E-Paper
Advertisement

ఆపిల్స్ కోసం.. జ్వరం రావాలని కోరుకొనేవాళ్లం.. చికెన్ కూడా కొనలేని పరిస్థితి: నూకరాజు

ఆపిల్స్ కోసం.. జ్వరం రావాలని కోరుకొనేవాళ్లం.. చికెన్ కూడా కొనలేని పరిస్థితి: నూకరాజు
Advertisement

Kissik Talks on Nookaraju: ఆంధ్రప్రదేశ్ అమలాపురంకి చెందిన నూకరాజు(Nookaraju ) బాల్యంలోనే ఎన్నో కష్టాలు పడి.. యుక్తవయసులో శారీరక శ్రమకు ఓర్చుకొని.. తన తెలివితేటలను ఆయుధంగా మార్చుకొని జబర్దస్త్(Jabardastha ) అనే కామెడీ షోలోకి అడుగుపెట్టారు. అక్కడ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎమోషనల్ గా కూడా కంటతడి పెట్టిస్తూ ఉంటారు. విభిన్నమైన గెటప్లతో.. వాయిస్ తో మిమిక్రీ చేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్వించే నూకరాజు జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన నూకరాజు తన బాల్యంలో తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకోవడమే కాకుండా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. మరి ఆయన మాటల్లోనే ఆ విషయాలు విందాం..

పావు కేజీ చికెన్ కోసం రెండు వారాలు ఎదురుచూసే వాళ్ళం – నూకరాజు

తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో హోస్ట్ గా వ్యవహరిస్తున్న వర్ష (Varsha) మాట్లాడుతూ..” ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది?” అని అడగగా..” మాకు రూ.4వేలు ఉంటే పడవ కొనుక్కోవచ్చు..ఆ 4 వేల కోసం అడగని వారు లేదు .. అప్పు చేయని రోజులు లేవు.. పావు కేజీ చికెన్ తినాలంటే రెండు వారాలు ఎదురుచూసే వాళ్ళం..

ఆపిల్స్ కోసం జ్వరం రావాలని కోరుకునేవాడిని -నూకరాజు

Advertisement

సంక్రాంతికి అందరూ ఆడుకుంటుంటే.. మేము సిమెంట్ పనులకు వెళ్లే వాళ్ళం. జ్వరం వస్తే మా అమ్మ ఆపిల్స్ కొంటుంది కదా అని జ్వరం రావాలని కూడా కోరుకునే వాళ్ళం. వాళ్లని చూసినప్పుడు పాపం అనిపిస్తూ ఉంటుంది” అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు నూకరాజు ప్రస్తుతం నూకరాజు చేసిన ఎమోషనల్ కామెంట్స్ అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

also read: తోటి కంటెస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయిన నూకరాజు!

ఆ మాటను తీసుకోలేకపోయాను – నూకరాజు

Advertisement

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కాంతార సాంగ్ చేసినప్పుడు కర్ణాటక నుంచి కూడా మీకు మెసేజెస్ వచ్చాయని విన్నాము నిజమేనా ? అని వర్షా అడగగా.. “హీరో ఎవరైతే ఉన్నారో వారి బ్రదర్ నా గురించి ట్రీట్ చేశారు” అంటూ చాలా ప్రౌడ్ గా తెలిపారు నూకరాజు. వర్షా మాట్లాడుతూ..” శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలయిందే నీతో, ఇమ్మాన్యూయేల్ తోనే కదా.. ఎలా అనిపించింది?” అని వర్షా అడగగా.. “శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే ఒక మెమరీ.. ఆ మెమొరీ కాస్త బాధపడే సిచువేషన్ కి కూడా దారితీసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షో కోసం మేము ప్రారంభం నుండే ప్రాణం పెట్టే వాళ్ళం. ఏ రోజు కూడా నెగ్లెట్ చేయలేదు. అలాంటిది.. రాను రాను షెడ్యూల్ కి ఒక ఎపిసోడ్ రావడం,4 ఎపిసోడ్లో వచ్చేది రెండు ఎపిసోడ్స్ చేయడం. “రెగ్యులర్ అవుతున్నారు” అనే ఒక మాట తీసుకోలేకపోయాం” అంటూ తెలిపారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×