// // Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కాపురంలో శ్రీవల్లి నిప్పులు.. డబ్బు ఆశపడ్డ సాగర్.. రామరాజు క్షమిస్తాడా..? -->
E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కాపురంలో శ్రీవల్లి నిప్పులు.. డబ్బు ఆశపడ్డ సాగర్.. రామరాజు క్షమిస్తాడా..?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కాపురంలో శ్రీవల్లి నిప్పులు.. డబ్బు ఆశపడ్డ సాగర్.. రామరాజు క్షమిస్తాడా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ తో చిన్న మాటంటేనే నువ్వు ఇంత బాధ పడిపోతున్నావు నర్మద మనసులో మా బాధ గురించి తెలిస్తే నువ్వు ఎంత బాధ పడిపోతావు అని అంటుంది. నర్మదా మనసులో బాధ ఏంటి వదిన అని అడుగుతాడు సాగర్.. వద్దులేండి మరిది గారు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేయడం నా ఉద్దేశం కాదు.. మరిది గారు అని కావాలని పుల్లలు పెట్టేస్తుంది శ్రీవల్లి. ఏం లేదు మరిది గారు తన భర్త రైస్ మిల్లులో మూటలు మోసే పని చేస్తున్నాడని పాపం నర్మద కూడా చాలా బాధపడిపోతుంది అని అంటుంది శ్రీవల్లి.

నర్మదా అలాంటిది కాదు అసలు ఫీల్ అవ్వదు అని సాగర్ చెప్తాడు. నా భర్త మూటలు మోస్తున్నాడు అని చెప్పుకోడానికి నర్మద కూడా బాధపడుతుంది.ఏ రోజున మీరు నర్మద మనసులోని బాధని అర్థం చేసుకున్నారా అని శ్రీవల్లి అడుగుతుంది.. సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ తన తండ్రి ఎక్కడో తాగి పడిపోయాడని తెలుసుకొని అక్కడకు వెతుక్కుంటూ వెళుతుంది. వాళ్ల నాన్నని ఇంటికి జాగ్రత్తగా తీసుకొస్తుంది అది చూస్తున్న శ్రీవల్లి ధీరజ్ కి ప్రేమకి మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకుని తిరిగి వస్తుంది. శ్రీవల్లి అది చూసి ధీరజ్ కి చెప్తుంది. చూసావా ఇది మళ్ళీ మావయ్య గారికి మీదికి ఏ గొడవను తీసుకొని వస్తుందో తెలియట్లేదు అని కాపురంలో చిచ్చు పెడుతుంది.. ఇక తర్వాత ప్రేమ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే వాళ్ళ నాన్న ఎక్కడో పడిపోయి ఉండడం చూసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తుంది. అది చూసిన శ్రీవల్లి అయ్య బాబోయ్ ప్రేమ వల్ల ఆనంద్ తీసుకుని వచ్చిందా ఇది మనకు వాడుకోవాలి. నా మీదే సీమటపాకాయ్ ఎగిరెగిరి పడుతుందా దీనికి కచ్చితంగా నేను బుద్ధి చెప్పాల్సిందే అని అనుకుంటుంది. ధీరజ్ ని వెతుక్కుంటూ వెళ్లి ధీరజ్ ఒకసారి ఇలా రా అని తీసుకొని వెళ్తుంది. ఏంటి వదిన ఏమైందని అడుగుతాడు కానీ ప్రేమ వాళ్ళ నాన్నని తీసుకురావడం చూసినా శ్రీవల్లి ఆ విషయాన్ని ధీరజ్ చూడాలని అనుకుంటుంది. వాళ్ళ నాన్నని ఎంత జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చిందో ఇది కనుక మావయ్య గారు చూస్తే ఎన్ని గొడవలు జరుగుతాయో అని కావాలనే చిచ్చు పెడుతుంది.

నేను ఇందాక పెట్టిన మంట సరిగ్గా అంటుకోలేదనుకుంటా.. మళ్లీ వీళ్లిద్దరి మధ్య అగ్గి రాజెయ్యాలి.. ఇంకా కొన్ని అగ్గిపుల్లలు వేసి రాజేస్తాను అని అంటుంది శ్రీవల్లి. ఒంటరిగా ఉన్న ధీరజ్ దగ్గరికి వెళ్లి ఏంటి ధీరజ్ ప్రేమ చేసిన విషయం గురించి బాధపడుతూ ఉన్నావా అని అంటుంది.. ప్రేమ అలా చేయడం తప్పేమీ కాదు ఎవరికైనా వాళ్ళ నాన్న మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ కూడా వాళ్ళ నాన్న మీద బోలెడు ప్రేమ ఉంది. అందుకే వాళ్ళ నాన్నని ఎక్కడో తాగి పడిపోతే తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి అప్ప చెప్పింది అని అంటుంది. ఈ విషయాన్ని కూడా వాళ్ళు మంచికి తీసుకోకుండా చెడుగా ఆలోచించి మీ నాన్నని మళ్లీ తిడతారేమో.. అలాగే మీ నాన్న చొక్కాని నడిరోడ్డులో చించేస్తారేమో అని శ్రీవల్లి కావాలని చిచ్చు పెట్టేస్తుంది..

