E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఏకలింగం నాటకానికి బ్రేక్.. చెంపపగలగొట్టిన అవని.. ఒక్కటైన అన్నదమ్ములు..

Intinti Ramayanam Today Episode: ఏకలింగం నాటకానికి బ్రేక్.. చెంపపగలగొట్టిన అవని.. ఒక్కటైన అన్నదమ్ములు..
Advertisement

Intinti Ramayanam Today Episode December 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. తమ ఊరిని చూస్తూ అవని, అక్షయ్ లు వెళుతూ ఉంటే స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు వెళ్తే డిస్టర్బెన్స్ అవుతుంది అని ఆపుతాడు ఏకలింగం.. ఆ తర్వాత హాస్పిటల్ కన్నా వెళ్తాము అంటే అక్కడ మీరు వస్తున్నారని తెలిసి ఏర్పాట్లు చేయలేదు నేను ఒక రెండు రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి అక్కడికి తీసుకొని వెళ్తాను అని అంటాడు.. పల్లవి, శ్రియాలు అక్కడికి వెళ్ళగానే అక్కడ వాళ్ళు చెప్పింది విని షాక్ అవుతారు.. మనల్ని ఎందుకు ఇలా చూస్తున్నారు అని అనుకుంటారు. పల్లవిశ్రియాలు అక్కడ పనిచేయడానికి మొదట ఒప్పుకోకపోయినా సరే కమల్ ఆస్తి గురించి చెప్పగానే వాళ్ళు పని చేయడానికి ఒప్పుకుంటారు. మొత్తానికి గెటప్ మార్చుకొని వ్యవసాయం చేసేందుకు సిద్ధపడతారు. అవని, అక్షయ్ రాజేంద్రలు ఊరంతా చూస్తూ వెళుతుండగా అక్కడ ఆరాధ్య కనిపిస్తుంది. అక్కడున్న పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తుంది. వాళ్ళని చూసి ఆగిన అవని అక్షయ్ రాజేంద్రులు పిల్లల్ని ఏంటి స్కూల్ కి వెళ్లకుండా ఆడుకుంటున్నారు అని అడుగుతారు.. పిల్లలు చెప్పిన మాటలు విని అవని అక్షయ్ రాజేంద్ర ముగ్గురు కూడా వాళ్ళు కట్టించిన స్కూల్ దగ్గరికి వెళ్తారు అక్కడ పరిస్థితిని చూసి, అక్కడ చెట్టు కింద పాఠాలు చెప్తున్న టీచర్ చెప్పిన మాటలు విని ఏకలింగం బండారం మొత్తం తెలుసుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. స్కూల్ పరిస్థితి ఇలా ఉంది అంటే.. ఇక హాస్పిటల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి అని ముగ్గురు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు.. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన అవని,అక్షయ్, రాజేంద్ర లు అక్కడున్న పరిస్థితిని చూసి షాక్ అయిపోతారు.. అది మొత్తం బారుగా ఉంటుంది. తాగుబోతులందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తుంటారు అది చూసి ఏకలింగానికి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటారు. హాస్పిటల్ వాతావరణం చూసి షాక్ అవుతారు.. హాస్పిటల్ లోపలి నుంచి రోగులు వస్తారు అనుకుంటే ఇలా మందు తాగిన వాళ్ళు బయటకు వస్తున్నారేంటి అని అనుకుంటారు. బయటికి వచ్చిన ఓ వ్యక్తి మందు కావాలంటే లోపలి దొరుకుతుంది వెళ్ళండి అని అంటాడు.. అసలు ఏం జరుగుతుందో లోపలికి వెళ్లి చూద్దాం పదండి అని ముగ్గురు లోపలికి వెళ్తారు.

Advertisement

అయితే అక్కడ కనిపించిన పరిస్థితిని చూసి ముగ్గురు కూడా షాక్ అవుతారు. ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి లోపల శ్రీది హాస్పిటల్ లో లేకపోతే ఇంకేమైనానని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఓ వ్యక్తి కౌంటర్ ఇక్కడుంది సిటీ నుంచి వచ్చారా? ఆడవాళ్లు కూడా మందు తాగుతారు కదా మీకు ఏం కావాలో చెప్పండి అని అడుగుతాడు. ఇది మా అమ్మ పేరు మీద కట్టించిన హాస్పిటల్ ఇలా చేసావ్ ఏంట్రా ఎవడ్రా నువ్వు అని అక్షయ్ అతని చెంప పగలగొట్టి అడుగుతాడు.. ఈ బారు ఎవరిదో తెలుసా తెలుసుకొని మాట్లాడుతున్నావా అని అతను అనగానే ఎవరిదిరా అని అక్షయ్ అడుగుతాడు. ఈ బారు ఏక లింగం గారిది మీరు ఏం మాట్లాడాలని అనుకున్న ఆయనతో మాట్లాడుకోండి అని అంటారు..

