E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీకి అబద్దం చెప్పిన మహా.. హారికకు నిజం చెప్తుందా..? విడాకులకు చక్రీ ఒప్పుకుంటాడా..?

Podarillu Today Episode : చక్రీకి అబద్దం చెప్పిన మహా.. హారికకు నిజం చెప్తుందా..? విడాకులకు చక్రీ ఒప్పుకుంటాడా..?
Advertisement

Podarillu Today Episode March 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి, మహా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంట్లోకి గాయత్రీ వస్తుంది. నువ్వు ఒకసారి వచ్చినందుకే మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు. ఈసారి గనుక వస్తే మమ్మల్ని చంపేసిన చంపేస్తారు. మీ వాళ్ళు వద్దన్నా సరే నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు అని చక్రి అంటాడు. ఆ తర్వాత మహా కూడా మాధవ్ ని అడగగానే ఎందుకు ఈసారి ఎక్కడ తీసుకొని వెళ్లి పెడదామని అనుకుంటున్నావు అని సీరియస్ గా అరుస్తుంది. అసలు బావని ఇలా తీసుకెళ్తారని అసలు ఊహించలేదు. చాలా బాధగా ఉంది అందుకే బావకి క్షమించమని అడగడానికి వచ్చాను అని గాయత్రి అంటుంది. నువ్వు ఇలా వచ్చావని తెలిస్తే మీ అమ్మ మరోసారి మళ్లీ గొడవ చేస్తుంది ఎందుకు ఇక్కడికి రావడం ఎందుకు వెళ్ళిపో అని మహాలక్ష్మి అంటుంది. బావ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ఇలా రావాలి అని అనుకున్నాను అంతే.. తప్ప మిమ్మల్ని ఇలా పోలీసులు తీసుకెళ్లాలని నేను ఏ రోజు అనుకోలేదు అని గాయత్రి చెప్తుంది.

నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని పెళ్లి చూపులకు ఎందుకు కూర్చున్నావు అని మహాలక్ష్మి గాయత్రి ని అడుగుతుంది.. మా అమ్మ చచ్చిపోతాను అని బెదిరిస్తే కూర్చున్నాను అని గాయత్రి అంటుంది. నువ్వు ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం అని మహాలక్ష్మి అంటుంది.. ఇక నారాయణ వచ్చి గాయత్రిని నా కొడుకుని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ధైర్యం చేయాలని ఎంత చెప్తున్నా సరే గాయత్రి మాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. మహాలక్ష్మికి ఫోన్ రావడంతో నేను అర్జెంటుగా మా ఫ్రెండ్ ని కలవాలి బయటకు వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహా ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలి అని చక్రి కూడా ఆమెను ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు.. మహా హారికను కలవడానికి ఒక రెస్టారెంట్ కి వెళుతుంది.. వెనకాల వెళ్లిన చక్రి ఆమెను ఫాలో అవుతూ ఆ రెస్టారెంట్ కి వెళ్తాడు. నిన్ను కలవడానికి అని వచ్చావు. నువ్వు మీ వదినని కలవడానికి వచ్చావా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని చక్రి అనుకుంటాడు.. అయితే వాళ్ల వెనకాలే తెలియకుండా అక్కడ కూర్చుంటాడు. చక్రిని నేను కావాలని పెళ్లి చేసుకోలేదు అసలు ఏం జరిగింది అన్నది మహాలక్ష్మి హారికకు చెప్తుంది. భూషణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇదంతా చేసావా అసలు నమ్మలేకపోతున్నాను మహా అని హారిక అంటుంది.

నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సరేనువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సరే.. ఎవరు అవునన్నా కాదన్నా కూడా మీ ఇద్దరికీ ఇప్పుడు అధికారికంగా పెళ్లయిపోయినట్లే.. అరే సర్టిఫికెట్ కూడా వచ్చింది కాబట్టి మీరిద్దరూ అఫీషియల్ గా భార్య భర్తలు.. మీకు ఆ పిల్ల ఇష్టం లేకపోతే వెంటనే విడాకులు తీసుకో అని హారిక అంటుంది. అప్పుడు నువ్వు ఆ ఇంట్లోంచి వెళ్లిన ఎవరూ ఏమీ అనుకోరు అని హారిక చెప్పడంతో మహాలక్ష్మి దాని గురించి ఆలోచిస్తుంది. చక్రి మాత్రం వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. హారిక మా పిన్ని కొడుకు పెళ్లి ఉంటే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్ ను కలవడానికి అని చెప్పేసి బయటకు వచ్చాను. నేను వెళ్ళాలి మహా లేకపోతే మీ అన్నయ్యకి డౌట్ వస్తుంది అని హారిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

ఇక మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. చక్రి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడ పెట్టాడు అని వెతుకుతూ ఉంటుంది. అయితే ఎలాగైనా సరే ఈ విడాకుల గురించి చక్రి తో మాట్లాడాలి అని అనుకుంటుంది.. నేను మీతో మాట్లాడాలి అలా సరదాగా బయటికి వెళ్ళొద్దామని మహాలక్ష్మి అడగడంతో చక్రి ఇంకేదో అనుకొని మాట్లాడడానికి అని బయటకు వెళ్తాడు. మరి విడాకుల గురించి మహాలక్ష్మి చక్రిత చెప్తుంది. నేను ఇకనుంచి వెళ్ళిపోవాలండి లేకపోతే అందరూ తప్పుగా అనుకుంటారు అని అంటుంది.

Also Read : పార్వతికి మాటిచ్చిన అవని.. పల్లవిపై కమల్ కు అనుమానం.. అవని స్ట్రాంగ్ వార్నింగ్..

వాళ్ల వదిన ను కలిసిన తర్వాత ఇంకే ఫిట్టింగ్ పెడుతుందో అని నాకు కంగారుగా ఉంది అని చక్రి అనుకుంటాడు. అయితే మహాలక్ష్మితో ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే తాను మాత్రం విడాకులు తీసుకుని వెళ్లిపోవాలని కచ్చితంగా చెప్పేస్తుంది. ఇకపోతే గాయత్రి మాత్రం తన బావని తలుచుకొని బాధపడిపోతూ ఉంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో గాయత్రి ధైర్యం చేసి మాధవ కోసం వస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×