// // Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు ప్రభావతి అవుట్.. రోహిణికి మైండ్ బ్లాక్.. ప్రభావతికి మీనా వార్నింగ్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు ప్రభావతి అవుట్.. రోహిణికి మైండ్ బ్లాక్.. ప్రభావతికి మీనా వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు ప్రభావతి అవుట్.. రోహిణికి మైండ్ బ్లాక్.. ప్రభావతికి మీనా వార్నింగ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May19th: మనోజ్ బయటికి వెళ్లి చూడగానే అక్కడ ఉన్న కొంతమంది డీలర్స్ షాప్ లోకి రావడంతో నాన్న మీరు ఒకసారి ఆ సీట్లోంచి లేవండి అని మనోజ్ అంటాడు. ఇప్పుడే కూర్చోబెట్టి అప్పుడే దించేస్తావా ఎందుకురా లేవాల్సిన అవసరం లేదు అని బాలు అంటాడు. వి ల్ల డీలర్స్ ఇచ్చిన డబ్బులు తోనే కొనాలి అనుకున్నాను ఆ 30 లక్షలు వాళ్ళు మోసం చేశారు ఇప్పుడు డీలర్స్ వస్తున్నారు అని మనోజ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. ఆ డీలర్స్ మనోజ్ డబ్బులు తీసుకున్నాడని పెద్దగా రచ్చ చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన ముంబై ముఖేష్ బాలు సత్యం ముఖం చూసి మరోసారి మనోజ్ నీకు క్షమిస్తాడు.. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు.. షాప్ లో ఓనర్ గా తీసేసినందుకు మనోజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు..

ప్రభావతి మాటకు మీనా కౌంటర్…

ప్రభావతి మౌనంగా ఉండడం చూసిన బాలు ఏం జరిగింది అని అడుగుతాడు. లక్షలు మింగినోడు ఇప్పుడు చాలా ఇది చేస్తున్నాడు కదా ఎందుకు వాడు అలా ఉన్నాడు అని బాలు అడుగుతాడు. చచ్చిన ప్రాముని ఇంకా చంపుతారు ఏంట్రా.. కొంచెం కూడా బుద్ధి లేదా అని ప్రభావతి అడుగుతుంది..? ఏం మాట్లాడుతున్నా రత్తయ్య మాకు బుద్ధి లేదు అంటారా? ప్రభావతి మీనా కి దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తుంది. రెచ్చిపోతున్నావని ప్రభావతి అంటున్న కూడా మాటకు మాట సమాధానం చెబుతుంది.

బాధపడ్డ రవి, బాలు..

Advertisement

రోహిణి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎందుకు మీరు ఇలా అంటున్నారు అని అడుగుతుంది.. మనోజ్ ఏమి చేయలేక అలా చేసాడు.. అంతేగాని వేరే ఉద్దేశంతో చేయలేదు అని రోహిణి అంటుంది.. మీనా మాట్లాడిన మాటలకి రోహిణి ఇంకాస్త రెచ్చిపోతుంది. అయితే రోహిణి మాటకు ఏం మాట్లాడుతున్నావ్ వదినా నువ్వు కూడా మా అన్నయ్య రాత్రానికి పగలనక కారు డ్రైవర్ గా పని చేస్తూ కష్టపడి పోతున్నాడు.. నేను ఎండాకాలం అని కూడా పట్టించుకోకుండా రెస్టారెంట్లో వంటగదిలో మగ్గిపోతున్నాను. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇచ్చిన టైం మేం కూడా బ్రాంచ్ ఓపెన్ చేసి మేం కూడా జీవితంలో పైకొచ్చే వాళ్ళం కదా అని రవి అంటాడు.

రోహిణి మాటతో మైండ్ బ్లాక్..

నువ్వు సరిగ్గా ఉంటే ఇవాళ వీళ్ళందరూ మనల్ని అనేవాళ్ళు కాదు కదా అని రోహిణి అంటుంది. ఇక్కడికి వంటవాడు కారు డ్రైవర్ కూడా నిన్ను అనే స్టేజ్ లో ఉన్నారు. ఇప్పటికే నీకు బుద్ధి రాలేదు ఏంటి అని రోహిణి అనగానే మీనా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు డ్రైవరు వంటవాడా మా డబ్బులు కొట్టేసి నువ్వు ఏసీ గదిలో కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావా అని రవి కూడా రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. మీనా మీరిద్దరూ డబ్బులు కాజేసి వాళ్ళని ఇలా చేస్తే వాళ్ళం ఎక్కడ కూర్చుంటారు అని అంటుంది. రోహిణి కి సత్యం కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు.. ఇప్పటికీ నువ్వు కూడా మాట్లాడుతున్నావా అమ్మ ఏం మాట్లాడుతున్నావో కొంచమైనా ఆలోచించి మాట్లాడు అని రోహిణికి చెప్పగానే రోహిణి సైలెంట్ అవుతుంది..

