E-Paper
Advertisement

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

Lingam OTT Release Date : జియో హాట్‌స్టార్ లో రాబోయే ఒరిజినల్స్ లో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సిరీస్ ‘లింగం’ (Lingam). లక్ష్మీ శరవణకుమార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళ ఒరిజినల్‌ గా ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి రానుంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

‘లింగం’ ఓటీటీ రిలీజ్ డీటైల్స్

జియో హాట్‌స్టార్ (JioHotstar) అఫిషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం… ‘లింగం’ మొదటి సీజన్ 2026 జూన్ 26న ప్రీమియర్ అవుతుంది. ప్రస్తుతం తమిళ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన అయితే వచ్చింది. తెలుగు, హిందీ ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు కూడా విడుదల అవుతాయని భావిస్తున్నారు. కానీ ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు హాట్ స్టార్. ఈ మూవీ ప్రీమియర్ దగ్గర పడుతున్న తరుణంలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

కథ ఏమిటి ?

Advertisement

ఈ సిరీస్ కన్యాకుమారిలో జరిగిన నిజ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన కథతో రూపొందింది. ఒక హత్య రహస్యం చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఉత్కంఠ, సస్పెన్స్‌తో నిండి ఉంటుంది. టాలెంటెడ్ కబడ్డీ ఛాంపియన్ (కతిర్) అనుకోని విధంగా తప్పు చేయని నేరంలో ఇరుక్కుంటాడు. దీంతో అండర్ వరల్డ్ లోకి ప్రయాణం చేయాల్సి వస్తుంది. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో అతడు కలలో ఊహించని అండర్ వరల్డ్ ప్రపంచంలోకి ప్రవేశించాల్సి వస్తుంది.

నిజానికి ఇది తాను ఎంచుకున్న మార్గం కాకపోయినా, పరిస్థితుల ప్రభావం వల్ల అతడు ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా, మాఫియా నాయకుడిగా ఎలా మారాడనేదే ఈ సిరీస్ ప్రధానాంశం. ఇందులో కతిర్ ప్రధాన పాత్రలో నటించగా… దివ్య భారతి, పూర్ణిమా రవి, సత్యలు కీలక పాత్రలు పోషిస్తారు. ‘విళంగు’ సిరీస్‌ తో పాపులర్ అయిన ప్రశాంత్ పాండియరాజ్ ఈ సిరీస్‌ కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

also Read : 2026 హారర్ హిట్ ‘ది మమ్మీ’ ఓటీటీలోకి… ఈ 2 రీజన్స్ తెలుసుకున్నాక మూవీ జోలికే వెళ్లరు

ఈ మూవీని ఎందుకు చూడాలి ?

‘లింగం’ మొదటి సీజన్ నుంచే స్టోరీ టెల్లింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. నిజ సంఘటనల ఆధారంగా తీసిన కథ, బలమైన స్క్రీన్‌ప్లే, ఉద్రిక్తత నిండిన సన్నివేశాలు ఈ సిరీస్ ప్రత్యేకత. కతిర్ నటన ఇందులో హైలెట్. అందుకే ఆయన ఫ్యాన్స్ దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎవరెవరు ఏ పాత్రల్లో ?

కతిర్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. దివ్య భారతి, పూర్ణిమా రవి, సత్య కీలక పాత్రలు పోషించారు. లక్ష్మీ శరవణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జియోహాట్‌స్టార్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది.

Also read : థియేటర్లను దడదడలాడిస్తున్న హారర్ థ్రిల్లర్… ఓటీటీ స్ట్రీమింగ్ పుకార్ల వెనకున్న నిజం ఇదే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×