E-Paper
Advertisement

రైల్వే స్టేషన్ ప్రమాదానికి గురైన రైలు.. పట్టాలు తప్పిన మూడు బోగీలు, అసలేం జరిగింది?

రైల్వే స్టేషన్ ప్రమాదానికి గురైన రైలు.. పట్టాలు  తప్పిన మూడు బోగీలు, అసలేం జరిగింది?
Advertisement

Train derail: ఉత్తరాఖండ్‌లోని యోగనగరి రిషికేశ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రైలు ఇంజిన్ బోగీలను మార్చే ప్రక్రియ జరుగుతుండగా రైలు ఒక్కసారిగా అదుపు తప్పింది. రైలు వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో రైల్వే స్టేషన్ రక్షణ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

రైల్వే స్టేషన్ ప్రమాదానికి గురైన ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ రైలు

Advertisement

ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌ ప్రాంతంలోని ఖండ్ గావ్ ప్రాంతంలో యోగ్‌నగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉజ్జయిన్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఘటన సమయంలో రైలులో ఎవరూ లేరు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన రాత్రి దాదాపు తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది.

పనుల నిర్వహణ మయంలో బ్రేకులు విఫలం కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. ఘటన జరిగి దాదాపు రెండున్నర గంటల వరకు రైల్వే అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకోలేదనే ఆరోపణలు లేకపోలేదు. ఘటన తర్వాత రైలు పట్టాలపైకి సమీపంలోని ప్రజలు తరలివచ్చారు. అయితే రైల్వే పోలీసులు వారిని చెదరగొట్టారు. జరిగిన ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

పట్టాలు తప్పిన మూడు బోగీలు,  దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు

రైలు పట్టాలు తప్పిన తర్వాత రైల్వే విభాగం, సహాయక చర్యలు చేపట్టింది. రాత్రంతా పనుల పునరుద్దరణలో అధికారులు నిమగ్నమయ్యారు. పట్టాల నుంచి పక్కకు ఒరిగిపోయిన మూడు కోచ్‌లను క్రేన్ల సాయంతో తొలగించారు. కార్యకలాపాలు సాధారణ స్థాయికి తీసుకురావడానికి రైల్వే సహాయక బృందాలు నిరంతరం పని చేస్తున్నాయి.

గడిచిన మూడు రోజుల్లో మూడు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం త్రివేంద్ర నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లో అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే రైల్వే గార్డు సకాలంలో చూసి లోకో పైలట్ ను అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ALSO READ: భారత్ గౌరవ్ రైల్లో నేపాల్ టూర్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

సోమవారం బీహార్‌లోని ససారం రైల్వేస్టేషన్‌లో ఆడివున్న రైలు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, ప్రయాణికులకు కిందకు దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా ఉజ్జయని రైలు వంతు అయ్యింది. ఇలా వరుసగా రైలు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.

 

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×