E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మరోసారి మోసపోతున్న మనోజ్.. రోహిణి పార్టీ ప్లాన్ వర్కౌట్.. గ్రాండ్ గా ఫంక్షన్…

Gundeninda GudiGantalu Today episode: మరోసారి మోసపోతున్న మనోజ్.. రోహిణి పార్టీ ప్లాన్ వర్కౌట్.. గ్రాండ్ గా ఫంక్షన్…
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. దినేష్ వచ్చాడని విద్య రోహిణి కి ఫోన్ చేసి చెప్తుంది. అయితే ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి మాత్రం దినేష్ తన ఫాదర్ అసిస్టెంట్ అకౌంటెంట్ అని చెప్తుంది. రిలీజ్ అవ్వడానికి ఇంకొక నెల టైం పడుతుందని అన్నారట అందుకే నేను ప్రతిసారి నేల నెల అని అంటున్నానని రోహిణి అంటుంది. మరి మీ నాన్న ఆస్తులు ఒక మూడు కోట్లు అయినా ఉంటాయా? ఆస్తులు మీ నాన్న రిలీజ్ అయిన తర్వాత వస్తాయా అని అడుగుతుంది ప్రభావతి.. మూడు కోట్లు కాదు 300 కోట్లు ఉన్నాయి మా నాన్న వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ రిలీజ్ అవుతాయి అని రోహిణి చెప్పగానే ప్రభావతి షాక్ అయిపోతుంది.. 300 కోట్ల అని కిందకి వెళ్ళిపోతుంది. ప్రభావతిని ఆ స్థితిలో చూసిన సత్యం కాస్త టెన్షన్ పడినా సరే.. అప్పుడే ప్రభ వెళ్ళిపోదులే అని ఆలోచిస్తూ ఉంటాడు.. ప్రభా ఏమైంది ఎందుకు అలా బిగుసుకుపోయావు అని చెప్పగానే రోహిణి వాళ్ళ నాన్న ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి అని అడుగుతుంది..

వాళ్ల నాన్నతో అసలు మాట్లాడడమే లేదు ఆయన ఆస్తులు గురించి నాకు ఎలా తెలుస్తుంది అని సత్యం అంటాడు. ఆయనకు దాదాపు 300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట అవన్నీ మనోజ్ కి దక్కుతాయి కదా అని అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావ్ ప్రభ కొంచమైన ఆలోచించి మాట్లాడుతున్నావా ఆయన ఆస్తులు మనోజ్ కి ఎలా వస్తాయి అని సత్యం అడుగుతాడు. ఆయనకు ఒక్కదాని ఒక కూతురైన రోహిణి కే కదా తన ఆస్తి అంతా వచ్చేది ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు అని అంటుంది ప్రభావతి.. రవి సుధీర్ అప్పుడే ఇంటికి వస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. సుమతికి మంచి అబ్బాయి దొరికాడు. అయితే నువ్వు పెళ్లికి ముందు ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకున్నావు అని మీనా ను బాలు అడుగుతాడు. నాకు ఇప్పుడు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నాకేం అవసరం ఉందండి అని నేను ఎంతగా అంటున్న సరే బాలు మాత్రం అస్సలు వినకుండా నువ్వు ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకున్నావో ఒకసారి చెప్పు మీనా అని బలవంతంగా అడుగుతాడు. మంచిగా చదువుకున్న అబ్బాయి అయ్యుండాలి అని అనుకున్నాను. గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుండేది అని అనుకున్నాను అని బాలు తో మీనా అంటుంది. కానీ మీనా చెప్పిన లక్షణాలు ఏవి బాలుకి లేకపోవడంతో నాకు ఏ లక్షణాలు లేకపోయినా నువ్వు నాతో భార్యగా బాగానే ఉంటున్నావు అని బాలు మీనా పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు.

ప్రభావతి సత్యం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రవి శృతి ఇంటికి వస్తారు. మీదేంటి అప్పుడే వచ్చారు అని ప్రభావతి. రోహిణి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తానని చెప్పింది త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది అందుకే వచ్చేసాము అని శృతి అంటుంది.. అప్పుడే ఇంటికి వచ్చిన బాలు మీనాలు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు అని అంటుంది ప్రభావతి. మేము మీకు ముందుకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటారు.. రోహిణి కూడా ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంది అదేంటి అని అందరూ ఆలోచిస్తూ ఉండగా ప్రభావతి ఆ గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ అనేమో అని అంటుంది. అవును అదే ఉంటుంది ఆవిడ గారు మొదటగా తల్లి అయితే బామ్మ ఆస్తి మొత్తం లక్షల మింగినోడికి వస్తుంది కదా ఈ భామావతి ఆశ కూడా అదే కదా అని ప్రభావతి పై సెటైర్లు వేస్తాడు బాలు.

Advertisement

అప్పుడే రోహిణి మనోజ్ ఇంటికి వస్తారు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని అనగానే ప్రభావతి అదేనా అని అడుగుతుంది. అది కాదు అత్తయ్య అని రోహిణి అంటుంది.. మేం కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని నేను అంటుంది.. ముందుగా మేమే ఇంటికి వచ్చాము కాబట్టి మేమే గుడ్ న్యూస్ చెప్తాము అని బాలు అంటాడు. కానీ ప్రభావతి మాత్రం వాడు గొప్ప బిజినెస్ మెన్ వాడే ఏదో మంచి న్యూస్ చెప్పబోతున్నాడు అన్నమాట. నువ్వు ఆగు నీ తర్వాత చెప్పొచ్చు కదా అనేసి ప్రభావతి అంటుంది. ఇక రోహిణి మనోజ్ కొచ్చిన డీల్ గురించి చెప్తుంది. అయితే అందరూ చాలా సంతోషపడతారు.

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. వంటలక్క అవుట్..

ఈ డీల్ మనకు రావాలి అంటే మనం భారీగా ప్లాన్ చేయాలి ఒక పార్టీ ఇవ్వాలి ఫారినర్స్ ని ఆకర్షించాలి అని రోహిణి చెప్పేస్తుంది. ఇదేదో తేడా ఎవరంగ ఉంది పోతే మొత్తం పోతారు అనేసి బాలు ఎంత చెప్తున్నా సరే. రోహిణి మనోజ్ మాత్రం ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడవా అని బాలుని తిడతారు. ఇక బాలు నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ కూడా చెప్పాలి చెప్పనివ్వండి అని అంటాడు. చిన్న పూల గంప ఉంది కదా అదే మీనా వాళ్ళు చెల్లెలు సుమతికి పెళ్లి ఫిక్స్ అయింది. అబ్బాయి చాలా మంచివాడు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దని అన్నాడు అని బాలు అనగానే ప్రభావతి ఏముంది అక్కడ ఇచ్చుకోవడానికి అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇక మీనా రంగంలోకి దిగి రెచ్చిపోతుంది.. అక్కడితో ప్రోమో పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×