E-Paper
Advertisement

కేసీఆర్, రేవంత్‌లది ‘వీణ-వాణి’ బంధం.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్, రేవంత్‌లది ‘వీణ-వాణి’ బంధం.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
Advertisement

Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరినీ టార్గెట్ చేస్తూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. వీరిద్దరి మాటలు కోటలు దాటుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు జరుగుతున్న మేలు మాత్రం శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ఫార్మ్ హౌస్ దగ్గర ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కనీసం సాయం అందలేదని, ఇప్పుడు రేవంత్ పాలనలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతోందని రఘునందన్ మండిపడ్డారు.

రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ పరిధిలోని చేగుంట, నార్సింగి, మాసాయిపేట వంటి మండలాల్లో అకాల వర్షాల వల్ల దాదాపు ఆరు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ‘ఫసల్ భీమా’ లేకపోవడం వల్ల రైతులు అల్లాడుతున్నారని, ‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం’ ఎప్పటికీ బాగుపడదని రఘునందన్ హెచ్చరించారు. ప్రధాని మోదీ పర్యటనల సమయంలో గతంలో కేసీఆర్ యాడ్స్ ద్వారా వార్తలను ఎలా తొక్కేశారో, ఇప్పుడు రేవంత్ కూడా అదే విద్యను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.

Advertisement

కేసీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని రఘునందన్ రావు ఆరోపించారు. వీరిద్దరినీ కలిపే దారం ‘కాళేశ్వరం’ నిర్మించిన కంపెనీయేనని, ఆ కంపెనీయే ఇప్పుడు మూసీ పనులను కూడా దక్కించుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన లక్ష కోట్ల అవినీతిని కక్కిస్తామని చెప్పిన రేవంత్, ఇప్పుడు ఆ కేసులను సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. వీరిద్దరి బంధం ‘వీణ-వాణి’ల బంధం లాంటిదని ఎద్దేవా చేస్తూ.. ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారని దుయ్యబట్టారు.

చివరగా, కవిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆమెను అప్రూవర్‌గా మార్చి అయినా కేసీఆర్ అవినీతిని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో విమర్శలు చేసి ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని, కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే వెంటనే విచారణ జరిపించాలని కోరారు. ఇకనైనా బూతులు తిట్టుకోవడం మానేసి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని రఘునందన్ రావు హితవు పలికారు.

Advertisement

Also Read: కెసిఆర్ గారూ.. పార్టీ సంగతి తర్వాత, ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి.. కోమటిరెడ్డి సెటైర్లు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×