ఇక ఆ తర్వాత బయటకు వచ్చినా అక్షయ్, అవని రాజేంద్రలు ముగ్గురు కూడా.. శ్రీకర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని అక్షయ్ చెప్తాడు.. వాడు మన ఆస్తులన్నిటిని దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మ పేరు మీద కట్టిన హాస్పిటల్ స్కూల్ కూడా ఇప్పుడు వేరేలా ఉంది. మీరు రండి వాడి అంతు చూసుకుందామని అక్షయ్ అంటాడు.. శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా అక్షయ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఏకలింగం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలని అనుకుంటారు. ఏకలింగం తనని నమ్మించి వంద రూపాయలు మోసం చేశాడని తన గుమస్తాని కొడుతూ ఉంటాడు. వీళ్ళు రావడం గమనించిన ఏక లింగం సర్వేజనా సుఖినోభవంతు అని మర్యాదగా నమస్కారం చేస్తాడు.

Advertisement

ఆపరా నీ నాటకాలు నీ గురించి అంతా తెలుసుకునే ఇక్కడికి వచ్చాము అని వాళ్ళ అనగానే ఏక లింగం షాక్ అవుతాడు. స్కూల్ కి వెళ్తామంటే అక్కడ ఎగ్జామ్ జరుగుతున్నాయని మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపావు. హాస్పిటల్ కి వెళ్దామంటే అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవు మిమ్మల్ని తీసుకుని వెళ్తామని మమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేశావు ఇదేనా నువ్వు చేసేది అని అవని అంటుంది. మా అమ్మ పేరు మీద మా నాన్న కట్టించిన వాటిని ఇలా నీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నావా నీకు ఎంత ధైర్యం రా అని అక్షయ్ అడుగుతాడు.. మా అమ్మ గుర్తుగా మిగిలిన వాటిని ప్రజలకు అందనివ్వకుండా ని స్వప్రయోజనాలకి వాడుకుంటున్నావా అని అక్షయ్ అడుగుతుండగా ఏకలింగం ఆపరా నీ అమ్మ గోల అని అంటాడు.

మీ అమ్మ ఎలా ఉంటుందో నీకు తెలీదు ఎప్పుడు చచ్చిన అమ్మ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావ్ ఏంట్రా అని ఏకలింగం అనగానే అవని తన చెంప పగలగొడుతుంది.. నన్నే కొడతావా అని ఈకలింగం అంటాడు. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తావని ముగ్గురు తమ్ముళ్ళు ఒక్కటైపోతారు. మా వదిన కాబట్టి కొట్టి ఊరుకుంది. అదే మేమైతే చంపేస్తామని కమల్ అంటాడు. నిన్ను నమ్మి ఇక్కడున్న ఆస్తులన్నీ నీ చేత పెడితే నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు. నీకు ఇక టైం ఇయం వారంలోగా మాకు రావాల్సిన ఆస్తులు మేము ఇప్పటివరకు పంపించిన విరాళాలు అన్నీ కూడా మాకు అప్పజెప్పాలి అని రాజేంద్ర కండిషన్ పెడతాడు. ఏంట్రా అప్పగించేది వీళ్ళు సంగతి ఏంటో చూడండి రా అని తన మనుషుల్ని వాళ్ళ మీదకి పంపిస్తాడు..

Also Read : మహా ఫుల్ హ్యాపీ.. చక్రితో ప్రేమలో పడుతుందా..? ప్రతాప్ కు నిజం తెలిసిపోతుందా..?

ముగ్గురు అన్నదమ్ములు కూడా ఏకలింగం మనుషుల్ని చితగ్గొట్టేసి అతనికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తారు.. రాజేంద్రప్రసాద్ తన ఆస్తులు ఇవ్వకుంటే ఏం చేయాలో అది చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఈ ఊరికి మాత్రమే ప్రెసిడెంట్ మిగతా వాటికి కాదు కదా నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అని రాజేంద్ర అంటాడు.. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో అవనిని చంపేందుకు ఏక లింగం తన మనుషులని పంపిస్తాడు.. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×