E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ ను షూట్ చేసిన వైరా 

Karthika Deepam 2 Serial Today Episode April 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ ను షూట్ చేసిన వైరా 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: వైరా మనుషులు వచ్చి దశరథ కారు తీసుకుని వెళ్లిపోతుంటే అప్పుడే పోలీసులతో వచ్చిన దాస్‌ దశరథను తమ కారులో ఎక్కించుకుని కిడ్నాపర్లు వెళ్తున్న దశరథ కారును ఫాలో అవుతారు. కొంత దూరం వెళ్లాక ఒక దగ్గర కారును వదిలేసి వెళ్లిపోయి ఉంటారు. పోలీసులు మెల్లగా కారు దగ్గరకు వెళ్లి చెక్‌ చేయగా అందులో డబ్బులు ఉండవు. దీంతో దశరథ బ్యాగ్‌ తీసుకుని కారు వదిలేసి వెళ్లిపోయారు. మిమ్మల్ని ఫాలో అవ్వొద్దంటే వినలేదు.. వాడు మన ప్రతి మూమెంట్‌ అబ్జర్వ్‌ చేస్తున్నాడు అంటూ దశరథ చెప్పగానే.. పోలీసులు దశరథ, దాస్‌ను ఇంటికి వెళ్లమని చెప్తారు. దీంతో దాస్‌, దశరథ వెళ్లిపోతారు. వాళ్ల వెనకాలే స్కూటీ మీద వచ్చిన కార్తీక్‌, పారిజాతం అంతా గమనిస్తుంటారు. పారిజాతం ఓరేయ్‌ మనవడా ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా అని అడగ్గానే.. జ్యోత్స్న పోయినట్టే.. ఆశలు వదిలేసుకోవాల్సిందే అని చెప్తుండగానే.. అయితే సుమిత్ర పరిస్థితి ఏంట్రా అని అడగ్గానే.. అయితే మనం ఒక ప్రయత్నం చేయాల్సిందే.. దీనికో షార్ట్‌ కట్‌ ఉంది వెనక్కి వెళ్దాం పద అంటూ ఇద్దరు తిరిగి రిటర్న్‌ అవుతారు.

మరోవైపు ఇంట్లో దీపను చూసిన సుమిత్ర జ్యోత్స్న భ్రమ పడుతూ అందరినీ పిలుస్తుంది. శివనారాయణ వచ్చి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని అడగ్గానే.. సుమిత్ర, దీప ముఖం చూసి నువ్వా..? అంటూ దీపను తిడుతుంది. దీంతో దీప మీరేమీ తినకుండా టాబ్లెట్‌ వేసుకోకుండా ఇలాగే ఉంటే మీ ఆరోగ్యం ఏం అవుతుంది అంటూ చెప్పగానే.. సుమిత్ర కోపంగా నేను ఏమైపోతే నీకేంటి..? నాకు మనఃశాంతి కల్పించాలని నువ్వు అనుకుంటే నాకు దూరంగా ఉండు అంటూ తిడుతుంది. దీంతో శివనారాయణ మంచినీళ్లైనా తాగొచ్చు కదమ్మా.. నీ కూతురు రాగానే మాట్లాడటానికైనా నీకు ఓపిక ఉండాలి కదమ్మా అంటూ సుమిత్రకు వాటర్‌ ఇస్తాడు శివనారాయణ. దీప మనసులో బాధపడుతుంది. జ్యోత్స్న నీకు ఎంత బలహీనం అయిందో.. తను నీ కూతురు కాదని తెలిస్తే నువ్వు బతవని అర్థం అయింది అనుకుంటుంది.

Advertisement

వైరా తన మనుషుల కోసం ఎదురుచూస్తుటే.. తన మనుషులు డబ్బులు తీసుకుని వెళ్తారు. వాళ్లను చూసిన  వైరా బ్యాగ్‌ ఓపెన్ చేసి చూసి హ్యాపీగా ఫీలవుతాడు. జ్యత్న్స నవ్వుతూ ఇప్పటికైనా నమ్ముతావా..? మా అమ్మనాన్నలకు నేనంటే ఎంత ప్రేమో అంటూ చెప్పగానే.. డబ్బులు చూశాక నమ్మకుండా ఉంటానా… అనగానే.. అయితే వెంటనే నా కట్లు విప్పి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చి నన్ను మెయిన్‌ రోడ్డు మీద వదిలేయ్‌ అనగానే.. వైరా వదిలిపెట్టను నేను నిన్ను మోసం చేస్తున్నాను అంటాడు. దీంతో జ్యోత్స్న కోపంగా తిడుతుంటే.. వైరా అవేమీ పట్టించుకోకుండా డబ్బులు తీసుకుని వెల్లిపోతుంటే అప్పుడే పారిజాతం, కార్తీక్‌ వస్తారు.  కార్తీక్‌ ను చూసిన వైరా అసిస్టెంట్‌ బాస్‌ హీరో వచ్చేశాడు అని చెప్తాడు. దీంతో ఈ గొంతు ఎక్కడో విన్నట్టు ఉందే అనుకుంటూ రౌడీలతో కార్తీక్‌ ఫైట్‌ చేస్తాడు. వైరా ముఖానికి ఉన్న మాస్క్‌ తీసి ముఖం చూసి మరింత కోపంగా కొడుతుంటాడు. వైరా మాత్రం తప్పించుకుని డబ్బు తీసుకుని ఎస్కేప్‌ అవ్వాలని ప్రయత్నిస్తాడు. జ్యోత్స్న అడ్డుపడుతుంది. కర్రతో వైరా తల బద్దల కొడుతుంది. కార్తీక్‌ ఒకవైపు, పారిజాతం ఒకవైపు రౌడీలతో ఫైట్‌ చేస్తుంటారు. ఇంతలో వైరా గన్‌ తీసి జ్యోత్స్నను కాల్చబోతుంటే కార్తీక్‌ అడ్డుపడతాడు.  జ్యోత్స్న, పారిజాతం గట్టిగా అరుస్తారు.

మరోవైపు జ్యోత్స్న లేకుండా ఇంటికి వెళ్లిన దశరథ, దాస్‌లను సుమిత్ర తిడుతూ.. ఇంక మిమ్మల్ని నమ్ముకుని లాభం లేదు నేనే వెళ్లి నా కూతురును తెచ్చుకుంటాను అంటూ వెళ్లబోతుంటే.. జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్నను చూసి అందరూ హ్యాపీగా ఫీలవుతారు. సుమిత్ర జ్యోత్స్న చేతులకు ఉన్న రక్తం చూసి ఈ రక్తం ఏంటే అని అడగ్గానే.. బావను గన్ తో షూట్‌ చేశారు మమ్మీ అని చెప్పగానే.. దీప షాక్‌ అవుతుంది. నా బావకు ఏమైంది అంటూ ఏడుస్తుంది. అప్పుడే కార్తీక్‌ వస్తాడు. బాగానే ఉంది అంటాడు. శివనారాయణ అసలు ఏం జరిగిందిరా అని అడగ్గానే.. కార్తీక్‌ జరిగింది చెప్తాడు. కార్తీక్‌ లేకపోయి ఉంటే మీ మనవరాలు చనిపోయేది అంటూ పోలీసులు చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీక్‌ వైరా గురించి చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×