E-Paper
Advertisement

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?
Advertisement

Godari Gattupaina OTT : సినిమాలకు ఓటీటీలు రెండవ లైఫ్ ఇస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సినిమాలు థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా, ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. మరి ఇంతకీ బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టి ఓటీటీలో దుమ్మురేపుతున్న ఆ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం పదండి.

ఓటీటీలో అదరగొడుతున్న మూవీ

గ్రామీణ నేపథ్యంలో సాగే తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం ‘గోదారి గట్టుపైనా’ ఓటీటీలో అనూహ్యమైన విజయం సాధించింది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం తనకంటూ ఒక మార్క్ సృష్టించింది.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఈ మూవీ 4వ స్థానంలో ట్రెండింగ్ లోకి రావడం అన్నది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులో ఉన్న గ్రామీణ జీవితం, సరదా సన్నివేశాలు, రొమాంటిక్ మూమెంట్స్ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథ ఏమిటి ?

‘గోదావరి గట్టుపైనా’ అనేది ఒక సాధారణ గ్రామీణ యువకుడి (సుమంత్ ప్రభాస్) ప్రేమ కథ. గ్రామీణ వాతావరణం, కుటుంబ సంబంధాలు, స్నేహం, ప్రేమ, చిన్న చిన్న సంఘర్షణలు అన్నీ ఇందులో సహజంగా చూపించారు. నిధి ప్రదీప్ హీరోయిన్‌ గా తన అందం, నటనతో మెప్పించింది. జగపతి బాబు అనుభవం ఉన్న నటుడిగా బలమైన పాత్రను పోషించాడు.

Advertisement

Also Read : 25,21,00,000 వ్యూస్… నాలుగేళ్లుగా నెట్ ఫ్లిక్స్ ను ఊపేస్తున్న సిరీస్… ఇదేం పిచ్చి సామీ

OTTలో ఎందుకింత సక్సెస్ ?

థియేటర్లలో ప్రేక్షకులు ఆశించినంత హైప్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నా, ఓటీటీలో మాత్రం ఈ సినిమా తన ఒరిజినాలిటీని ప్రూవ్ చేసుకుంది. టికెట్ కొని థియేటర్లలో ఈ సినిమాను చూడడానికి ఆసక్తిని చూపని ఆడియన్స్, ఓటీటీలో ఎంచక్కా అందరూ ఇంట్లోనే కూర్చుని చూడ్డానికి ఇష్టపడుతుండడమే ఓటీటీలో ట్రెండ్ అవ్వడానికి కారణం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌ లో టాప్ ట్రెండింగ్‌ లో ఉండటంతో ఈ సినిమా OTTలో ఎంత బాగా పని చేస్తోందో చెప్పడానికి సాక్ష్యం. ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ హీరోగా, నిధి ప్రదీప్ హీరోయిన్ గా, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు నిర్మించారు. సినిమా సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా ఉన్నాయి. థియేటర్లలో కాస్త వెనుకబడినా, ఓటీటీలో ఈ సినిమా తనకంటూ ఒక మంచి ప్రేక్షకుల బేస్‌ ను సృష్టించుకుంది. రొమాంటిక్ కామెడీ, గ్రామీణ ఫీల్ ఇష్టపడే వాళ్లు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది.

Also Read : ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ నుండి ‘ఆఫీస్ రొమాన్స్’ వరకు… ఓటీటీలోకి 6 హాలీవుడ్ మూవీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×