E-Paper
Advertisement

ఫ్యామిలీతో ముంబై షిఫ్ట్ అవుతున్న బన్నీ…అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే!

ఫ్యామిలీతో ముంబై షిఫ్ట్ అవుతున్న బన్నీ…అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే!
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పుష్ప సినిమా తర్వాత ఈయన క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల కోసం ఎక్కువగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమా(Raaka Film) షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం గత ఏడాదిన్నర కాలం పాటు అల్లు అర్జున్ ముంబైలోనే ఎక్కువగా నివసిస్తున్నారు.

బన్నీ ముంబై షిఫ్ట్ అవడం లేదు..

ఇలా అల్లు అర్జున్(Allu Arjun) ఈ సినిమా షూటింగ్లో భాగంగా ముంబైలో ఉండటం తన ఫ్యామిలీ కోసం హైదరాబాద్ రావడం జరుగుతుంది . ఇలా తరచూ ముంబై (Mumbai)హైదరాబాద్ ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ముంబై హైదరాబాద్ ట్రావెల్ అవ్వకుండా తన ఫ్యామిలీని ముంబైకి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని త్వరలోనే అల్లు అర్జున్ హైదరాబాద్ కి గుడ్ బై చెబుతూ ముంబైలోనే సెటిల్ అవుతున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

రాకా పనుల కోసమే ముంబైలో బన్నీ..

Advertisement

ఇక అల్లు అర్జున్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రాబోతున్నాయి అందుకే ఈయన హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారట త్వరలోనే తన ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈ వార్తలపై అల్లు అరవింద్ (Allu Aravind)స్పందించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ ముంబైకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ పనులలో భాగంగానే ముంబైలో ఉంటున్నారు అంతేకానీ ఈయన ముంబై షిఫ్ట్ అవ్వడం లేదని తెలిపారు.

బన్నీ మూలాలన్నీ హైదరాబాద్ లోనే..

Advertisement

హైదరాబాద్లో అల్లు అర్జున్ ను ఎంతో ప్రేమించే వాళ్ళు ఉన్నారు అలాగే తన పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. ఇలా తనని ప్రేమించే వారందరూ ఇక్కడ ఉండగా తను ఎందుకు ముంబై వెళ్తారని అల్లు అరవింద్ తెలిపారు. రాబోయే మరికొన్ని నెలలు అల్లు అర్జున్(Allu Arjun) హైదరాబాద్ అలాగే ముంబై ట్రావెల్ చేస్తుంటారని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. తన మూలాలన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లాలనే ఆలోచనలో ఏమాత్రం లేరని ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలియజేయడంతో బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన సినిమా పనులలో భాగంగానే ముంబైలో ఉంటున్నారు తప్ప ఆ సినిమా పూర్తి అయితే ఈయన తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రాకా పనులలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగారాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: బాలయ్య సినిమా నుంచి నయనతార ఔట్..NBK 111 హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చందమామ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×