// // Japan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 50 వెహికల్స్‌ ధ్వంసం.. మంటల్లో అనేక మంది! -->
E-Paper
Advertisement

Japan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 50 వెహికల్స్‌ ధ్వంసం.. మంటల్లో అనేక మంది!

Japan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 50 వెహికల్స్‌ ధ్వంసం.. మంటల్లో అనేక మంది!
Advertisement

Japan: జపాన్‌లోని గున్మా ప్రిఫెక్చర్‌లో ఏడాది ముగింపు సెలవుల ఉత్సాహం విషాదంగా మారింది. టోక్యోకు సమీపంలోని మినాకామి పట్టణంలో ఉన్న కానెట్సు ఎక్స్‌ప్రెస్‌ హైవేపై శుక్రవారం అర్ధరాత్రి వేళ ఊహించని రీతిలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. మంచు తుపాను కారణంగా రహదారి మొత్తం మంచుతో పేరుకుపోయి అత్యంత ప్రమాదకరంగా మారిన తరుణంలో, రెండు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ చిన్న ప్రమాదం కాస్తా పెను విపత్తుగా మారి, చూస్తుండగానే సుమారు 50కి పైగా వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.

క్షణాల్లో ఊహించని ప్రమాదం..
ఈ ప్రమాదంలో 77 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. రహదారి మంచుతో కప్పబడి ఉండటంతో వాహనాలు అదుపుతప్పి స్కిడ్ అయ్యాయని, వెనుక నుంచి వస్తున్న డ్రైవర్లు అప్రమత్తమైనప్పటికీ బ్రేకులు వేయడం సాధ్యపడలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ హిమపాతం హెచ్చరికలు అమల్లో ఉండటంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలిగింది.

Advertisement

Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు

మంటల్లో 50 వెహికల్స్‌
ఢీకొన్న వాహనాల తాకిడికి ప్రమాద స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఈ అగ్నిప్రమాదంలో డజనుకు పైగా వాహనాలు మంటల్లో చిక్కుకోగా, కొన్ని కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత భాగాన్ని మూసివేసి, శిథిలాల తొలగింపు చర్యలు చేపడుతున్నారు. సెలవుల వేళ ప్రయాణాల్లో ఉన్న ప్రజలకు ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×