E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో బెలూన్‌ బొమ్మ పేలడంతో అందరూ కంగారు పడుతుంటే మనోహరి మాత్రం భయపడుతూనే బయటకు వెళ్తుంది. ప్రచండను కలిసి జరిగిందంతా చెప్పాలి అనుకుంటుంది. అనుకున్నట్టుగానే.. మనోహరి వెళ్లిపోతుంది. అందరూ వద్దని వారిస్తుంటే.. అమర్‌ మాత్రం వెళ్లనివ్వండి అంటాడు. మనోహరి వెళ్లిపోతుంది.

అమర్‌ హాల్లో కూర్చుని ఉంటే పార్థు వెళ్లి మనోహరి అలా ఒంటరిగా ఎందుకు వెళ్లనిచ్చావు అమర్. ఎవరైనా మనోహరి మీద అటాక్ చేస్తే.. ఎలా అని అడుగుతాడు. అప్పుడే కాఫీ తీసుకొచ్చి అమర్‌కు ఇస్తుంది యాదమ్మ. అయితే అమర్‌ అలా అటాక్‌ జరగాలనే పంపించానని అమర్‌ చెప్పగానే. అందరూ షాక్‌ అవుతారు. రాథోడ్‌ మాత్రం ఏంటి సార్‌ మీరు చెప్పేది అంటాడు. అమర్‌ అవును రాథోడ్‌ ఇందాక మనోహరిని ఓదార్చినప్పుడు నేను మనోహరికి తెలియకుండా ఒక బగ్‌ రిసీవర్‌ పెట్టాను. ఇప్పుడు మనోహరి ఏం చేస్తున్నా..? ఎవరితో మాట్లాడుతున్నా అంతా నా ఫోన్‌ నుంచి వినొచ్చు అని చెప్తాడు.

Advertisement

ఆ మాటలకు మిస్సమ్మ సూపర్‌ ప్లాన్‌ అంటుంది. అమర్‌ ప్లానేంటి..? అని అడగ్గానే.. అదే సార్‌ మీరు మనోహరిని సేవ్‌ చేసేందుకు బగ్‌ పెట్టారు కదా..? అదే సూపర్ అంటుంది అని కవర్‌ చేస్తాడు. మిస్సమ్మ మాత్రం సంతోషంగా రాథో చెవిలో ఇక ఇవాళ్టీతో మనోహరి పని అయిపోయింది రాథోడ్‌ అంటుంది. రాథోడ్‌ కూడా అవును మిస్సమ్మ మనోహరి తను తీసుకున్న గోతిలో తనే పడనుంది అంటాడు.. అమర్‌ మాటలు విన్న యాదమ్మ కంగారుగా అయ్యో మనోహరి ఇవాళ దొరికిపోయేటట్టు ఉన్నావు.. ఇప్పుడెలా..? అనుకుంటూ మెల్లగా రూంలోకి వెళ్తుంది.

రూంలోకి వెళ్లిన యాదమ్మ బెడ్‌ కింద ఉన్న తన ఫోన్‌ తీసుకుని మనోహరి సీక్రెట్‌ ఫోన్‌కు కాల్‌ చేస్తుంది. ఆ ఫోన్‌ ఇంట్లోనే రింగ్‌ అవుతుంది. ఆ ఫోన్‌ చూసిన యాదమ్మ షాక్‌ అవుతుంది. అయ్యో మనోహరి ఇవాళ ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేకపోతున్నాడు.. ఫోన్‌ ఇక్కడే పెట్టి వెళ్లావా..? అనుకుంటూ ఇక నేను కూడా ఈ ఇంట్లోంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎస్కేప్‌ కావాలి అనుకుంటూ మెల్లగా బయటకు వెళ్తుంది.

Advertisement

అమర్‌ తన ఫోన్‌ ఆన్‌ చేసి బగ్‌ రిసీవర్‌ ఆన్‌ చేస్తాడు. ఫోన్‌లో మనోహరి కారులో వెళ్తున్న సౌండ్‌.. కారులో ప్లే అవుతున్న పాటలు వినిపిస్తాయి. కాసేపటి తర్వాత మనోహరి ప్రచండ ఇంటిలోకి వెళ్తుంది. అక్కడ ప్రచండ శిష్యుడు ఉండటం చూసి ఏయ్‌ ఎవర్రా నువ్వు అంటుంది. ఆ శిష్యుడు సైలెంట్ గా చూస్తుంటాడు. ఇటువైపు వాయిస్‌ వింటున్న పార్థు.. అమర్‌, మనోహరి ఏదో ప్రమాదంలో పడినట్టు ఉంది అంటాడు. అమర్‌ పూర్తిగా విందాం.. అంటాడు. మిస్సమ్మ, రాథోడ్‌ మాత్రం ఇవాళ మనోహరి పని అయిపోయింది. అడ్డంగా తనకు తానే దొరికిపోతుంది అని సంబరపడుతుంటారు. అక్కడే ఉన్న యాదమ్మ మాత్రం తను పెట్టేబేడా సర్దుకోవాలి అనుకుంటుంది.

ప్రచండ రూంలోంచి బయటకు వస్తూ.. మనోహరిని చూస్తూ సైలెంట్‌గా ఉండమని సైగ చేస్తాడు. మనోహరి సైలెంట్‌గా ఉంటుంది. ప్రచండ దగ్గరకు వచ్చి మనోహరి శారీకి ఉన్న బగ్‌ తీసి దాన్ని మంత్రశక్తితో పని చేయకుండా చేస్తాడు. అప్పుడు అది అమర్‌ పెట్టాడని ఇప్పుడు మంత్రశక్తితో ఆపేశానని ఇది ఆన్‌ చేశాక తెలియనట్టు మాట్లాడు అని చెప్తాడు. మనోహరి సరే అంటుంది. ప్రచండ మంత్రశక్తితో బగ్‌ పని చేసేలా చేస్తాడు.

అప్పుడు మనోహరి కోపంగా ఏయ్‌ ఎవర్రా నువ్వు గుడిలో చుట్ట కాలుస్తున్నావేంటి..? అంటూ తిడుతుంది. సారీ మేడం.. బయటకు వెళ్తాను అంటూ ప్రచండ శిష్యుడు చెప్తాడు. అంతా విన్న పార్థు రిలాక్స్‌ గా హమ్మయ్య మనోహరి గుడిలో ఉంది అమర్‌ అని చెప్తాడు. యాదమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. మనోహరి దొరికిపోనందుకు మిస్సమ్మ, రాథోడ్‌ డిస్సపాయింట్‌ అవుతారు. అమర్‌ మాత్రం తనకేదో అనుమానంగా ఉందని చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×