E-Paper
Advertisement

బిగ్ బాస్-10 లోకి సింగర్ మంగ్లీ.. వారానికి ఎన్ని లక్షలంటే?

బిగ్ బాస్-10 లోకి సింగర్ మంగ్లీ.. వారానికి ఎన్ని లక్షలంటే?
Advertisement

Singer Mangli:ఒకప్పుడు జానపద పాటలతో వెలుగులోకి వచ్చి.. ఆ తర్వాత సినిమా పాటలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న మంగ్లీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. సింగర్ గా తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్న ఈమె.. తన అద్భుతమైన స్వరంతో ఎంతోమంది శ్రోతలను అలరిస్తోంది.. అలాంటి ఈమె గత కొంతకాలంగా వివాదాలలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ కేసులో రూ.150 కోట్ల భారీ స్కామ్ వెనుక మంగ్లీ హస్తం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ.. బిగ్ బాస్ లో ఆఫర్..

అంతేకాదు మంగ్లీ ప్రమేయం లేకుండానే మంగ్లీ పేరును ఉపయోగిస్తూ అడ్వకేట్ సుబ్బారావు పోలీస్ స్టేషన్లో ఈమెపై కంప్లైంట్ చేశారు. అటు మంగ్లీ కూడా తనకు ఏ పాపం తెలియదని.. పాటలు పాడడం తప్ప తాను ఎలాంటి స్కామ్ లకు పాల్పడలేదు అంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతం అయింది. ఇక ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మధు అప్రూవర్ గా మారి, ఈ కేసుకి , మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు.. ఈ కేసులో కీలకమైన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి ..అతని స్నేహితుడు అడ్వకేట్ సుబ్బారావు..వీరిద్దరూ కలిసి మంగ్లీ పేరును ఇందులోకి లాగారు. అంతేతప్ప మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు అంటూ కుండబద్దలు కొట్టేశారు అంతేకాదు ఈయనను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇక విచారణలో భాగంగానే ఇలాంటి ఎన్నో విస్తుపోయే నిజాలను ఆయన బయటపెట్టడం జరిగింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో అవకాశం..

Advertisement

ఇలా ఒకవైపు ఈ కేసు నడుస్తుండగానే మరొకవైపు మంగ్లీ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. అదే వరల్డ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10లో అవకాశం. తెలుగులో ఈ షో సరికొత్త సీజన్ త్వరలో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సింగర్ మంగ్లీ కి ఇందులో అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వారానికి ఆమెకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే విషయం కూడా ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది.

ALSO READ:హమ్మయ్య.. పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఆ నష్టం భరించాల్సిందేనా?

వారానికి అన్ని లక్షలా?

Advertisement

తాజాగా ఒక వైపు సింగర్ గా.. మరొకవైపు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఈమెను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడానికి నిర్వాహకులు సంప్రదించారట. దీంతో వారానికి ఏకంగా 5 లక్షల రూపాయలు మంగ్లీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంటే బిగ్ బాస్ కార్యక్రమం మొత్తం 15 వారాలు కొనసాగుతుంది. ఒకవేళ మంగ్లీ గనుక 15 వారాలు హౌస్లో కొనసాగితే ఆమెకు మొత్తం 75 లక్షల భారీ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు టాప్ 5లో నిలిస్తే.. ప్రత్యేక అమౌంటు.. ఒకవేళ విజేత గా నిలిస్తే.. అందుకు వేరే అమౌంట్ కూడా ఈమెకు లభిస్తుంది అన్నమాట. ఏది ఏమైనా వారానికి ఐదు లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా ఈ రేంజ్ లో మంగ్లీ డిమాండ్ చేసిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా ఇందుకు సంబంధించిన ఈ బిగ్ బాస్ ఆఫర్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×