E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ 

Nindu Noorella Saavasam Serial Today Episode June 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మ బర్తుడే పార్టీ గ్రాండ్‌గా జరుగుతుంటుంది. అతిథులు అందరూ వస్తూ అమర్‌ను విష్‌ చేస్తూ ఉంటారు. అమర్‌ డల్లుగా చూస్తుంటే రాథోడ్ వెళ్ళి సార్‌ మీరు ఈ డ్రెస్‌లో చాలా హండ్సమ్‌గా ఉన్నారు. కానీ ఎందుకు సార్‌ డల్లుగా చూస్తున్నారు అని అడగ్గానే.. ఇక్కడకు వచ్చిన వాళ్లందరికీ నేను తెలుసు.. కానీ వీళ్లల్లో ఏ ఒక్కరూ కూడా నాకు గుర్తు రావడం లేదు అంటాడు. దీంతో రాథోడ్‌ మీకు మెల్లగా గుర్తు వస్తుందిలేండి సార్‌ అంటూ అదిగోండి సార్‌ మిస్సమ్మ వస్తుంది అని చెప్పగానే.. మిస్సమ్మ బ్యూటిఫుల్‌గా రెడీ అయి వస్తుంది. అమర్‌ తదేకంగా మిస్సమ్మను చూస్తుంటాడు. మిస్సమ్మ గార్డెన్‌ లోకి రాగానే మనోహరి కూడా మిస్సమ్మను చూస్తుంది. దగ్గరకు వెళ్లి ఏంటి భాగీ నన్ను డామినేట్ చేద్దామనే ఇంత బాగా రెడీ అయ్యావు.. నాకంటే ముందు అమర్‌ దగ్గరకు వెళ్దామనే.. అనగానే.. మిస్సమ్మ కూడా వెటకారంగా ఏం నువ్వు ముందు వెళ్దాం అనుకుంటున్నావా..? నాకు నువ్వు పోటీ ఏంటి..? నాకు నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పగానే..

మనోహరి కోపంగా ఇంత జరిగనా నీ పొగరు గర్వం ఇంకా తగ్గలేదు కదా..? అంటుంది.. దీంతో మిస్సమ్మ ఇది పొగరు కాదు నా మీద నాకున్న నమ్మకం. నా మీద నాకున్న విశ్వాసం. నేను నీలెక్క రోజుకొక రంగు మార్చే ఊసరవెళ్లిని కాదు అనగానే.. మనోహరి కోపంగా ఊసరవెళ్లి నేను కాదు నువ్వు ఈరోజు నీ అసలు రంగు బయటపెట్టబోతున్నాను అంటూ మనోహరి వార్నింగ్ ఇవ్వగానే.. నువ్వు నన్నేం చేయలేవు మనోహరి అంటుంది మిస్సమ్మ. దీంతో మనోహరి ఎందుకు చేయలేను నిన్ను ఐదేండ్లు అజ్ఞాత వాసం చేయించాను. నువ్వు కట్టుకున్న భర్త ఎదురుగా ఉన్నా నిన్ను అరణ్యవాసం చేయిస్తున్నాను అంటూ చెప్పగానే.. మిస్సమ్మ వెటకారంగా నవ్వుతూ పిచ్చి దానా జీవితంలో అరణ్యవాసాలు.. అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకం అని పాండవులు ఫ్రూవ్‌ చేశారు అంటూ చెప్పగానే..

Advertisement

మనోహరి నవ్వుతూ ఇప్పుడు నువ్వు పాండవులతో సమానం అని చెప్పుకుంటున్నావా..? అంత లేదు.. కాసేపట్లో నీ బండారం బయట పెట్టబోతున్నాను .. నీ బయోగ్రఫీ బయట పెట్టేది ఎవరో కాదు. వార్డెన్‌ సరస్వతి. కాసేపట్లో తను ఇక్కడికి వచ్చి తాను నీకు షాక్‌ ఇవ్వబోతుంది అని చెప్పగానే.. మేడం నాకెందుకు షాక్‌ ఇస్తుంది. ఈ ఫంక్షన్‌కు రమ్మని మేడంను నేనే పిలిచాను అని మిస్సమ్మ చెప్పగానే.. మనోహరి మాత్రం నువ్వు పిలిచావు కానీ ఈ ఫంక్షన్‌లో నీ గురించి చెప్పమని నేను బెదిరించాను. నీ గురించి చెప్పడమంటే.. అమర్‌ గురించి గతం చెప్పడం అంటూ మనోహరి చెప్పగానే.. మిస్సమ్మ భయంతో వద్దని గతం గుర్తు చేస్తే ఆయనకు ప్రమాదం అంటూ చెప్పగానే..

మనోహరి వినదు.. అప్పుడే వార్డెన్‌ సరస్వతి వస్తుంది. వెనకాలే వచ్చిన రణవీర్‌ వార్డెన్‌ సరస్వతిని బెదిరించి వెళ్లిపోతాడు. సరస్వతి వార్డెన్‌ను చూసిన మిస్సమ్మ షాక్‌ అవుతుంది. వెంటనే కోపంగా మనోహరిని తిడుతుంది. మనోహరి కూడా కోపంగా మిస్సమ్మకు వార్నింగ్‌ ఇచ్చి అమర్‌ దగ్గరకు వెళ్తుంది. మిస్సమ్మ వెంటనే సరస్వతి వార్డెన్‌ దగ్గరకు వెళ్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×