// // Crime News: మరణంలోనూ వీడని బంధం.. భార్య మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన భర్త -->
E-Paper
Advertisement

Crime News: మరణంలోనూ వీడని బంధం.. భార్య మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన భర్త

Crime News: మరణంలోనూ వీడని బంధం.. భార్య మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన భర్త
Advertisement

Crime News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కమ్మర్‌పల్లి గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భార్య దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేక, ఆమె అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే భర్త కూడా ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

వివరాల్లోకి వెళ్తే.. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్ (32)కు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామానికి చెందిన సువర్ణ (29)తో 2020లో వివాహం జరిగింది. అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల జీవితంలో అనారోగ్యం చిచ్చురేపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సువర్ణను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు.

Advertisement

భార్య పార్థివ దేహానికి శుక్రవారం కమ్మర్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. తన కళ్ల ముందే భార్య చితి మంటల్లో కాలిపోవడం చూసి వినోద్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. స్మశానం నుండి ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే దహెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం బెల్లంపల్లికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Also Read: దేశంలో ఘోరం.. నగ్న వీడియోలతో బెదిరించి.. విద్యార్థినిపై 4 కార్లలో అత్యాచారం

Advertisement

కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. పట్టుమని ఐదేళ్లు కూడా నిండని వీరి కాపురం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం కమ్మర్‌పల్లి గ్రామస్తులను కన్నీటిపర్యంతం చేసింది. మరణంలోనూ వీరు విడిపోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×