// // Aadhaar card: ఆధార్ కార్డు మిస్సయిందా? నంబర్ తెలియకపోయినా, మొబైల్ లింక్ లేకున్నా, ఇలా రికవర్ చేసుకోవచ్చు! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Aadhaar card: ఆధార్ కార్డు మిస్సయిందా? నంబర్ తెలియకపోయినా, మొబైల్ లింక్ లేకున్నా, ఇలా రికవర్ చేసుకోవచ్చు!

Aadhaar card: ఆధార్ కార్డు మిస్సయిందా? నంబర్ తెలియకపోయినా, మొబైల్ లింక్ లేకున్నా, ఇలా రికవర్ చేసుకోవచ్చు!
Advertisement

Aadhaar Card Recovery Guide: ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. భారతీయులందరికీఈ కార్డును అందించింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ కార్డు అనేది దేశ ప్రజలకు వారి బయోమెట్రిక్ ఆధారంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది దేశంలో ఎక్కడైనా అథెంటిఫికేషన్ ను అందిస్తుంది. గుర్తింపు కార్డుగానూ ఉపయోగపడుతుంది. అయితే, కొంత మంది పొరపాటుగా ఆధార్ కార్డులను పోగొట్టుకుంటారు. ఆధార్ నంబర్ తెలియకుండా, మొబైల్ నెంబర్ కూడా లింక్ చేయకుండా ఉంటే, ఆధార్ ఎలా పొందాలనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆధార్ నెంబర్ తెలియకపోయినా.. మొబైల్ నెంబర్ లింక్ కాకపోయినా..

ఒక వేళ మీ ఆధార్ కారు పోయినట్లు అయితే, నంబర్ గుర్తులేకపోయినా, మొబైల్ నంబర్ ఆధార్ కు లింక్ చేయపోయినా, కొత్త ఆధార్ కార్డు పొందే అవకాశం ఉంటుంది.  ఎలాగో.. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

Advertisement

⦿ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ద్వారా ధృవీకరణను ఆధార్ ను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ముందుగా మీరు దగ్గర లోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.

⦿ గుర్తింపు ధృవీకరణ కోసం మీ పేరు, లింగం, చిరునామా, బయోమెట్రిక్ డేటాతో సహా మీ వివరాలను ఆపరేటర్ కు చెప్పాలి.

Advertisement

⦿ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ పూర్తి అయిన తర్వాత, ఆపరేటర్ మీ ఆధార్ నంబర్‌ ను  చెప్తారు. ఆ తర్వాత మీ ఇ-ఆధార్ లెటర్ ను ప్రింటవుట్‌ ఇస్తారు.

⦿ ఆ తర్వాత మీరు ఆధార్ నంబర్‌ ను తిరిగి పొందేందుకు ఉపయోగపడే, నమోదు ID (EID)ని తిరిగి పొందడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ హెల్ప్ లైన్ 1947కి కూడా కాల్ చేయవచ్చు.

⦿ మీరు మీ ఆధార్ నంబర్‌ను పొందిన తర్వాత, OTP ధృవీకరణ కోసం మరొక మొబైల్ నంబర్‌ ను ఉపయోగించి మీరు PVC ఆధార్ కార్డ్‌ ను ఆన్‌ లైన్‌ లో ఆర్డర్ చేయవచ్చు.

⦿ మీ మొబైల్ నంబర్ ఆధార్‌ తో లింక్ చేయబడి ఉంటే, మీరు మీ ఇంటి దగ్గర ఉండే కొత్త ఆధార్ కార్డును సులభంగా డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

⦿ ముందుగా మీరు అధికారిక UIDAI వెబ్‌ సైట్‌ ను ఓపెన్ చేయాలి.

⦿ ఇప్పుడు మై ఆధార్ విభాగానికి వెళ్లండి.

⦿ మరచిపోయిన UID/EIDని తిరిగి పొందండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

⦿ ఇప్పుడు అవసరమైన వివరాలను అందించాలి. అంటే పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌కు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ లేదంటే ఇమెయిల్ వివరాలు అందించాలి.

⦿ మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్‌ లో OTPని అందుకుంటారు. ఈ OTPని ఎంటర్ చేయాలి.

⦿ మీరు OTPని ఎంటర్ చేసిన తర్వాత, ఆధార్‌కు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి.

⦿ మీ ఆధార్ కార్డ్ మీ ఇమెయిల్‌కు పంపబడుతుంది.

Read Also: చదవగానే డెలీట్ అయిపోయే రహస్య జిమెయిల్.. పాస్‌కోడ్‌తో సురక్షితంగా ఇలా పంపించండి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×