E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 14th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దశరథపై సీరియస్‌ అయిన కాంచన

Karthika Deepam 2 Serial Today march 14th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దశరథపై సీరియస్‌ అయిన కాంచన
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  

కార్తీక్, దీప విషయం ముందు మీ అన్నయ్యకు తెలుసు కానీ ఎవ్వరికీ చెప్పలేదని కాంచనను రెచ్చగొడుతుంది పారిజాతం. దీంతో శివనారాయణ కోపంగా నీకు ముందే విషయం తెలిస్తే మాకు ఎందుకు చెప్పలేదని కోప్పడతాడు. దీంతో పారిజాతం ఆరోజు దీప, కార్తీక్‌, దశరథ మాట్లాడుకుంటుంటే కొద్దిగా మాత్రమే విన్నాను.. తర్వాత ఆ విషయం కాంచనకు కూడా చెప్పాను అంటుంది. అయితే అదే విషయం కార్తీక్‌ ను నేను అడిగితే బిడ్డ వల్ల దీపకు సమస్య ఉందని చెప్పాడు అంటుంది కాంచన. అయితే నీ కొడుకు కోడలే నిన్ను పిచ్చి దాన్ని చేశారు అంటుంది పారిజాతం.

దీంతో దశరథ కోపంగా పారిజాతాన్ని తిడుతుంటే.. కాంచడ అడ్డు వెళ్తుంది. ఇకపై నన్ను చెల్లెమ్మ అంటూ పిలవొద్దని కోప్పడుతుంది. నిన్ను నమ్మిన పాపానికి  తొడబుట్టిన చెల్లిని కూడా మోసం చేశావా..? అంటూ బాధపడుతుంది. దశరథ దగ్గరుక వెళ్లి చేయి పట్టుకుని అది కాదు చెల్లెమ్మా అంటూ ఏదో చెప్పబోతుంటే.. కాంచన కోపంగా దశరథ చేయి విదిలిస్తుంది. దీంతో దశరథ మౌనంగా ఉండిపోతాడు. అంతా గమనిస్తున్న జ్యోత్స్న మాత్రం నాన్న ఏదో చెప్పబోతుంటే. ఎందుకు అడ్డుపడుతున్నావు అత్తయ్యా.. నాన్నను ఏదో చెప్పనివ్వండి అంటుంది.

Advertisement

దీంతో కాంచన కోపంగా నీకు ఇంకా మేనత్త లేదని ఈ పుట్టింట్లోనే చనిపోయిందని కాంచన ఏడుస్తుంటుంది. కాంచన మాటలకు శివనారాయణ ఏడుస్తుంటాడు. కాంచన మాత్రం ఒక కూతురిగా మోసపోయాను, ఒక చెల్లిగా మోసపోయాను, ఒక భార్యగా మోసపోయాను, ఒక తల్లిగా కూడా మోసపోయాను, ఒక అత్తగారిగా మోసపోయాను, ఒక మనిషిగా కూడా మోసపోయాను అంటూ ఏడుస్తూ కాంచన ఇంట్లోంచి వెళ్లిపోతుంది. దీంతో జ్యోత్స్న మనసులో నవ్వుకుంటుంది. కాంచన వెళ్లడంతో శివనారాయణ కూలబడిపోతాడు. పారిజాతం మాత్రం దీపను తిడుతుంది.

స్వప్నను కాశీలను ఒంటరిగా వదిలేసి వెళ్తారు దాస్‌ వాళ్లు.. దీంతో కాశీ గతాన్ని స్వప్నకు గుర్తు చేస్తుంటాడు.  నీకు ఐ లవ్ యూ చెప్పడానికి వైజాగ్‌లో సగం సముద్రం ఈదినంత పనైంది.. అనగానే.. స్వప్న కోపంగా నువ్వు సగం సముద్రం ఈదావు.. నన్ను నడిసముద్రంలో పడేశావు అంటుంది. దీంతో కాశీ మనం ప్రేమించుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి కష్టపడ్డాం. కానీ ఆ తర్వాత లైఫ్ ఈజీ అయిపోయింది. కష్టపడి సాధించుకున్న దాని విలువ తెలియకుండా పోయింది.. అయినా అత్తయ్య చెప్పినట్లు పాపిట్లో సింధూరాన్ని ఎందుకు చెరిపేయలేదు.. ఎందుకంటే నీ మనసులోంచి నన్ను తీసేయలేదు అంటూ తాను గుడికి వెళ్లిన విషయం చెప్పి స్వప్నకు రోజ్‌ ప్లవర్‌ ఇస్తాడు. స్వప్న తీసుకుంటుంది. కాశీ వెళ్లిపోతాడు. స్వప్న కోపంగా ఆ ప్లవర్‌ను డస్ట్‌బిన్‌ లో పడేస్తుంది.

Advertisement

ఈరోజు మన పెళ్లి రోజనీ నీకు గుర్తు లేదా? కానీ ఒప్పుకోవు.. ఎందుకంటే నాకు కూడా గుర్తుంది. మార్నింగ్ గుడికి వెళ్లిన సంగతి నాన్నకు కూడా తెలియదు. స్వప్నకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరి చెప్పి రోజా పువ్వు గిఫ్ట్‌గా ఇస్తాడు. దానిని స్వప్న తీసుకోవడంతో కాశీ సంతోషిస్తాడు. కానీ కాశీ వెళ్లగానే పువ్వుని స్వప్న కిందపడేస్తుంది. తర్వాత పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ కలిపి కాంచనను మరింత రెచ్చగొట్టాలని అనుకుంటారు. అప్పుడు కాంచన, దీపను ఇంట్లోకి రానివ్వదని దీంతో కార్తీక్‌ ఒంటరివాడై పోతాడని ప్లాన్‌ చేస్తారు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×