E-Paper
Advertisement

Honey OTT release date : నెలలోపే ఓటీటీలోకి నవీన్ చంద్ర సస్పెన్స్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ డేట్ ఇదే

Honey OTT release date : నెలలోపే ఓటీటీలోకి నవీన్ చంద్ర సస్పెన్స్ థ్రిల్లర్… స్ట్రీమింగ్ డేట్ ఇదే
Advertisement

Honey OTT release date : ఇటీవలే కాలంలో నవీన్ చంద్ర సినిమాలు ఓటీటీలో ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన నటించిన మరో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది. అది కూడా హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ కావడం విశేషం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

సన్ నెక్స్ట్ లో అందుబాటులో

2026 ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం ‘హనీ’ (Honey). ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కు అవార్డు గ్రహీత కరుణ కుమార్ దర్శకత్వం వచ్చించారు. ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైంది. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి వడ్థ్య, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కరుణ కుమార్ గతంలో వరుణ్ తేజ్‌తో చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఇక ఈ చిత్రం కూడా దూకుడు ప్రమోషన్లు లేకుండా నిశ్శబ్దంగా విడుదలైంది. సినిమా ప్రయోగాత్మక టచ్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్, మూఢనమ్మకాలు, క్షుద్ర పద్ధతులు వంటి అంశాలతో తెరకెక్కింది. 130 నిమిషాలు ఉన్న ఈ సినిమా IMDbలో 5.8 రేటింగ్ పొందింది.

Advertisement

థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సమయంలో, ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమైంది. నిజానికి, చాలా మంది ప్రేక్షకులకు అలాంటి సినిమా థియేటర్లలో విడుదలైందని కూడా తెలియదు. ఓపెనింగ్ వీక్‌లో 3 కోట్లు కలెక్ట్ చేసి, మొత్తం 8-10 కోట్లు గ్రాస్ చేసింది. బడ్జెట్ 20 కోట్లు కావడం వల్ల నష్టాలు వచ్చాయి. కానీ కంటెంట్ ఆధారిత థ్రిల్లర్‌లకు థియేటర్లలో కంటే ఓటీటీలోనే మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇప్పుడు OTTలో కొత్త ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 27న Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌ కు చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్… స్ట్రీమింగ్ కొత్త సిరీస్ సిద్ధం

కథలోకి వెళ్తే…

Advertisement

మూఢనమ్మకాల పిచ్చోడు ఆనంద్‌ (నవీన్‌ చంద్ర). అతనికి ఎంత పిచ్చి అంటే ఆ నమ్మకాల కారణంగా ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను మాత్రం వదిలి పెట్టడు. అతనికి భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా (జయన్ని) ఉంటారు. వాళ్ళు ఇతన్ని చూసి భయబ్రాంతులకు గురవుతారు. అయినా కూడా పట్టించుకోకుండా క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. అందులో భాగంగా ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని పంపిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే తాను అనుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతాడు. అది జరగాలంటే కూతురు మీరా తన మాట వినాలి అంటాడు. మొదట లలిత భర్త నిర్ణయానికి అడ్డు చెప్తుంది. కొన్ని పరిస్థితుల కారణంగా ఆమె కూడా దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. మరి కూతురు మీరాతో ఆనంద్‌ చేయించిన పని ఏంటి ? అతని క్షుద్రపూజలు ఫలించాయా ? ఆనంద్‌ కారణంగా తల్లి-కూతుళ్లకు ఎదురైన భయంకరమైన అనుభవాలు ఏంటి ? అనేది తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే.

 

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×