E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్ సక్సెస్

Nindu Noorella Saavasam Serial Today December 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్ సక్సెస్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

అమర్‌ ఇంట్లో పాప ఫంక్షన్‌ కోసం అంతా రెడీ చేస్తుంటారు. రామ్మూర్తి వచ్చి ఏంటి రాథోడ్‌ ఇంకా లేటు.. ముత్తైదువలు వచ్చేస్తున్నారు.. కానివ్వు అంటాడు. దీంతో రాథోడ్‌.. రామ్మూర్తి దగ్గరకు వచ్చి అది కాదు సార్‌ ఇంట్లో శని దేవతను పెట్టుకుని బయటి నుంచి ఎంత మంద ముత్తైదువలు వస్తే మాత్రం ఏం లాభం అంటాడు. దీంతో రామ్మూర్తి అర్థం కాక నువ్వు ఎవరి గురించి అంటున్నావు రాథోడ్‌ అని అడుగుతాడు. ఇంకెవరి గురించి సార్‌ ఆ రాక్షసి మనోహరి గురించి మిస్సమ్మకు బిడ్డ పుట్టినప్పటి నుంచి తన చూపే వేరేగా ఉంది సార్‌. ఎప్పుడు చూడు బిడ్డను క్రూయిల్‌గా చూస్తుంది. మీరేమో దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు పోయి పోయి మిస్సమ్మకు బిడ్డకు ఆమెతోనే దిష్టి తీయించారు అనగానే.. రాథోడ్‌ నేను ఆ దుర్మార్గురాలితో దిష్టి తీయించింది తనను ఎక్కువ చేయడానికి కాదు. ఏ చేతులతో అయితే అరుందతిని పైకి పంపించిందో అదే చేతులతో మళ్లీ ఈ ఇంట్లోకి అరుందతికి స్వాగతం చెప్పడానికి అని చెప్పగానే..

ఆ విషయం నాకు అర్థం అయింది సార్‌ .. కానీ తను ఎలాంటిదో మీకు తెలుసు కదా..? తను ఈ ఇంట్లో ఉండటం ఇంకెంతమాత్రం బిడ్డకు క్షేమం కాదు. సార్‌ వెంటనే మా సార్‌కు చెప్పి వెంటనే ఇంట్లోంచి వెళ్లగొట్టండి అని రాథోడ్‌ చెప్పగానే.. ఆ పని ఎప్పుడెప్పుడు చేద్దామా..? అని మాకు ఉంది రాథోడ్ అని చెప్తాడు రామ్మూర్తి. మరి ఎందుకు సార్‌ ఆగుతున్నారు.. ఆవిడ గురించి నేనైనా సార్‌కు చెప్పమంటారా…? లేక మీరే చెప్తారా..? అని అడగ్గానే.. రామ్మూర్తి కాదు రాథోడ్‌ తన గురించి అల్లుడి గారికి చెప్పొద్దని భాగీ నా దగ్గర మాట తీసుకుంది అనగానే.. లేదు సార్‌ మాట గీటా పక్కన పెట్టండి మనం రిస్క్‌ తీసుకోవద్దు.. అప్పట్లో అరుందతి మేడం కూడా ఆ దుర్మార్గురాలిని అమాయకంగా నమ్మింది. ఆ తప్పు మళ్లీ జరగకూడదు.. అని చెప్పగానే..

Advertisement

అలాగని భాగీని కాదని మళ్లీ అల్లుడి గారితో మనం ఏమీ చెప్పకూడదు కదయ్యా..? అని చెప్పగానే.. అయితే మిస్సమ్మతోకే చెప్పిద్దాం సార్‌. వీలైనంత త్వరగా ఆ మనోహరిని ఈ ఇంటి నుంచి పంపిచేద్దాం. అని రాథోడ్‌ చెప్పగానే.. సరే ఈ ఫంక్షన్‌ అయిపోని రాథోడ్‌ అల్లుడి గారితో చెప్పమని మనమే చెబుదాం.. భాగీ చెప్పిందా సరేసరి లేదంటే ఆ రాక్షసి గురించి మనమే అల్లుడి గారికి చెబుదాం.. అనగానే.. అంతే సార్‌ ఎక్కువ రోజులు పామును పక్కలో పడుకోబెట్టుకోకూడదు. ఆ మనోహరి విషసర్పానికి మించిన పాము.. అని రాథోడ్‌ చెప్పగానే.. ఎంత విషసర్పం అయినా.. చలి చీమల చేత చిక్కి ఎప్పటికైనా చావడం కాయమని ఈ ఫంక్షన్‌ అయ్యాక చూడు.. ఆ మనోహరి ఇక ఇక్కడడ ఉండనే ఉండదు.. అంటూ ఇద్దరూ మాట్లాడుకోవడం చంభా వింటుంది. ఈ విషయం వెటనే మనోహరికి చెప్పాలి.. అని అక్కడి నుంచి మనోహరి దగ్గరకు వెళ్తుంది.

మనోహరి గేటు దగ్గర పంతులు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో పంతులు వస్తాడు. ఆయన్ని చూసి నవ్వుతుంది మనోహరి. ఇంతలో అక్కడికి చంభా పరుగెత్తుకుంటూ వస్తుంది. కంగారుగా విషయం చెప్పడానికి ఆత్రుత పడుతుంది. మనోహరి మాత్రం చెప్పిందంతా గుర్తుంది కదా పంతులు గారు.. అంటుంది. పంతులు అంతా గుర్తుంది మనోహరి.. నువ్వు చెప్పినట్టే చేస్తాను సరేనా అంటాడు.. మనోహరి హ్యాపీగా సరే పంతులు గారు.. పని అయిపోయాక పేమెంట్‌ మీకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాను అనగానే.. సరే అంటూ పంతులు వెళ్లిపోతాడు. పంతులు వెళ్లిపోయాక మనోహరి నిన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ఆ రాథోడ్‌, రామ్మూర్తి ప్లాన్‌ చేస్తున్నారు.. అని చెప్పగానే.. వాళ్లు ఇంకా ప్లాన్‌ చేస్తున్నారు.. నేను ప్లాన్‌ చేసి అమల్లో పెట్టేశాను అని చెప్తుంది మనోహరి.

Advertisement

లోపలికి వెళ్లిన పంతులు.. మిస్సమ్మను పక్కకు తీసుకెళ్లి… ఈ ఇంట్లో మీ పెద్దమ్మాయి.. ఈ చిన్న పాప కలిసి ఉండకూడదు.. అలా ఉంటే పెద్ద అమ్మాయి ప్రాణగండం వస్తుంది అని భయపెడతాడు. పంతులు మాటలకు మిస్సమ్మ భయంతో వణికిపోతుంది. ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×