E-Paper
Advertisement

Meta layoffs: మెటా షాకింగ్ నిర్ణయం.. ఒక్కరోజులో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు..!

Meta layoffs: మెటా షాకింగ్ నిర్ణయం.. ఒక్కరోజులో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు..!
Advertisement

Meta layoffs: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా.. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టులను మరింత వేగవంతం చేసే క్రమంలో మరో భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ (Reuters) కథనం ప్రకారం.. మే నెలలో జరగబోయే మెుదటి విడత లేఆఫ్స్ లో ఏకంగా 8000 మంది ఉద్యోగులను మెటా తొలగించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మెటాకు ఉన్న సిబ్బందిలో ఇది 10శాతం కావడం గమనార్హం.

మే 20వ తేదీన లేఆఫ్స్..

మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) ప్రస్తుతం ఏఐ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. AI అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్న ఆయన.. ఈ క్రమంలో మెటాపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మే 20న తొలివిడత లేఆఫ్స్ ఉండబోతున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆ రోజున మెటాలో పనిచేసే 10 శాతం ఉద్యోగులను తొలగించి జీతభత్యాలను తగ్గించుకోవాలని మెటా నిర్ణయించినట్లు రాసుకొచ్చింది.

మరిన్ని కోతలు

Advertisement

అయితే మెటా ఆలోచన ధోరణి చూస్తుంటే ఈ ఒక్క లేఆఫ్ తో ఆగేటట్లు కనిపించడంలేదు. ఈ ఏడాది ద్వితీయార్థంలో మరిన్ని లేఆఫ్స్ ఉండవచ్చని సమాచారం. మెటా తన సిబ్బందిని 20 శాతం కంటే తక్కువకు తగ్గించవచ్చని.. దీని వల్ల సుమారు 15,000 – 20,000 మంది ఉద్యోగులు ప్రభావితం కావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు మెటా లేఆఫ్స్ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన మెుదలైంది. తమలో ఎవరిని ఉద్యోగం నుంచి తొలగిస్తారోనన్న భయం.. మెజారిటీ సిబ్బందిలో కనిపిస్తున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

గతంలోనూ ఇంతే..

అయితే మెటా గతంలోనూ ఓసారి భారీ ఎత్తున తన ఉద్యోగులను తొలగించింది. 2022-23 ఏడాదిలో మెటా తన ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ’ (Year of Efficiency) లో భాగంగా సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కాగా, ఇటీవలే స్నాప్ ఇంక్ దాదాపు 1000 మంది సిబ్బందిని లేఆఫ్స్ లో ఫైర్ చేసింది. ఫిన్ టెక్ కంపెనీ సైతం తన ఉద్యోగులను 40 శాతానికి తగ్గించాలని చూస్తోంది. ఇప్పటికే ఆ కంపెనీ సీఈఓ జాక్ డోర్సీ.. భవిష్యత్తులో తమ ప్రాధాన్యత ఏఐకే అని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు.

Advertisement

Also Read: హమ్మయ్య.. పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఆ నష్టం భరించాల్సిందేనా?

మెటాపై ఏఐ ప్రభావం?

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మెటా తన వర్కింగ్ స్టైల్, లక్ష్యాలను మార్చుకుంటోంది. తన రియాలిటీ ల్యాబ్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో కీలక మార్పులు చేస్తోంది. సాఫ్ట్‌వేర్ కోడింగ్, ఇతర సంక్లిష్ట పనులను నిర్వహించగల AI ఏజెంట్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. దీనివల్ల కొన్ని విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతోందని కంపెనీ భావిస్తోంది. ఉద్యోగుల తొలగింపు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ మెటా ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Also Read: Alia Bhatt: ఘనంగా అలియా భట్ సోదరి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే?

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×