ జ్యోత్స్న డోర్‌  లోంచి తొంగి చూస్తుంది అని చెప్పబోతుంటే.. మధ్యలో నువ్వు వచ్చావు అంటాడు సూరజ్‌. మళ్లీ తప్పించుకున్నావురా..? అంటూ జ్యోత్స్న తాతయ్య దగ్గరకు వెళ్తాను అంటూ వెళ్తుంది.

Advertisement

కోపంగా శివనారాయణ దగ్గరకు వెళ్లిన జ్యో.. సూరజ్‌ గురించి చెప్పబోతుంటే.. శివనారాయణ.. సూరజ్‌ తీసిన ఫోటోలు చూస్తూ.. సూరజ్‌ మన దగ్గర అబద్దం చెప్పాడు తను ఎంతో పెద్ద ఫోటో గ్రాఫర్‌ ఆ విషయం చెప్పకుండా దాచేశాడు. అంటూ వెటకారంగా చెప్తాడు. దీంతో జ్యో ఇరిటేట్‌ అవుతుంది. శివనారాయణ మాత్రం సూరజ్‌ గురించి గొప్పగా చెప్తుంటాడు. దీంతో జ్యో కోపంగా మీరు ఇక్కడ ఇలా ఉన్నారు అక్కడ దీప, బావ కూడా ఏదో పెళ్లి సంబంధం తెచ్చినట్టు వాడితో ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పగానే.. ఓ వాళ్లు అప్పుడే మొదలుపెట్టేశారా..? అని శివనారాయణ అడుగుతాడు. నిన్ను చూస్తుంటే.. నీ మనవరాలితో ఆడుకున్న వాడిని వదిలేసేటట్టు ఉన్నారు. అంటే అంత ఈజీగా ఎవరినీ వదలను అని శివనారాయణ చెప్పగానే.. ముందు వాడిని అవుట్‌ హౌస్‌ నుంచి వెళ్లగొట్టు తాత అంటుంది. సరే వాడు అవుట్‌ హౌస్‌లో ఉండేవాడు కాదులే అంటాడు. జ్యో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

శివనారాయణ, కార్తీక్‌, దీప, జ్యో కలిసి లంచ్‌ చేస్తుంటే సూరజ్‌ కంగారుగా వచ్చి తనకు ఐదు లక్షల రూపాయలు కావాలని అడుగుతాడు. ఎందుకని శివనారాయణ అడిగితే కొంచెం అర్జెంట్‌ అవసరం ఉందని.. విషయం తర్వాత చెప్తానని అంటాడు. శివనారాయణ మేనేజర్‌కు చెప్పి సూరజ్‌కు కావాల్సిన డబ్బు అరెంజ్‌ చేయమనమని కార్తీక్‌కు చెప్పగానే.. జ్యో అడ్డుపడి తను మన కంపెనీలో సూరజ్‌ ఎంప్లాయి కాదు కదా అడ్వాన్స్‌ ఎలా ఇస్తారు. అంటూ అడ్డు పడగానే.. శివనారాయణ అవును నిజమే అయితే చైర్మన్‌కు ఐదు లక్షలు ఇవ్వొచ్చు కదా..? కార్తీక్‌ నువ్వు వెళ్లి మేనేజర్‌కు చెప్పు అనగానే.. సూరజ్‌ ఎమోషనల్‌గా థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతాడు. వెనకే వెళ్లబోతుంటే.. శివనారాయణ కార్తీక్‌ను ఆపేసి నువ్వు సూరజ్‌ వెనకాలే ఫాలో అవ్వమని చెప్తాడు కార్తీక్‌ అలాగేనంటూ వెళ్లిపోతాడు. సూరజ్‌ హాస్పిటల్‌కు వెళ్లి ఎవరో ఒక వ్యక్తి ఆపరేషన్‌కు డబ్బులు కట్టడం చూసి ఆశ్చర్యపోతాడు. సూరజ్‌ గురించి ఈ పెద్దాయన ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చని అనుకుంటాడు.

Advertisement

జ్యోత్స్న ఇంట్లో ఉన్న పారిజాతానికి ఫోన్‌ చేసి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్తుంది. పారిజాతం వెటకారంగా ఇప్పడేం జరగడం లేదని చెప్తుంది. అయితే జ్యో కోపంగా అసలు సూరజ్‌ విషయంలో ఇంట్లో జరిగే విషయాల గురించి చెప్పమని అడుగుతుంది. సరేనంటుంది పారిజాతం. హాస్పిటల్‌ లో చూసిన విషయాలు కార్తీక్‌, శివనారాయణకు ఫోన్‌ చేసి చెప్తాడు. శివనారాయణ హాస్పిటల్‌కు వెళ్తాడు. కార్తీక్ తో కలిసి సూరజ్‌ కలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి సూరజ్‌ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆ వ్యక్తి చెప్పిన విషయాలు విని కార్తీక్‌, శివనారాయణ ఎమోషనల్‌ అవుతారు. వెంటనే శివనారాయణ, కార్తీక్‌ ఇంటికి వెళ్తారు.

ఇంట్లో అందరినీ పిలిచి సూరజ్‌ అనాథ అని చెప్తాడు శివనారాయణ. సూరజ్‌ అనాథ అని చెప్పగానే.. సుమిత్ర, దశరథ షాక్‌ అవుతారు. వాడు ఎవడైతే మనకేంటి సుమిత్ర అని పారిజాతం అంటే.. సూరజ్‌కు జ్యోత్స్నకు పెళ్లి చేస్తే బాగుంటుందని మేమంతా అనుకుంటున్నాం అని సుమిత్ర చెప్పగానే.. పారిజాతం, జ్యో షాక్‌ అవుతారు. జ్యో కోపంగా అందరినీ తిడుతుంది. అనాథకు ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకుంటారా..? అంటూ నిలదీస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×