E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  పార్థు తన ఎంక్వైరీ గురించి మాట్లాడుతూ మనోహరిని రణవీర్‌ భార్యమోనని అనుమానిస్తాడు. పార్థు మాటలకు మనోహరి భయంతో కోపంగా పార్థును తిడుతుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు అంటూ కోప్పడుతుంది. అందుకు పార్థు జస్ట్‌ అన్నాను అంతే కానీ అదే అయ్యుండొచ్చు కూడా ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు కదా అంటాడు. మనోహరి మాత్రం కోపంగా తినడం ఆపేసి వెళ్లిపోతుంది.

రూంలో బెడ్‌ షీట్‌ సర్దుతున్న మిస్సమ్మ తుమ్ముతుంటే.. అమర్‌ వెళ్లి అందుకే చెప్పాను ఐస్‌క్రీమ్‌ తినొద్దని అయినా వింటావా..? ఇప్పుడు చూడు జలుబు చేసింది అంటాడు. అయినా ఐస్‌క్రీమ్‌ తింటే నాకు జలుబు చేస్తుందని మీకెలా తెలుసు..? నిజం చెప్పండి మీకు గతం గుర్తుకు వచ్చింది కదా..? అని మిస్సమ్మ అనుమానంగా అడిగితే.. అదేంటి మిస్సమ్మ అలా అడుగుతున్నావు.. గతం గుర్తుకు వస్తే చెప్పకుండా ఉంటానా..? అయినా ఐస్‌క్రీమ్ తింటే ఎవరికైనా జలుబు చేస్తుంది. ఆ విషయం ఎవరికైనా తెలుస్తుంది కదా..? సరే ఆవిరి పట్టుకున్నావా…? అని అమర్‌ అడిగితే లేదు పట్టుకోలేదని మిస్సమ్మ చెప్తుంది. మరి జలుబు ఎలా తగ్గుతుంది. మెడిసిన్‌ తీసుకోలేదు.. ఆవిరి పట్టుకోలేదు అంటూ అమర్‌ తిడితే.. టాబ్లెట్‌ వేసుకుంటాను అని మిస్సమ్మ చెప్తుంది. అదేం లేదు టాబ్లెట్‌ వేసుకున్నా ఆవిరి పట్టుకోవాల్సిందే.. ఆవిరి పట్టే ట్యూట్స్‌ ఎక్కడున్నాయి అని అమర్‌ అడిగితే మొన్న మనోహరి తీసుకెళ్లింది అని చెప్తుంది మిస్సమ్మ. అయితే నేను వెళ్లి ట్యూబ్స్‌ తీసుకొస్తాను.. నువ్వు త్వరగా సర్ది వచ్చేయ్‌ ఆవిరి పట్టుకుందువు అంటూ అమర్‌ కిందకు వెళ్తాడు.

Advertisement

మనోహరి తన రూంలో కోపంగా చూస్తూ.. యాదమ్మతో ఆ పార్థు చాలా దగ్గరకు వచ్చేశాడు. రణవీర్‌ వైఫ్‌ను నేనే అన్న విషయం కనిపెట్టాడు. ఇక లేట్‌ చేయకూడదు ఏదో ఒకటి చేయాలి అంటే.. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు మనోహరి వెంటనే ఎక్కడికైనా పారిపో లేదంటే దొరికిపోతావు.. అప్పుడు అమర్‌ సార్‌ చేతిలో నీ బతుకు ఎలా అవుతుందోనని నాకే భయంగా ఉంది అంటుంది యాదమ్మ. పారిపోవడం కాదు ఆ పార్థు గాడినే లేకుండా చేయాలి. వాడి అడ్డు తప్పించుకోవాలి. లేకుంటే నేను రణవీర్‌ పెళ్లాన్ని అన్న విషయం కనిపెట్టేస్తాడు. అనగానే..

యాదమ్మ అనుమానంగా అది నీ వల్ల అవుతుందా..? అగ్నికి వాయవు తోడైనట్టు భాగీ ఆ ఆఫీసర్‌కు నీ మీద అనుమానం వచ్చేలా చేస్తుంది అనగానే.. అవును అది నిన్నటి వరకు నాతో డిఫెన్స్‌ ఆడింది. ఇప్పుడు అటాకే చేస్తుంది. దానికి రాథోడ్‌ తోడు అయ్యాడు.. అందుకే వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఆ పార్థు నా జోలికి రాకుండా చేయాలి అని చెప్తూ.. పక్కకు చూస్తుంది. డోర్‌ దగ్గర అమర్‌ నిలబడి ఉంటాడు. అమర్‌ను చూసిన యాదమ్మ, మనోహరి షాక్ అవుతారు. అమర్‌ దగ్గరకు వెళ్లి ఏంటి మనోహరి ఇంకా పార్థు గురించే ఆలోచిస్తున్నావా..? వాడు అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నావా..? అని అడగ్గానే.. మనోహరి భయంతో వణికిపోతూ సైలెంట్‌గా చూస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సముద్రంలో 10 కిమీలు లోపలికి.. నరాలు కట్ అయ్యి.. నూకరాజు చెప్పింది వింటే!

ఆపిల్స్ కోసం.. జ్వరం రావాలని కోరుకొనేవాళ్లం.. చికెన్ కూడా కొనలేని పరిస్థితి: నూకరాజు

తోటి కంటెస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయిన నూకరాజు!

బిగ్ బాస్ 10కి ముహూర్తం ఫిక్స్.. కంటెస్టెంట్స్ విషయంలో గందరగోళం!

హీరోలు సెట్ లో నాతో అలా ఉంటారు.. నటి సుధ కామెంట్స్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్.. మీనాకు ఘోర అవమానం..

Podarillu Today Episode : కేశవ త్యాగం.. శైలు మాటతో వరాలు షాక్.. హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం ధీరజ్ టెన్షన్.. భద్ర మాటతో ప్రేమ కన్నీళ్లు.. రామరాజు కీలక నిర్ణయం..?

Big Stories

Advertisement
×