ప్రభావతిపై సత్యం సీరియస్..

Advertisement

రోహిణి కదా అన్న దాంట్లో తప్పేముంది అని ప్రభావతి అనగానే సత్యం కొంచమైనా బుద్ధుందా నీకు.. నువ్వు ఒక కన్నతల్లివేనా అసలు ఆడదానివేనా నువ్వు అని ప్రభావతి పై సీరియస్ అవుతాడు సత్యం.. నీ కొడుకులని అంత మాటలు అంటున్న తనని నువ్వు వెనకేసుకొని వస్తున్నావంటే నీ ప్రవర్తన నీ బుద్ధి ఏంటో నాకు అర్థం అవుతుంది అని సత్యం అనగానే ప్రభావతి నోరు మూసుకుంటుంది.. అరేయ్ ఇదంతా కాదురా ఆ 30 లక్షలు కొట్టేసిన వాడు ఎవరో కనిపెట్టు.. లేదంటే మనము 30 లక్షలు కట్టాలి అని సత్యం అంటాడు. ఆ విషయం నాకు వదిలేసేయండి నాన్న నేను చూసుకుంటాను అని అంటాడు బాలు.. శృతి కూడా రోహిణికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. కడుపుకి మీనా చేసిన వంట తిను రోహిణి మీ ఆయన తినేది తింటే ఇలానే నీకు మాటలు వస్తాయి అని అంటుంది.. ఇక్కడితో ఈ గొడవను వదిలేసేయండి అని సత్యము అనగానే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు..

ప్రభావతికి మీనా వార్నింగ్..

అందరూ వెళ్ళిపోగానే మీనా అక్కడ సర్దుకుంటూ ఉంటుంది.. మనోజ్ ని ప్రభావతి పిలిచి నీ పెళ్ళాం వల్లే ఈ మాటలను నేను పడాల్సి వచ్చింది. నీ పెళ్ళాంకి కాస్త దూరం ఉండు. దాని మాట వినడం వల్ల నువ్వు ఇలా మారిపోయావు అని చెబుతుంది. నువ్వు ఎలా చెప్తే అలానే అమ్మని మనోజ్ అంటాడు.. ఏంటే బాలు గాడిని మా మీదకి ఉసిగొలిపి తిట్టేలా చేస్తున్నావా నువ్వు అని ప్రభావతి అంటుంది.. మిమ్మల్ని నేను ఒక మాట అడగాలి అత్తయ్య అని అనగానే ఏంటే అని ప్రభావతి అంటుంది.. ఏం లేదు అత్తయ్య మీకు డబ్బులు తీసుకోవడం అలవాటే కదా ఈ 40 లక్షలు మీ వాటా ఎంత అని ప్రభావతిని మీనా అడుగుతుంది.. పిచ్చి ఏమైనా పట్టిందా ఏం మాట్లాడుతున్నావ్ అని అనగానే నోరు మూసుకొని ఉండండి అత్తయ్య నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది.

మీనాకు డబుల్ గుడ్ న్యూస్..

బాలు మీనా ఇద్దరు కలిసి ఆ డబ్బులు తీసుకెళ్లిన వాళ్ళని కనిపెట్టాలని అనుకుంటారు.. డైలీ పూలు తెచ్చి ఇస్తానని నువ్వే వెళ్లి వాళ్ళ ఇంటికి మాటలు కలుపు ఆ తర్వాత దీని గురించి మాట్లాడదాము అని అంటారు.. మీనా బాలు చెప్పినట్లుగానే వెళ్లి టీవీ యాక్టర్ కళ్యాణ్ ఇంటికి వెళుతుంది.. అయితే అప్పటికి అక్కడ చింతామణి పెళ్లి గురించి ఆర్డర్ కోసం అని అక్కడికి వస్తుంది.. మీ నాకు ఆ విషయం చెప్పగానే మీనా వెళ్లి మళ్లీ కళ్యాణ్ ని అడుగుతుంది. అతనికి మీనా కి డబుల్ గుడ్ న్యూస్.. పూల ఆర్డర్ కూడా తనకే వచ్చిందని చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. కామాక్షికి ప్రేమ స్ట్రాంగ్ కౌంటర్..చిచ్చుపెట్టిన భాగ్యం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×