E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కిడ్నాప్ కు రణవీర్ ప్లాన్ 

Nindu Noorella Saavasam Serial Today march 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కిడ్నాప్ కు రణవీర్ ప్లాన్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

అమర్‌ ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా మనోహరికి రణవీర్‌ కాల్‌ చేస్తాడు. వెంటనే తినడం ఆపేసిన మనోహరి బయటకు వెళ్లి రణవీర్‌తో ఫోన్‌ మాట్లాడుతుంది. ఏంటి ఈ టైంలో ఫోన్‌ చేశావు.. ప్రశాంతంగా భోజనం కూడా చేయనియ్యవా..? నెల రోజుల టైం ఇచ్చావు కదా..? అప్పుడే తొందరెందుకు అంటూ మనోహరి కోపంగా మాట్లాడుతుంది. దీంతో రణవీర్‌ కోపంగా మనోహరి ఫోన్‌ ఎత్తగానే గ్యాప్‌ ఇవ్వకుండా వాగుతున్నావేంటి..? నన్ను మాట్లాడనివ్వవా..? అనగానే.. మనోహరి కోపంగా నీ కూతురు నీకు కావాలి నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు అని చెప్పగానే.. రణవీర్‌ నువ్వు ఏమీ ఆలోచించాల్సిన పనిలేదు.. ఆల్రెడీ నేను లాయరు కలిసి ఒక ప్లాన్‌ చేశాం అని చెప్పగానే.. ఏంటా ప్లాన్‌ అని అడుగుతుంది మనోహరి..

దీంతో రణవీర్‌ అంజు పాపను కిడ్నాప్ చేసి అమరేంద్రను బెదిరించి నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం అదే నా ప్లాన్‌.. అని చెప్పగానే.. మనోహరి కోపంగా మంచి ప్లాన్‌ ఆలోచించారు. ఎలాగూ నేను అడుగుతుంటే అమర్ చెప్పడం లేదు.. భాగీ, రాథోడ్‌ చెప్పనివ్వడం లేదు.. ఇలాగైనా పాప ఆచూకి తెలుస్తుందేమో చూద్దాం.. అనగానే.. చూద్దాం అంటే సరిపోదు.. నీకు నేను చాలా సార్లు హెల్ప్‌ చేశాను.. ఈ ప్లాన్‌ లో నువ్వు నాకు హెల్ప్‌ చేయాలి. అని రణవీర్‌ అడగ్గానే.. మనోహరి నేనేం చేయాలి అని అడుగుతుంది. దీంతో రణవీర్.. అంజు పాపను నువ్వే ఎత్తుకొచ్చి నాకు అప్పగించాలి అని చెప్పగానే.. అప్పుడు నేను ఇరుక్కుంటాను అసలే ఆ పిల్ల చాలా తెలివైంది. అని మనోహరి చెప్పగానే.. రణవీర్‌ కోపంగా నేను  ఇంట్లోకి వచ్చి ఆ పిల్లను కిడ్నాప్‌ చేయలేను కదా..? అంటాడు.

Advertisement

మనోహరి దానికి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు నీ టైం బాగుండి కరెక్టు ప్లాన్‌ ఆలోచించావు.. రేపు ఇక్కడ హోళీ జరుగుతుంది. అనాథ ఆశ్రమం పిల్లలు వస్తున్నారు.. ఆ పిల్లలతో కలిసి ఈ పిల్లలు హోళీ ఆడబోతున్నారు.. ఆ సందర్భంలో నువ్వు వచ్చి చడీ చప్పుడు కాకుండా అంజును ఎత్తుకుపో.. ఆ పని పూర్తి అయ్యే లోపు ఇక్కడ ఎవ్వరికీ డౌటు రాకుండా నేను మానేజ్ చేస్తాను అని మనోమరి చెప్పగానే.. రణవీర్‌ హ్యాపీగా ఆ సరే సరే నువ్వు ఆ ఏర్పాట్లు చూడు మిగతా పని నేను పూర్తి చేస్తాను అంటాడు. దీంతో మనోహరి ఇదిగో నేను మళ్లీ చెప్తున్నాను.. ఈ విషయంలో నా పేరు ఎక్కడా బయటకు రాకూడదు.. అమర్‌కు నా గురించి తెలిసిందో నువ్వు నా మాజీ మొగుడివి అని కూడా చూడకుండా నిన్ను చంపేస్తాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో రణవీర్ ఏయ్‌ నాకు కావాల్సింది ఆస్థి అది నాకు దక్కితే చాలు.. నిన్ను ఇరికిస్తే నాకేం వస్తుంది అనగానే..

మనోహరి కూడా అదే చెప్తున్నాను.. నన్ను ఇరికిస్తే నీకేం రాదు.. పైగా నీ ప్రాణం పోతుంది. అమర్‌తో నా పెళ్లి దగ్గర పడుతుంది. దాన్ని చెడగొట్టకు.. అని చెప్పగానే.. రణవీర్‌ అలాగేనే నా భార్యామణి నీ పని నీది నా పని నాది.. రేపు కలుద్దాం అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు.. మనోహరి మాత్రం రేపటితో రణవీర్‌ పీడ విరగడి అవుతుంది. అంజును అడ్డు పెట్టుకుని అమరేంద్రతో నా  కూతురు ఎక్కడుందో చెప్పిస్తే.. ఆ పిల్లను తీసుకుని రణవీర్‌ నా దారికి అడ్డు రాకుండా వెళ్లిపోతాడు.. అని ఆలోచిస్తుంది. మరోవైపు రణవీర్‌తో లాయరు మనోహరి ఏమంటుంది సార్‌ అని అడగుతాడు.. దీంతో రణవీర్ ఏమంటుంది మనం తనను ఇరికించకూడదట. నా మాజీ భార్య నాతోనే చెప్తుంది. మరోకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుందట..అనగానే..

Advertisement

లాయరు నవ్వుతూ కలికాలం సార్‌ ఏం చేస్తాం.. అంటాడు. ఇక రణవీర్‌ కోపంగా ఆస్థి  నా చేతికి రావాలి.. ఆ మనోహరిని ఏదో ఒకటి చేయాలి లాయరు.. నన్ను వదిలేసి అది ఎలా హ్యాపీగా ఉంటుందో నేను చూస్తాను.. అంటూ రణవీర్‌ మందు తాగుతుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×