E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గురించి చెప్పిన బుజ్జమ్మ

Nindu Noorella Saavasam Serial Today January 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గురించి చెప్పిన బుజ్జమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ లోపల పిల్లలకు పాఠాలు చెప్తుంది. బయట రాజు కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంటాడు. రాజు అలా తిరుగుతుండటం లోపలి నుంచి మిస్సమ్మ గమనిస్తుంది. ఇంతలో రాజు, సరస్వతి కి కాల్‌ చేస్తాడు. కాల్‌ లిఫ్ట్‌ చేసిన సరస్వతి చెప్పండి రాజు గారు అరుంధతిని స్కూల్‌ లో జాయిన్‌ చేశారా..? అని అడగ్గానే.. చేశాను మేడం ఈ రోజు పాప స్కూల్‌కు వెళ్లి వచ్చింది అని చెప్తాడు రాజు. అక్కడ ఏ సమస్య లేదు కదా..? అని సరస్వతి అడగ్గానే.. రాజు అనుమానంగా ఆశ్రమంలో ఏ ఇబ్బంది లేదు మేడం కానీ స్కూల్ లోనే అంటూ ఆపేయగానే.. స్కూల్‌ లో ఏమైంది రాజు గారు అని అడగ్గానే.. మనోహరి స్కూల్‌ కు వచ్చింది మేడం అని రాజు చెప్పగానే..

మనోహరి అంజు కోసం స్కూల్‌కు వచ్చిందేమో అంటుంది సరస్వతి. కానీ నాకెందుకో అరుంధతి పాప కోసం వచ్చినట్టు అనుమానంగా ఉంది మేడం అంటాడు రాజు. అరుంధతి కోసం తను ఎందుకు వస్తుంద. అయినా అరుంధతి గురించి మనోహరికి తెలియదు కదా రాజు గారు అని సరస్వతి అడగ్గానే… ఒకవేళ తెలుసుకుందేమో మేడం పాపకు ఏమైనా హాని చేస్తుందేమో వెంటనే ఈ విషయం భాగీ మేడంకు చెప్తే బాగుంటుందేమో అని అడగ్గానే.. సరస్వతి వద్దు రాజు గారు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడటం మంచిది కాదు అంటుంది. దీంతో రాజు అంటే మేడం భాగీ గారికి చెబితే తను జాగ్రత్త పడతారు కదా అనగానే.. లేదు రాజు గారు భాగీ భయం భయంగానే ఆ ఊరికి వచ్చింది. ఈ విషయం తెలిస్తే మరింత భయపడుతుంది. నాకు తెలిసి మనోహరికి భాగీ అరుంధతి హైదరాబాద్‌ కు వచ్చినట్టు తెలిసే ప్రశక్తే లేదు. తను అంజు పాప కోసం స్కూల్‌కు వచ్చి ఉంటుంది.  ప్రస్తుతానికి ప్రాబ్లమ్‌ ఏమీ లేదు.. అని చెప్పగానే..

Advertisement

రాజు మాత్రం అనుమానంగా ఇప్పుడు తెలియకపోవచ్చు మేడం కానీ తర్వాతైనా తెలియొచ్చు కదా..? అప్పుడు ప్రాబ్లమ్‌ అవుతుందేమో.. నాకు టెన్షన్‌ గా ఉంది మేడం.. అని చెప్పగానే.. మీరు కంగారు పడకండి రాజు గారు మీరు ధైర్యంగా ఉంటే భాగీకి ధైర్యంగా ఉంటుంది. తొందరపడి తనకు ఏ విషయం చెప్పొద్దు.. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పగానే.. సరే మేడం ఉంటాను అంటూ కాల్‌ కట్‌ చేసి పక్కకు చూడగానే రాజు పక్కన మిస్సమ్మ వచ్చి నిలబడి ఉంటుంది.

మిస్సమ్మను చూసిన రాజు షాక్‌ అవుతాడు. మిస్సమ్మ కూల్‌ గా ఎవరితో మాట్లాడుతున్నారు బాబాయ్‌ గారు అని అడగుతుంది. అది సరస్వతి మేడం గారితో మాట్లాడుతున్నాను.. అని చెప్పగానే.. మరి అదేదో ప్రాబ్లమ్‌ అవుతుంది. టెన్షన్‌ గా ఉంది అంటున్నారు.. ఏంటది..? అని మిస్సమ్మ అడగ్గానే.. అది వేరే విషయం లేమ్మా..? అని రాజు చెప్పగానే.. ఏ విషయం బాబాయ్‌ గారు అని మిస్సమ్మ అడగ్గానే.. ఆ సమస్యలన్నీ మీకెందుకులేమ్మా..? నేను చూసుకుంటాను అంటూ రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిస్సమ్మ పిలుస్తున్నా ఆగకుండా వెళ్లిపోతాడు.. దీంతో మిస్సమ్మ అనుమానంగా రాజు గారు నా దగ్గర ఏదో దాస్తున్నారు.. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.

Advertisement

తర్వాత బుజ్జమ్మకు అన్నం తినిపిస్తూ.. స్కూల్‌లో ఏం జరిగింది అని అడగ్గానే.. బుజ్జమ్మ స్కూల్‌ లో విషయాలు చెప్తుంటే.. రాజు వచ్చి అడ్డు పడతాడు. బాగా లేట్‌ అయింది కదా పడుకో అని చెప్తాడు. అయినా వినకుండా స్కూల్‌ విషయాలు చెప్తుంది. తాను అంజుతో మాట్లాడిన విషయాలు చెప్తూ.. అంజు పేరు చెప్తుంది. ఆ పేరు వినగానే మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×