E-Paper
Advertisement

SRH, చెన్నై మ్యాచ్‌..తెర‌పైకి ఇడ్లీ సాంబార్‌, హైద‌రాబాద్ బిర్యానీ గొడ‌వ‌

SRH, చెన్నై మ్యాచ్‌..తెర‌పైకి ఇడ్లీ సాంబార్‌, హైద‌రాబాద్ బిర్యానీ గొడ‌వ‌
Advertisement

SRH VS CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 30 శాతం టోర్నమెంట్ ఫినిష్ అయింది. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ సాయంత్రం బిగ్ ఫైట్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. అటు ఇరుజట్ల ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ బిర్యానీ, చెన్నై సాంబార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. చెన్నై సాంబార్ పైన హైదరాబాద్ బిర్యానీ గెలుస్తుందని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో చెన్నై వర్సెస్ హైదరాబాద్ అభిమానుల మధ్య వార్ మొదలైంది.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ..

Advertisement

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ ఉప్పల్ వేదికగా సాయంత్రం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రెండు రోజుల కింద మహేంద్రసింగ్ ధోని హైదరాబాదులో అడుగు పెట్టాడు. తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు ధోని. నిన్న ప్రాక్టీస్ చేస్తూ ధోని స్టేడియంలో మెరిశాడు. దీంతో ఇవాల్టి మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోని ఆడతాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ జట్టుపైన మహేంద్రసింగ్ ధోనీకి మంచి రికార్డులు ఉన్నాయి. దీంతో మహేంద్ర సింగ్ ధోనీని తుది జట్టులో ఆడిస్తారని తెలుస్తోంది. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని ఆడితే మాత్రం స్టేడియం దద్దరిల్లిపోవడం గ్యారంటీ. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్ లు ఆడితే.. ఒక్క మ్యాచ్ లో కూడా ధోని ఆడలేదు. స్టేడియం లో కూడా మెరువలేదు. మరి ఇవాళ ఆడతాడా ? లేదా? అనేది చూడాల్సి ఉంది.

హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ రికార్డులు

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్ ల‌లో మాత్రమే విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 15 మ్యాచ్ ల‌లో విజయం సాధించింది. అంటే హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మంచి రికార్డు ఉంది. కానీ ప్రస్తుత సిచువేషన్ ప్రకారం చెన్నై కంటే హైదరాబాద్ చాలా బలంగా కనిపిస్తోంది.

Advertisement

CSK VS SRH Teams

CSK సంభావ్య XII: సంజు శాంసన్ (wk), రుతురాజ్ గైక్వాడ్ (c), ఆయుష్ మ్హత్రే, డెవాల్డ్ బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, జామీ ఓవర్టన్/మాట్ హెన్రీ, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (c), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా (WK), హర్ష్ దూబే/లియామ్ లివింగ్‌స్టోన్, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

 

 

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×