Advertisement

అప్పుడే ప్రేమ ధీరజ్ అని పిలుస్తుంది.. ఈ సీమటపాకాయ్ వచ్చేస్తుంది. ఇక నుంచి వెళ్లిపోవాలని శ్రీవల్లి అనుకుంటుంది.. ఆ తర్వాత ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్లి ఏంట్రా ఇక్కడున్నావ్ ఏంటి అదోలా ఉన్నావ్ భోజనానికి రానేసి పిలుస్తుంది. మా నాన్నని తీసుకొచ్చానని నువ్వు ఆలోచిస్తున్నావా? నా వల్లే మా నాన్న మందుకు బానిస అయ్యాడు. ఆయన తీసుకురావడం నా బాధ్యత అని అనుకున్నాను. నీకు మీ నాన్నకి పడకపోతే నువ్వు మీ నాన్న ఇలాంటి స్థితిలో ఉంటే తీసుకురాకుండా ఉంటావా అని ప్రేమ ధీరజ్ ని అడుగుతుంది. నువ్వు ఏదైనా అనాలనుకుంటే అనేసి నీ కోపాన్ని కక్కేసేయ్ అంతేకానీ ఇలా మౌనంగా ఉండి నన్ను చంపేయొద్దు అని ప్రేమ ధీరజ్ ని రిక్వెస్ట్ చేస్తుంది..

సాగర్ తన తండ్రి తన డ్రెస్ గురించి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన ఫ్రెండు వస్తాడు.. అతని చూసి ఏంట్రా పుష్ప రాజ్ నిన్ను చూసి చాలా కాలం అయింది నువ్వేంటి రా ఇలా మారిపోయావు అని ఆరా తీస్తాడు.. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నావా ఏంటి అని సాగర్ అనగానే అతను నన్ను చూస్తే క్యాబ్ డ్రైవర్ లాగా కనిపిస్తున్నానా అని అంటాడు. షేర్స్ లో పెట్టుబడి పెడితే డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అలా నేను కోట్లు సంపాదించాను అని సాగర్ కి డబ్బు ఆశ చూపిస్తాడు. నిజంగానే షేర్స్ లో డబ్బులు పెడితే అన్ని కోట్లు వస్తాయా అని అంటాడు.. ఒకసారీ నువ్వు పెట్టి చూడు మామ నీకే తెలుస్తుంది లక్షలకు లక్షలు వస్తాయి అని అంటాడు. అతని మాటలు విన్న సాగర్ తనకు గవర్నమెంట్ జాబ్ ఎలాగైనా రావాలి అని అనుకుంటాడు.

Also Read :కన్నతండ్రి గురించి నిజం చెప్పేసిన అవని.. దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి.. మీనాక్షి ఎక్కడ..?

డబ్బులు వస్తాయి కదా నాకు 20 లక్షలు వస్తే నేను గవర్నమెంట్ జాబు కొనుక్కుంటాను అని అనుకుంటాడు.. నా దగ్గర ఒక లక్ష ఉంది మామ అది ఇస్తాను నువ్వు పెట్టుబడి పెట్టి నాకు వారం కల్లా మూడు లక్షలు ఇస్తావా అని అడుగుతాడు. సాగర్ ఫ్రెండు అలానే అని అంటాడు. నాకు పెట్టుబడి పెట్టడం రాదు కదా.. నువ్వే పెట్టి నాకు డబ్బులు ఇవ్వు అని సాగర్ అనగానే తన ఫ్రెండు నమ్మేశాడు అనుకుంటాడు. అలా లక్ష రూపాయలు తీసుకుని తన ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. మిగిలిన లక్షను కిరాణా కొట్టులో ఇస్తాడు సాగర్.. ఆ తర్వాత సాగర్ ఇంటికి వెళ్లి తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు.. కలవకపోవడంతో వీడు నన్ను మోసం చేశాడా? అని బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×