// // Sabarimala News: శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని స్వాముల ఆకాంక్ష -->
E-Paper
Advertisement

Sabarimala: శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని స్వాముల ఆకాంక్ష

Sabarimala: శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని స్వాముల ఆకాంక్ష
Advertisement

Sabarimala News: అభిమానులకు నచ్చాలేగానీ రాజకీయ నేతైనా, నటుడైనా నెత్తిన పెట్టి పూజిస్తారు. ప్రత్యేకంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం.  ఆ తరహా సన్నివేశాలు ఎక్కువగా తమిళనాడులో కనిపిస్తుంటాయి. తాజాగా శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాములు.. మెట్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు

Advertisement

Advertisement

దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నేతలు, నటీనటులు అంటే ప్రజలకు వివరీతమైన అభిమానం. వారు అభిమానించే నేతలు ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకుంటారు. పది కాలాలపాటు సంతోషంగా  ఉండాలని కోరుతూ ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తుంటారు కొందరు. తాజాగా తెలంగాణకు చెందిన కొందరు అయ్యప్పస్వాములు అదే పని చేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఏ దేవాలయాలకు వెళ్లినా తెలుగువారు కచ్చితంగా కనిపిస్తారు. షిర్డీ, శబరిమల ఇలా చెప్పుకుంటే పోతే ఆలయాల జాబితా చాలానే ఉంది. సంక్రాంతి సీజన్ కావడంతో శబరిమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ సీజన్‌లో మరక జ్యోతి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి తండోపతండాలుగా వస్తుంటారు. తెలంగాణ నుంచి అయ్యప్ప భక్తులు అక్కడికి వెళ్లారు.

పదేళ్లు ఆయన సీఎంగా ఉండాలని స్వాముల ఆకాంక్ష

శబరిమలలో సీఎం రేవంత్‌రెడ్డి కోసం కొందరు అయ్యప్ప భక్తులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. స్వామి మెట్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి‌కుమార్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించరు పలువురు అయ్యప్ప స్వాములు. పదేళ్లు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉండాలని ఆకాంక్షించారు స్వాములు.

ప్రజా పాలన అందించేందుకు పదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని అందులో రాసి ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఓ అయ్యప్పస్వామి, మా రేవంత్ అన్న మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకున్నట్లు చెప్పారు. అయ్యప్ప స్వామిని ఇదే విషయాన్ని కోరుతామని తెలిపారు. ఈ ఫ్లెక్సీలను మెట్టు సాయి‌కుమార్ మిత్ర బృందం సభ్యులు ఏర్పాటు చేశారు.

ALSO READ:  వాహనదారులకు అలర్ట్..  యూసఫ్‌గూడ వైపు వెళ్తున్నారా? ట్రాఫిక్ మళ్లింపులు చూసుకోండి

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×