E-Paper
Advertisement

ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు కాఫీ పౌడర్ షాప్ ఓనర్!

ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు కాఫీ పౌడర్ షాప్ ఓనర్!
Advertisement

Jabardasth:సినిమాలలో నటిస్తున్నప్పుడే వచ్చిన డబ్బును వివిధ మార్గాలలో పెట్టబడులుగా పెట్టి.. ఆర్థికంగా స్థిరపడితేనే సినిమాలలో అవకాశాలు లేనప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండగలరు. కానీ అవకాశాలు చేతినిండా ఉన్నప్పుడు వచ్చిన రెమ్యూనరేషన్ ను దాచుకోకుండా జల్సాలు చేస్తే చివరికి ఇబ్బందుల పాలు అవ్వాల్సి ఉంటుంది. అందుకే కొంతమంది సినిమాల ద్వారా వచ్చిన డబ్బును దాచుకొని మళ్లీ సినిమాలలో అవకాశాలు రాకపోయేసరికి ఇతర రంగాలలో సెటిల్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకప్పుడు కమెడియన్ గా ప్రేక్షకులను అలరించి ..ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా సందడి చేసి ఇప్పుడు ఏకంగా కాఫీ పౌడర్ షాప్ ఓనర్ గా మారి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.

సినిమాలు లేక జబర్దస్త్ లో మూడేళ్లు..

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. జబర్దస్త్ లో స్కిట్స్ చేసి నవ్వులు పూయించిన తిరుపతి ప్రకాష్. ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈయన ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గత కొంతకాలంగా సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉన్న తిరుపతి ప్రకాష్ ..ఇప్పుడు ఏం చేస్తున్నాడు ? అనే విషయానికి వస్తే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

కాఫీ పొడి షాప్ కి ఓనర్ గా అవతారం..

Advertisement

తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ ..”సినిమాలలో అవకాశాలు తగ్గిపోవడంతో జబర్దస్త్ లో 2015 నుండి 2018 వరకు కొనసాగాను. సుమారుగా 180 ఎపిసోడ్ లు పూర్తయ్యాయి. అటు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఏం చేయాలి అనే ప్రశ్న ఎదురయ్యింది. దర్శకులు కలవరు..ఇంటర్వ్యూలు లేవు.. అలాంటి పరిస్థితుల్లో మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి ..ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకొని నేను స్వయంగా ఒక కాఫీ పౌడర్ షాప్ ఓపెన్ చేశాను. అంతేకాదు ఆ దుకాణాన్ని నేనే స్వయంగా చూసుకునేవాడిని. ఒక పెద్ద స్టార్ హోటల్ ప్రారంభించేంత స్తోమత లేదు. నా సామర్థ్యానికి తగ్గ వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదట టిఫిన్ సెంటర్ లేదా కిరాణా షాప్ పెట్టాలనుకున్నాను. కానీ కాఫీ పొడి వ్యాపారం మొదలుపెట్టాను.

ALSO READ:నాలుగేళ్ల వివాదానికి తెరదించిన సాయి పల్లవి!

బంధువుల సహాయంతోనే సాధ్యం..

Advertisement

బంధువుల సహాయంతో ఏప్రిల్ 11 2019లో మణికొండలో కాఫీ పొడి షాప్ ను ప్రారంభించాను. మొదట నేను వ్యాపారం మొదలు పెట్టానని తెలిసి ఆశ్చర్యపోయారు. నిజానికి కోవిడ్ వరకు నా జేబులో నుండే పెట్టుబడి పెట్టి హద్దులు చెల్లించాను. ప్రస్తుతం 1300 మంది కస్టమర్లను నేను కలిగి ఉన్నాను. ఎవరు ఎన్ని మాటలు అన్నా నాకు అనవసరం. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో ఈరోజు అలాగే ఉన్నాను . ఎవరి ముందు నేను చెయ్యి చాచలేదు. అంటూ తెలిపారు. మొత్తానికైతే స్వయంకృషితో కష్టపడితే ఎంతటి వారైనా సరే ఆర్థికంగా ఎదుగుతారు అనే విషయానికి చక్కటి నిదర్శనంగా నిలిచారు తిరుపతి ప్రకాష్ . ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×