E-Paper
Advertisement

Foldable phones in 2026: ఫోల్డెబుల్ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? 2026లో బెస్ట్ మోడల్స్ ఇవే

Foldable phones in 2026: ఫోల్డెబుల్ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? 2026లో బెస్ట్ మోడల్స్ ఇవే
Advertisement

Foldable phones in 2026| స్మార్ట్‌ఫోన్స్‌లో ఇప్పుడు ప్రీమియం ఫోన్స్ అంటే ఫోల్డబుల్ ఫోన్స్. ఒకరకంగా ఇవి లగ్జరీ ఫోన్లుగా మారాయి. అందుకే ఈ మడత ఫోన్స్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. హై ఎండ్ యూజర్లంతా స్టేటస్ కోసం ఫోల్డెబుల్ ఫోన్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మెరుగైన డిస్‌ప్లే, బలమైన హింజ్‌లు, ఫ్లాగ్‌షిప్ పర్‌ఫామెన్స్ లభిస్తున్నాయి. వివిధ ధరల రేంజ్‌లో బ్రాండ్లు ఫోల్డబుల్ ఫోన్స్ అందిస్తున్నాయి. జనవరి 2026లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ల జాబితా మీ కోసం.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్7: ప్రీమియం ఫోల్డబుల్ ఎక్స్‌పీరియన్స్

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్7 ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉంది. శాంసంగ్ ఫోల్డెబుల్స్‌లో ఇది లేటెస్ట్. ఇందులో 8.0 ఇంచ్ ఫోల్డబుల్ డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఫ్లాగ్‌షిప్ పనితీరు ఇస్తుంది. లేటెస్ట్ One UI 8 సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. కెమెరాలో 200MP ప్రైమరీ, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. 10MP సెల్ఫీ కెమెరా ఉంది. 4400mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.1,74,999.

టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2: సరసమైన ఫోల్డబుల్ ఆప్షన్

Advertisement

టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2 చాలా వాల్యూ ఫర్ మనీ ఫోల్డబుల్ ఫోన్. 7.85 ఇంచ్ ఫోల్డబుల్ LTPO AMOLED డిస్‌ప్లే, 1 బిలియన్ కలర్స్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. MediaTek Dimensity 9000+ ప్రాసెసర్‌తో మల్టీటాస్కింగ్, గేమింగ్ స్మూత్‌గా జరుగుతాయి. HiOS 14 Fold సాఫ్ట్‌వేర్ ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరాలు, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5750mAh భారీ బ్యాటరీ ఉంది. ధర రూ.99,999. బడ్జెట్‌లో ఫోల్డబుల్ కావాలనుకునే వారికి బెస్ట్.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్: AI కెమెరా ఛాంపియన్

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ కెమెరా, సాఫ్ట్‌వేర్‌పై దృష్టి పెట్టింది. 8.0 ఇంచ్ ఫోల్డబుల్ LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరాలు (48MP + 10.8MP + 10.5MP), 10MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో గూగుల్ సొంత టెక్నాలజీ ప్రాసెసర్ ఉంది. గూగుల్ టెన్సార్ G5 చిప్‌సెట్ AI ఫీచర్లు, ఫోటోగ్రఫీని మెరుగుపరుస్తుంది. 5015mAh బ్యాటరీ ఉంది. ధర రూ.1,72,999.

వివో X ఫోల్డ్ 5: అత్యధిక బ్రైట్‌నెస్ డిస్‌ప్లే

Advertisement

వివో X ఫోల్డ్ 5 డిస్‌ప్లే, కెమెరా క్వాలిటీపై దృష్టి పెట్టింది. 6.53 ఇంచ్ LTPO AMOLED బయటి డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో ఫ్లాగ్‌షిప్ పనితీరు ఇస్తుంది. ట్రిపుల్ 50MP కెమెరాలు, Zeiss ఆప్టిక్స్‌తో కలర్ అక్యురసీ మెరుగ్గా ఉంటుంది. 20MP సెల్ఫీ కెమెరా ఉంది. ధర రూ.1,49,998.

Also Read: ఆపిల్ కంపెనీలో పనిచేసే భారతీయుడికి రూ.200 కోట్లకు పైగా వేతనం.. సిఈఓ సాలరీ ఎంతో తెలుసా?

వన్‌ప్లస్ ఓపెన్: బ్యాలెన్స్‌డ్ ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్

వన్‌ప్లస్ ఓపెన్ బ్యాలెన్స్‌డ్ ఫోల్డబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 7.82 ఇంచ్ ఫోల్డబుల్ LTPO3 ఫ్లెక్సీ ఫ్లూయిడ్ ఆమోలెడ్ డిస్‌ప్లే, 1 బిలియన్ కలర్స్, డాల్బీ విజన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్, OxygenOS 16 సాఫ్ట్‌వేర్ ఉన్నాయి. 4805mAh బ్యాటరీ ఉంది. హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్‌తో 48MP వైడ్, 64MP టెలిఫోటో, 48MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ధర రూ.1,09,999.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×