E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కార్తీక్ ను తీసుకెళ్లిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode May 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కార్తీక్ ను తీసుకెళ్లిన జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2  serial today Episode: ఇంటికి వచ్చిన జ్యోత్స్నను తిడుతూ దశరథకు ఫోన్‌ చేయబోతుంది కాంచన. దీంతో కార్తీక్‌ కాంచనను ఆపేసి జ్యోత్స్నను తిడతాడు. దీంతో రెండు వారాలు దీపను వదిలేసి ఎలా ఉంటావురా అని కాంచన అడగ్గానే.. పెళ్లి అయ్యాక మాకు ఆషాడం రాలేదు ఇదే మా ఆషాడం అనుకుంటాను.. దీప వెళ్లి నా బ్యాగ్‌ తీసుకురా..? అని చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా అత్త ఇప్పుడు నీకు అర్థం అయిందా..? అనగానే.. కాంచన కోపంగా జ్యోత్స్నను తిడుతుంది. ఇంతలో దీప లోపలి నుంచి బ్యాగ్ తీసుకుని వస్తుంది. ఆ బ్యాగ్‌ తీసుకుని ఇప్పుడు నువ్వు ఆషాడం పెళ్లి కొడుకువి బ్యాగులు ఎందుకు మోస్తావు..? నేను మోస్తాను అంటూ బ్యాగ్‌ తీసుకుని అందరికీ వెటకారంగా బాయ్‌ చెప్పి కార్తీక్‌ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది జ్యోత్స్న. అందరూ కోపంగా చూస్తుంటారు.

కార్తీక్‌ను తీసుకుని ఇంటికి వచ్చిన జ్యోత్స్నతో ఏమో జ్యోత్స్న చివరికి నా మనవడు కార్తీక్‌కు డ్రైవర్‌ అయిపోయావా..? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. కార్తీక్‌ను తీసుకని ఇంట్లోకి వెళ్లిన జ్యోత్స్నను సుమిత్ర కోపంగా చూస్తుంది. జ్యోత్స్న మాత్రం ఇందులో నా తప్పేం లేదని మీరే దీపను తీసుకొచ్చారు. పోటీ పెట్టింది మీరు ఓటింగ్‌ పెట్టింది మీరు.. ఇందులో నా తప్పేం లేదు నేను తప్పు చేశానా మమ్మీ.. అనగానే.. తప్పేం లేదు కానీ భార్యాభర్తలను విడదీయడం కరెక్ట్ కాదు అనగానే.. అయితే దీప ఒప్పుకునే పంపించింది కదా..? బావ ఇందులో నీకు ఏమైనా అభ్యంతరం ఉందా..? అని అడగ్గానే.. కార్తీక్‌ లేదని చెప్తాడు. దీంతో దశరథ కార్తీక్‌ నీతో మాట్లాడాలి అనగానే.. నాకో రూం ఇచ్చారు కదా..? అక్కడికి వెళ్లి మాట్లాడుకుందాం పద అంటూ వెళ్లిపోతారు.

Advertisement

దశరథ కాంచనకు ఫోన్‌ చేసి సారీ చెప్తుంటే.. కాంచన మాత్రం కోపంతో దశరథను తిడుతుంది. మమ్మల్ని పనిమనిషిగా చూస్తున్నారు. మీరు అందరూ బాగానే ఉన్నారు. నేను గాలి వానకు గూడు చెదిరిన పక్షిలా అయిపోయాను ముందు నాన్నకు ఫోన్‌ ఇవ్వు ఇంటికి పెద్ద మనిషి కదా అంటూ కోప్పడగానే.. స్పీకర్‌లో అంతా వింటున్న శివనారాయణ బాధగా ఏడుస్తుంటాడు. తాను మాట్లాడలేనని చెప్పగానే.. కాంచన ఇంకా ఎమోషనల్ అవుతుంది. జ్యోత్స్న గురించి చెప్తూ.. బాధపడుతుంది. చివరిగా  అమ్మ ఊపిరి వదిలేసి చచ్చిపోయింది. నేను ఊపిరి ఉండగానే.. చనిపోయానని వెళ్లి నాన్నకు చెప్పు.. ఇక ఉంటాను అంటూ ఏడుస్తూ.. కాల్ కట్‌ చేస్తుంది. దీంతో పక్కనే ఉన్న దీప అత్తయ్యా మీ మాటలు అవతలి వాళ్లను ఎంత గాయం చేసి ఉంటాయో తెలుసా..? అనగానే.. నాది మనసే దీప నేను ఎంత బాధపడి ఉంటానో తెలుసా..? అంటూ వెళ్లిపోతుంది.

మరోవైపు శివనారాయణ ఏడుస్తూ.. నా కూతురు దృష్టిలో నేను బతకలేని మనిషిగా మిగిలిపోతానేమో అని బాధేస్తుంది. దీప గురించి చెప్పి మీరే నన్ను కన్వీన్స్‌ చేశారు. మీరేం చేస్తారో నాకు తెలియదు రేపు ఉదయం నవ్వుతూ ఉన్న నా కూతురును చూడాలి. లేదంటే నేను ఎవ్వరితోనూ మాట్లాడను.. మూగవాడిలాగా ఆ నాలుగు గోడల మధ్య ఉండిపోతాను అంటూ శివనారాయణ ఏడుస్తూ వెళ్లిపోతాడు. దశరథ బాధగా ఏంట్రా ఇది ఏం చేయాలి ఇప్పుడు అంటూ అడగ్గానే.. నా దగ్గర ఒక ఐడియా ఉంది అదే చేద్దాం అంటాడు కార్తీక్‌.

Advertisement

మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి జ్యోత్స్న రెడీ అయి కిందకు రాగానే.. కాంచనను తీసుకుని దీప ఇంటికి వస్తుంది. వాళ్లను చూసిన జ్యోత్స్న కోపంగా ఎందుకొచ్చారు అని అడుగుతుంది. దీంతో నా పుట్టింటికి నేను వచ్చాను. నేను ఒక్కదాన్నే రాలేను కాబట్టి నా కొడలును సాయం తెచ్చుకున్నాను అని కాంచన చెప్తుంది. దీంతో జ్యోత్స్న, పారిజాతం షాక్‌ అవుతుంది. నా కొడుకు నా ఇంటికి వచ్చే వరకు నేను నా పుట్టింట్లో ఉందామని వచ్చాను అని చెప్తుంది కాంచన ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×