E-Paper
Advertisement

Big TV Kissik Talks: నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టారు.. కర్మ అనుభవిస్తున్నారు- వరలక్ష్మి

Big TV Kissik Talks: నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టారు.. కర్మ అనుభవిస్తున్నారు- వరలక్ష్మి
Advertisement

Big TV Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Bigg TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) తన ప్రేమ గురించి, తన భర్త గురించి అనేక విషయాలను తెలిపారు. ‘‘లవ్ అనేది చాలా బ్యూటీఫుల్. అది ఒక పార్టనర్‌షిప్. లవ్ అనేది ఒక వైపు మాత్రమే ఉండకూడదు. రెండు వైపులా సమానంగా ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. నా దృష్టిలో లవ్ అంటే రెస్పెక్ట్ అని చెబుతాను. అబ్బాయి, అమ్మాయి అనే భేదాలు లేకుండా లవ్ అనేది అందరికీ సమానంగా ఉండాలి. 40 ఇయర్స్‌లో ఎరేంజ్ మ్యారేజ్ ఎలా అవుతుంది.. నాది లవ్ మ్యారేజే. తను ఫస్ట్ నాకు ప్రపోజ్ చేశాడు. ఆయన చూడటానికి అలా కనిపిస్తారు కానీ, హార్ట్ చాలా సాఫ్ట్. చాలా సెన్సిటివ్. ఫస్ట్ మా అమ్మనాన్నలను కలిసి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మా ఫ్యామిలీ మొత్తాన్ని నార్వే తీసుకుని వెళ్లి, అక్కడే ప్రపోజ్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు డైరెక్షన్ కూడా ఆయన పుష్ చేయడం వల్లనే. ప్రొడక్షన్ చూసింది మా చెల్లినే. నేను చేసిన సినిమా ఫస్ట్ కట్ చూసి.. నువ్వు ఇంత బాగా చేస్తావని అనుకోలేదని అన్నారు. నమ్మకం ఉంది కానీ, ఇంత బాగా చేస్తావనుకోలేదని.. చాలా గర్వపడ్డారు. తను లేకపోతే నేను డైరెక్టర్ అయ్యేదానిని కాదు.. ఈ ‘సరస్వతి’ సినిమానే లేదు.

Also Read- Varalaxmi Sarathkumar: లాస్ట్ 5 ఇయర్స్‌గానే సక్సెస్ చూశా.. అంతకుముందు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశా!

దీనికా అప్పుడు ఇంత ఏడ్చాం

Advertisement

నేను కర్మని బాగా నమ్ముతాను. నా లైఫ్‌లో నాకు చాలా మంది చెడు చేసినా కూడా, నేను పట్టించుకోలేదు. ఆటోమేటిగ్గా వాళ్లకే తగులుతుందని వదిలేశాను. అది కర్మ అంటారు. చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడంతా సఫర్ అవుతున్నారు. డిప్రషన్ అనేది ఒక సీరియస్ డిసీజ్. లవ్, బ్రేకప్ అనే వాటికి డిప్రషన్ అనే పదం వాడకూడదు. శాడ్‌గా మాత్రం ఫీలవ్వవచ్చు. ఏడ్వండి, ఫ్రెండ్స్‌తో మాట్లాడండి.. మళ్లీ వెంటనే నిలబడాలి. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి చూసుకుంటే.. అప్పటి బ్రేకప్‌లు చూస్తే నవ్వుతారు. ఆ టైమ్‌లో బ్రేకప్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే.. అయ్యో.. దీనికా అప్పుడు ఇంత ఏడ్చాం అని మనమే ఫీలవుతాం. లవ్వు, పెళ్లి మాత్రమే యాంబిషన్ కాదు.. జీవితం ఇంకా ముందు ఉంది.. ఆగకుండా వెళ్లండి. లవ్వు అనేది గోల్ కాదు.. అది దారిలో ఒక విషయం మాత్రమే.

Also Read- Varalaxmi Sarathkumar: వరలక్ష్మిలోని ఈ యాంగిల్ తెలుసా? విజయ్ పాలిటిక్స్‌పై ఒక్కటే మాట!

నమ్మకం పెట్టుకుంటే వదిలేసి వెళ్లిపోయాడు

Advertisement

లైఫ్‌లో మనం ఏం సాధించాలి అని ముందుకు వెళ్లాలి. నేను దేవుడ్ని నమ్ముతాను. హెల్ప్ చేసే ప్రతి వాడిలో నేను దేవుడ్ని చూస్తాను. ఈ దేవుడికే మొక్కాలని ఏం లేదు. అలాగే రోజూ పూజలు కూడా చేయను. నా పనిని దైవంగా భావిస్తాను. ఆధ్యాత్మికత నాలో ఎక్కువే. ప్రజలు ఎవరైతే హెల్ప్ చేస్తుంటారో వారిలో నేను దైవాన్ని చూస్తాను. నాకు ‘సరస్వతి’ సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన వారందరికీ గోల్డ్ కాయిన్ ఇచ్చాను. ఈ సినిమాతో మనీ బాగా వస్తే.. వాళ్లకి ఇంకా ఏదైనా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, వాళ్లు నాకోసం నిలబడ్డారు. ఇంకా మంచివాళ్లు ఉన్నారని నాకు నమ్మకం కలిగించారు. ఈ సినిమా జర్నీలో నన్ను బాధపెట్టిన వారు కూడా ఉన్నారు. నేను ఎంతో నమ్మకం ఉంచిన పెద్ద మనిషి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. అది వాళ్ల జర్నీ.. నా జర్నీ కాదు. ప్రతి వాళ్ల లైఫ్‌లోకి వెళ్లి నేను చూడలేను కదా. అది వాళ్ల ప్రాబ్లమ్’’ అని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు.

Also Read- Big Tv Kissik Talks: అమ్మాయిల పై వేధింపులు… కో** పడేయాలన్న వరలక్ష్మి!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×