E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి మైండ్ బ్లాక్.. పల్లవి దెయ్యం డ్రామా సక్సెస్.. అవనికి పల్లవి పై అనుమానం..

Intinti Ramayanam Today Episode: పల్లవికి మైండ్ బ్లాక్.. పల్లవి దెయ్యం డ్రామా సక్సెస్.. అవనికి పల్లవి పై అనుమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode February 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. మా నాన్న నీ పరిస్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరు ఇలా బాధపడితే ఎలా అండి అని అవని అడుగుతుంది. ఎంత ధైర్యంగా ఉండాలని చూసినా కూడా మా నాన్నని ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉంది అని అంటాడు. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కుంగిపోతూ ఉంటే మావయ్య గారు ఇంకెలా ఉంటారు అని అవని ఎంత చెప్తున్నా సరే అక్షయ మాత్రం తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు..

ఇక అవని కూడా మా మామయ్య గారి నీలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజేంద్రప్రసాద్ దగ్గర ఏడుస్తూ ఉండడం చూసినా కమల్ మీరు ఇలా ఏడిస్తే నాన్న ఇంకా బాధపడతారు. నాన్నని సంతోషంగా ఉంచాలని డాక్టర్ చెప్పారు కదా మీరు ఇంకొకసారి ఇలా ఏడవద్దు అని అంటాడు.. ఇక తర్వాత పల్లవి నీ రాజేంద్రప్రసాద్ అనుమానంగా చూడడంతో అవనికి పల్లవి పై అనుమానం మొదలవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. భూత వైధ్యుడుని తీసుకొచ్చిన అవని ఎలాగైనా సరే.. ఈ హత్య చేయాలని ఎవరనుకుంటున్నారో తెలియాలని అనుకుంటుంది.. అందరూ నిమ్మకాయలు కట్ చేస్తే పల్లవి మాత్రం కట్ చేయడానికి కాస్త ఆలోచిస్తుంది. ఈ నిమ్మకాయ గనుక నేను ఇస్తే అది ఎర్రగా ఉంటే నేనే ఇదంతా చేశాను అని తెలిసిపోతుంది కదా అని కంగారు పడిపోతుంది. దీని నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని ఆలోచిస్తుంది. అప్పుడే సడన్ గా దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేస్తుంది.. పల్లవికి సడన్గా ఇలా దెయ్యం పట్టడం ఏంటి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇక పల్లవికి నిజంగానే దెయ్యం పట్టిందో లేదో అని తెలుసుకోవడానికి అవని ప్రయత్నాలు చేస్తుంది.. అక్కడున్న వాళ్ళందరూ నిజంగానే పల్లవికి దెయ్యం పట్టిందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు. అయితే భానుమతి భూత వైద్యుడు గారు నా మనవరాలుకి ఏదో దెయ్యం పట్టినట్లుంది దాన్ని వెంటనే వదిలించండి అని రిక్వెస్ట్ చేస్తుంది.. ఇక అవని పర్మిషన్ ఇవ్వడంతో అతను నేను ఇక్కడ ఉండగానే నువ్వు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చావా నీ సంగతి చెప్తాను అని అంటాడు. కానీ పల్లవి మాత్రం అతన్ని తోసి కింద పడేస్తుంది. అయితే భానుమతి దాన్ని కొట్టి బయటికి పంపించండి అని అంటుంది.. ఇక అవని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూత వైద్యుడు రెచ్చిపోతాడు..

Advertisement

అక్కడున్న వేపాకు కరాలతో పల్లవిని దారుణంగా కొట్టేస్తాడు.. కానీ పల్లవి మాత్రం ఆ దెబ్బలు తింటుంది కానీ తనలోని దెయ్యం గురించి మాత్రం బయట పెట్టదు.. ఇక భానుమతి ఆ చిన్న కర్రలతో కొడితే దెయ్యం పారిపోదు. ఈ కర్ర తీసుకొని కొట్టండి వెంటనే వెళ్ళిపోతుంది అని పెద్ద కర్ర తెచ్చి అతనికి ఇస్తుంది భానుమతి.. అయితే ఆ కర్ర తీసుకొని కొడుతూ ఉండగా పల్లవి ఇక నన్ను కర్రతో కొట్టి చంపేసేలా ఉన్నాడు అని కళ్ళు తిరిగి పడిపోయినట్లు నాటకం ఆడుతుంది.. ఇక వెంటనే పల్లవిని రూమ్ లోకి తీసుకొని వెళ్తారు.

అవని పల్లవి నాటకం ఆడుతుంది అని అనుకుంటుంది. అనుమానమే నిజమైనట్టుంది. అందరూ నిమ్మకాయని కొయ్యగా పల్లవి మాత్రం కొయ్యకుండా ఇలా దెయ్యం పట్టినట్లు నాటకం మారుతుందా అని ఆలోచిస్తుంది. అయితే పల్లవిని లోపలికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పల్లవి నొప్పులతో బాధపడిపోతూ ఉంటుంది.. అయితే కమల్ వేడి నీళ్లు తీసుకొని వెళ్లి ఇస్తాడు. ఆ తర్వాత భానుమతి వచ్చి జండుబాం ఇస్తుంది.. ఏంటే ముసలి అప్పుడేమో కొట్టు కొట్టు అని కర్ర తెచ్చి ఇచ్చావు ఇప్పుడేమో జండుబాం రాసుకొని అంటున్నావా నీకు కొంచమైనా ఉందా అని పల్లవి అంటుంది. ఎవరికైనా దెయ్యం పడితే అప్పుడు ఏం జరిగిందో గుర్తుకురాదు. కానీ పల్లవికి మాత్రం జరిగింది గుర్తుందీ అంటే కచ్చితంగా ఇది నాటకమే అని అవని కన్ఫామ్ చేసుకుంటుంది..

Also Read : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. ఉద్యోగం కోసం పాట్లు..కేశవ లైఫ్ లోకి అమ్మాయి.. ట్విస్ట్ అదిరింది..

మావయ్యను తోసి చంపేయాలనుకునింది పల్లవిని నా అనుమానమే నిజమైతే ఆ తర్వాత పల్లవిని అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని అవని అనుకుంటుంది. అభి కి కానిస్టేబుల్ సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకొచ్చి ఇస్తాడు.. అది చూసిన అవి షాక్ అవుతాడు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే ముందు అవనికి చెప్పాలని అనుకుంటాడు.. అయితే ఆ ఫుటేజ్ ని చూసిన అవి వెంటనే అవి దగ్గరికి బయలుదేరుతాడు. అయితే కానిస్టేబుల్ పల్లవికి ఈ విషయాన్ని చెప్తాడు.. పల్లవి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×