E-Paper
Advertisement

Portronics Vayu Cop: కారు డ్రైవర్ల కోసం సూపర్ గాడ్జెట్.. ఒకే డివైజ్‌లో టైర్ ఇన్‌ఫ్లేటర్, వ్యాకూమ్, జంప్ స్టార్టర్ ఇంకా

Portronics Vayu Cop: కారు డ్రైవర్ల కోసం సూపర్ గాడ్జెట్..  ఒకే డివైజ్‌లో టైర్ ఇన్‌ఫ్లేటర్, వ్యాకూమ్, జంప్ స్టార్టర్ ఇంకా
Advertisement

Portronics Vayu Cop| పోర్ట్రానిక్స్ కంపెనీ ఇండియాలో పోర్ట్రానిక్స్ వాయు కాప్ పేరుతో ఒక కొత్త కార్ యుటిలిటీ డివైస్‌ లాంచ్ చేసింది. ఈ ఒక్క డివైస్‌లో ఆరు ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ ఉపయోగం, ఎమర్జెన్సీ సమయంలో ఈ గాడ్జెట్ బాగా ఉపయోగపడుతుంది. కారు నడిపే వారు సాధారణంగా టైర్ ఇన్‌ఫ్లేటర్, వాక్యూమ్ క్లీనర్, జంప్ స్టార్టర్ వంటి టూల్స్ వేర్వేరుగా తీసుకెళతారు. కానీ ఇప్పుడు ఈ టూల్స్ చేసే పనులన్నీ ఒకే డివైస్‌లో దొరుకుతున్నాయి. టైర్ ఇన్‌ఫ్లేటర్, వాక్యూమ్ క్లీనర్, ఎయిర్ బ్లోవర్, బ్యాటరీ జంప్ స్టార్టర్, LED ఫ్లాష్‌లైట్, పవర్ బ్యాంక్.. ఇవన్నీ ఉన్నాయి.

ధర, లభ్యత

పోర్ట్రానిక్స్ వాయు కాప్ ధర రూ.5,999గా నిర్ణయించారు. అధికారిక పోర్ట్రానిక్స్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా దొరుకుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రొడక్ట్‌తో పాటు 12 నెలల వారంటీ వస్తుంది.

టైర్ ఇన్‌ఫ్లేటర్

Advertisement

పోర్ట్రానిక్స్ వాయు కాప్ గాడ్జెట్‌లో బిల్ట్-ఇన్ టైర్ ఇన్‌ఫ్లేటర్ ఉంది. ఈ ఇన్‌ఫ్లేటర్‌తో కార్, బైక్ టైర్లలో అవసరమైనప్పుడు సులభంగా గాలి నింపవచ్చు. గరిష్టంగా 150 PSI ప్రెజర్ వరకు సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ షట్-ఆఫ్ ఫీచర్ ఉంది. ఓవర్ ఇన్‌ఫ్లేషన్ రాకుండా చూస్తుంది. అంటే ఎక్కువ గాలి నింపే ప్రమాదం ఉండదు. కావాల్సిన ఎయిర్ ప్రెజర్ సెట్ చేసి టైర్ ఇన్‌ఫ్లేట్ చేయవచ్చు.

వాక్యూమ్ క్లీనర్ ఫీచర్

ఈ చిన్న గాడ్జెట్.. కాంపాక్ట్ వాక్యూమ్ క్లీనర్‌గా కూడా పనిచేస్తుంది. 5000Pa సక్షన్ పవర్ ఉంది. సీట్లు, ఫ్లోర్ మ్యాట్ల నుంచి దుమ్ము ఈజీగా తీసేస్తుంది. అయితే నీరు, తేమ ఉన్న ప్రదేశంలో వాక్యూమ్ క్లీనర్ ఫీచర్‌ని ఉపయోగించకూడదు. కార్ ఇంటీరియర్‌ క్లీన్‌గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. దుమ్ము, బ్రెడ్ క్రంబ్స్‌తో పాటు చిన్న చిన్న రాళ్లు ఏదైనా చెత్త ముక్కలు సులభంగా తీసేస్తుంది.

హై-స్పీడ్ ఎయిర్ బ్లోవర్

Advertisement

పవర్‌ఫుల్ ఎయిర్ బ్లోవర్ కూడా ఉంది. 10,000 RPM స్పీడ్‌తో పనిచేస్తుంది. ఎయిర్ వెంట్స్, ఇబ్బందిగా ఉన్న చోట్ల డస్ట్ తీసేస్తుంది. వాక్యూమ్ చేరని చిన్న గ్యాప్‌లను క్లీన్ చేయడానికి బాగుంటుంది.

ఎమర్జెన్సీ బ్యాటరీ జంప్ స్టార్టర్

వాయు కాప్‌లో 12V బ్యాటరీ జంప్ స్టార్టర్ ఫీచర్ కూడా ఉంది. ఇదే అన్నింటి కంటే బెస్ట్ ఫీచర్. కారులో బ్యాటరీ డెడ్ అయినప్పుడు కార్‌ వెంటనే స్టార్ట్ చేయడానికి సహాయపడుతుంది. డెడ్ బ్యాటరీ స్టార్ట్ చేయడానికి స్మార్ట్ సేఫ్టీ క్లాంప్స్ కూడా వస్తాయి. రివర్స్ పోలారిటీ, షార్ట్ సర్క్యూట్, ఓవర్‌కరెంట్ నుంచి రక్షణ ఇస్తాయి.

Also Read: వంట గ్యాస్ సిలిండర్ కంటే ఇండక్షన్ స్టవ్‌ కొనడం బెటర్.. ఆన్‌లైన్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే

LED ఫ్లాష్‌లైట్, పవర్ బ్యాంక్

బిల్ట్-ఇన్ LED ఫ్లాష్‌లైట్ ఉంది. SOS ఎమర్జెన్సీ లైటింగ్ మోడ్ కూడా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో రోడ్డు పక్కన సిగ్నల్ చేయడానికి ఉపయోగపడుతుంది. పోర్టబుల్ పవర్ బ్యాంక్‌గా కూడా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, చిన్న సైజు ఎలక్ట్రానిక్స్ ఛార్జ్ చేయవచ్చు.

బ్యాటరీ, మోటార్ పర్‌ఫామెన్స్

వాయు కాప్‌లో BLDC మోటార్ ఉంది. తక్కువ శబ్దం చేస్తూ స్టేబుల్‌గా పనిచేస్తుంది. ఇందులో నాలుగు 2000mAh రీఛార్జబుల్ బ్యాటరీలు ఉన్నాయి. టైప్-C ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. డిజిటల్ డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. టైర్ ప్రెజర్, డివైస్ స్టేటస్ చూపిస్తుంది.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు స్వయంగా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. ఈ ప్రకటనలో పేర్కొన్న విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు. ఈ వివరాలు కేవలం మీ సమాచారం కోసమే.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×