E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి భరత్ దిమ్మతిరిగే షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్.. రాజేశ్వరికి స్ట్రాంగ్ వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: అవనికి భరత్ దిమ్మతిరిగే షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్.. రాజేశ్వరికి స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 23rd: భరత్ తనకు రాజేశ్వరి ఇచ్చిన కారు గురించి ఇంట్లో చెప్పాలని అనుకుంటాడు. అయితే కారు గురించి ఇంట్లో చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మీనాక్షిని అలాగే ప్రణతిని కార్లో బయటికి తీసుకుని వెళ్లాలని భరత్ అనుకుంటాడు. ఈ కొత్త కారు ఎక్కడిది రా నీ భరత్ నీ మీనాక్షి అడిగితే రాజేశ్వరి మేడం నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్తాడు.. నీకోసం ఒక కారు వస్తుంది కదా మళ్ళీ ఈ కార్నెందుకు గిఫ్ట్ గా ఇచ్చింది అని ప్రణతి అడగగానే.. ఆవిడ జనరల్ మేనేజర్ గా నాకు కారు లేకపోతే బాగోలేదు అని కారుని గిఫ్ట్ గా ఇచ్చింది అని చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు.. చక్రధర్ మాత్రం భరత్ నీ తన వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేస్తుంది అని అనుకుంటాడు. అవనికి భరత్ నీ తన వైపు తిప్పుకునేందుకు రాజేశ్వరి గిఫ్ట్లు ఇస్తుంది అని చెప్తాడు.

భరత్ దెబ్బకు అవనికి మైండ్ బ్లాక్…

రాజేశ్వరి పిన్ని ఎందుకు భరత్ కోసం ఇలాంటి పనులు చేస్తుంది అని అవని అక్షయ్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆవిడ తన కొడుకుని తల వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఇలా గిఫ్ట్లు ఇచ్చి చేసుకోవడం వల్ల నిజాలు తెలిస్తే ఎంత బాధ పడిపోతారో అని పిన్ని ఆలోచించడం లేదు అని అవని మాట్లాడుతుంది. అప్పుడే భరత్ అటుగా వెళ్లడం గమనించిన అవని భరత్ తో మాట్లాడాలి పదండి అని అంటుంది. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని భరత్ ని అవని అడుగుతుంది. రాజేశ్వరి పిన్నిగా ఇచ్చింది అందులో తప్పేమీ లేదు కదా అని భరత్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

పల్లవి భరత్ ను మారుస్తుందా..? 

Advertisement

మామా భరత్ ఇచ్చిన కారు గురించి తను ఇంట్లో చెప్పాడో లేదో.. అయితే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది తెలుసుకుంటే ఆ తర్వాత భారత్ ని ఇంకాస్త దూరం చేయొచ్చు అని పల్లవి ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్లుగానే పల్లవి భరత్ కి ఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళు కారు గురించి ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ప్రణతి అమ్మ మాత్రం కారు గురించి ఒప్పుకోవడం లేదు.. అక్క కూడా నన్ను తిడుతుంది అని భరత్ కి చెప్పగానే.. పల్లవి అందరూ నిన్ను తిడతారో ఎందుకంటే నువ్వు వాళ్ళు చెప్పినట్లు వినలేదు కదా అనే భరత్ ని మోటివేట్ చేస్తుంది పల్లవి.. భరత్ ఎలాగైనా సరే వాళ్ళకి దూరం అవ్వాలి అని పల్లవి అనుకుంటుంది.

రాజేశ్వరిని కలిసిన అవని..

భరత్ ని ఎందుకు ఇలా మారుస్తుందో రాజేశ్వరి పిన్నిని అడిగి తెలుసుకోవాలి అని అవని అనుకుంటుంది. అక్షయ్ ని తీసుకొని రాజేశ్వరి ఇంటికి వెళుతుంది అవని. అక్కడ రాజేశ్వరిని చూసి ఎందుకు పిన్ని ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. నేనేం చేశాను ఏం చేయాలో అది చేశాను దాని తప్పేంటి అని రాజేశ్వరి ఎంత చెప్తున్నా సరే వినకుండా ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నీ తమ్ముడికి జాబ్ ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి దీని గురించి మాట్లాడుతున్నావా అని భానుమతి అంటుంది. వీళ్ళిద్దరి మధ్య మాటలు కాస్త గొడవగా మారతాయి.

అవని స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

మీరు మీ కొడుకుని దగ్గర చేసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఈ విషయాన్ని మీరు బయట పెడితే మీ కూతురు పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించండి అని రాజేశ్వరి కి వార్నింగ్ ఇస్తుంది. మా అమ్మ అంటే ఇష్టం లేని పల్లవి మిమ్మల్ని వదిలేసి ఎవరిని తల్లిగా ఊహించుకోలేదు అని అవని అంటుంది. మా తమ్ముడు సంగతి పక్కన పెడితే మీ కూతురు పెంచిన తల్లికి కన్నతల్లికి మధ్య దూరం అయ్యి నలిగిపోతుంది. అది మీరు అర్థం చేసుకోవడం లేదు. ఇది నిజాన్ని మీరు చెప్పాలనుకుంటే చెప్పుకోండి అని అవని రాజేశ్వరి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

పల్లవి దెబ్బకు అవనికి షాక్..

అవని వచ్చి వెళ్లిన సంగతిని రాజేశ్వరి పల్లవితో చెప్తుంది. తను నాకు వార్నింగ్ ఇచ్చింది కానీ భరత్ అనే నేను మాత్రం వాళ్లకి దూరం చేయకుండా ఆగను అని రాజేశ్వరి అంటుంది. పల్లవి తన తండ్రి ఇచ్చిన 50 లక్షలు గురించి రాజేశ్వర్ కి చెప్పి పెద్ద గొడవ చేయమని చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :నటి మహేశ్వరి యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×