E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును హగ్ చేసుకున్న ఇందు  

Brahmamudi Serial Today Episode April 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును హగ్ చేసుకున్న ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode: బయటకు తీసుకెళ్లిన రాజుతో ఇందు తనకు ఐస్‌క్రీమ్‌ కావాలని అదీ కూడా   దొంగతనం చేసిన ఐస్‌క్రీమ్‌ తనకు కావాలని అడుగుతుంది. దీంతో రాజు కోపంగా ఇందును తిడతాడు. దీంతో మనం ఇంటికి వెళ్దాం పద ఆ ఇంటి ఓనరు ముందే మనం తేల్చుకుందాం అనగానే.. రాజు అక్కర్లేదు అనగానే.. అయితే చేస్తావా..? అని అడగుతుంది. చేయక చస్తానా..? ఇక్కడే ఉండు అనగానే.. హలో ఎక్కడకు వెళ్తున్నావు అంటూ ఇందు అడుగుతుంది. దీంతో ఇందు అసలు విషయం ఏంటంటే నేను దొంగతనం చేసి నేనే తినాలి.. కానీ నువ్వు నా పక్కనే ఉండి మేనేజ్‌ చేయాలి అంటూ చెబుతుంటే.. రాజు కొట్టబోతుంటే.. ఇందు ఏడుస్తూ.. ఒక ఆడపిల్లను చేసి చంపేయాలనుకుంటున్నావా..? నేను హర్ట్‌ అయ్యాను అంటుంది.

దీంతో రాజు హలో నీ ఫర్మామెన్స్‌ అయిపోయిందా… ఇక వెళ్దామా..? అంటూ ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్‌ బండి దగ్గరకు వెళ్తారు.  ఐస్‌క్రీమ్‌ బండి వాన్ని రాజు మాటల్లో పెడితే ఇందు ఐస్‌క్రీమ్‌ కొట్టేసి తీసుకుని దూరంగా వెళ్లి హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో రాజు ఇప్పుడు నీ డ్రీమ్‌ నిజం అయింది కదా..? అదే నీకు చిన్నప్పటి నుంచి దొంగతనం చేయాలని ఉండేది అన్నావు కదా అది ఇప్పుడు తీరిపోయింది కదా అంటున్నాను.. అనగానే.. ఇందు అవును అంతా తమరి దయ థాంక్యూ సో మచ్ అంటూ ఐస్‌క్రీమ్‌ తినమని రాజుకు ఇస్తుంది ఇందు. రాజు నాకెందుకు ఇస్తున్నావు.. నువ్వు కదా దొంగతనం చేసి తినాలి అన్నావు అనగానే.. ఇందు కోపంగా అసలు నీ ప్రాబ్లమ్‌ ఏంటి..? నువ్వు ఐస్‌క్రీమ్‌ తీసుకోకపోతే పెద్ద గొడవ చేస్తాను. అనగానే.. రాజు ఐస్‌క్రీమ్‌ తీసుకుంటాడు. రాజు ఫాస్ట్‌గా ఐస్‌క్రీమ్‌ తినగానే.. ఇందు నీకు ఇంకో ఐస్‌క్రీమ్‌ కావాలనిపిస్తుంది కదా..? రా వెళ్దాం ఇంకోటి కొట్టేద్దాం అని చెప్పగానే.. రాజు వద్దు నాకేం వద్దు..ఇవాళ నన్ను ఇరికించాలని ప్లాన్‌ చేసినట్టు ఉన్నావు.. నేను రాను అంటాడు రాజు.

Advertisement

దీంతో ఇందు అయితే నేను ఇంటికి వెళ్లి ఓనరుతో తేల్చుకుంటాను అంటూ రాజును బెదిరించగానే.. సరే వెళ్దాం పద అంటాడు రాజు. ఇందు చేతిలో ఐస్‌క్రీమ్‌ చూసిన బండి వాడు ఈ ఐస్‌క్రీమ్‌ ఎక్కడిది అని అడగ్గానే.. రాజు కోపంగా ఏయ్‌ పక్క బండి దగ్గర కొన్నాంలేవయ్యా.. అని చెబితే ఇందు మాత్రం అబద్దం చెప్తున్నాడు.. ఇందాకే రెండు ఐస్‌క్రీములు కొట్టేశాడు. అని చెప్పగానే.. రాజు కోపంగా ఏయ్‌ నేను కొట్టేయడమేంటే..? అంటూ ఇందును తిడుతుంటే.. ఐస్‌క్రీమ్‌ బండి వాడు రాజును తిడుతుంటాడు. ఇంతలో ఇందు కోపంగా కొట్టేసిన ఐస్‌క్రీమ్‌ కు డబ్బులు ఇచ్చేయ్‌ అని రాజుకు చెప్పి బైక్‌ దగ్గరకు వెళ్లిపోతుంది. ఇదేదో బాగుందే మనం చెప్పిన మాట వింటున్నాడు అనుకుంటూ నవ్వుకుంటుంది. ఇంతలో రాజు వచ్చి నవ్వు ఆపుతావా..? ఏయ్‌ ఆపు అంటూ తిడుతుంటే.. ఇందు నవ్వుతూ.. కోపంగా ఉంది కదా..? నిజం చెప్పానని ఫీల్‌ అయ్యావా..? అంటూ అడగ్గానే.. లేదు.. కాలిపోతుంది.

ఇంకా నేను దొంగనని, కిడ్నాపర్‌ అని మెడలో ఒక ట్యాగ్‌ వేయ్‌ అప్పుడు చాలా బాగుంటుంది.. నిన్ను చూస్తుంటే.. అంటూ తిడుతూ.. నేను రెండు నిమిషాలు అలా పక్కకు వెళ్లి వస్తాను అనగానే.. ఇందు సరే రెండు నిమిషాలు కాదు.. ఐదు నిమిషాలు అయినా వెళ్లి రా అంటూ వెళ్లి త్వరగా రా అని చెప్పగానే.. రాజు పక్కకు వెళ్లి ఒక బీరు తీసుకుని కోక్‌ టిన్‌లో బీరు నింపి ఇది తను తాగితే మత్తు ఎక్కుతుంది. వెంటనే ఇంటికి వెళ్దాం పద అంటుంది అనుకుని తీసుకెళ్లి కోక్‌ టిన్‌ ఇందుకు ఇస్తూ..ఇది తాగు దీని స్పెషాలిటీ ఏంటో నీకు తెలియదు అంటాడు. అంటే తాగగానే మత్తు ఎక్కుతుందా..? అని అడగ్గానే.. రాజు షాక్‌ అవుతాడు. ఇందు జోక్‌ చేశానులే అంటుంది. ఇక రాజు తన మాటలతో ఇందు బీరు తాగేలా చేస్తాడు. బీరు తాగిన ఇందు మత్తులో రోడ్డు మీదే డాన్స్‌ చేస్తుంది. రాజును పిలిచి డాన్స్‌ చేస్తూ.. హగ్‌ చేసుకుంటుంది. దీంతో రాజు ఫీల్‌ అవుతాడు. తర్వాత బెలూన్స్‌ కనబడగానే.. ఇందు పరుగెత్తుకుంటూ వెళ్లి తీసుకుని వెళ్తుంది. మీరు తాగితే మత్తు ఎక్కి ఇంటికి వెళ్దాం పద అంటుంది అంటే ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటూ వెళ్లి బెలూన్స్‌ అతనికి డబ్బులు ఇచ్చి ఇందు వెనకాలే పరుగెడతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×