E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు సపోర్ట్ గా చక్రధర్.. భరత్ కు షాకిచ్చిన పల్లవి.. రాజేశ్వరి సర్ప్రైజ్ గిఫ్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు సపోర్ట్ గా చక్రధర్.. భరత్ కు షాకిచ్చిన పల్లవి.. రాజేశ్వరి సర్ప్రైజ్ గిఫ్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 22nd: చక్రధర్ కి తన మనుషులు ఫోన్ చేసి అక్షయ్ కి షూరిటీ సంతకం పెట్టారు కదా.. మీ దగ్గర ప్రాపర్టీస్ ఏమీ లేవు అని అతను డబ్బులు కట్టమని కోరాడట అని చెప్తాడు. ఆ మాట వినగానే చక్రధర్ అవనికి ఫోన్ చేసి నేను నీతో అక్షయతో ఒక విషయం చెప్పాలి మీరు అర్జెంటుగా రండి అని ఒక లొకేషన్ ని పంపిస్తాడు.. అక్కడికి వచ్చిన అవని అక్షయలకు చక్రధర్ తన ప్రాపర్టీస్ అన్ని రాజేశ్వరి పేరు మీదకు వెళ్ళగానే ఆ ఫైనాన్స్ ఇయర్ డబ్బులు ఇవ్వనని అన్నాడట నాకు ఇందాకే తెలిసింది అని అడుగుతాడు. నాన్న మరేం పర్లేదు దాని గురించి మేము ఆలోచిస్తాము అని అనగానే ఏం అవసరం లేదమ్మా.. ఇందులో 50 లక్షల డబ్బులు ఉన్నాయి మీరు తీసుకోవాల్సిందని బలవంతంగా ఆ డబ్బులు వాళ్లకు ఇస్తాడు…

చక్రధర్ లో ఇంత మార్పా..? 

నేను బాధ్యతగా ఎన్నో చేయాలి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు అదే బాధ్యతతో మీకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను కాబట్టే ఈ డబ్బులు తీసుకొచ్చాను. ఇది మీ రాజేశ్వరి పిన్ని దగ్గర తెచ్చినవి కాదు నా దగ్గర ఉన్న నా పర్సనల్ అమౌంటు అని చక్రధర్ అంటాడు. మీకు చేయాల్సిన వయసులో ఏది చేయలేదు. కానీ ఇప్పుడు నాకు తోచింది నేను చేస్తున్నాను. దయచేసి ఇది కాదనకండి అని చక్రధర్ ఆ డబ్బులను అవనికి ఇస్తాడు.. చక్రధర్ దగ్గర్నుంచి అక్షయ్ డబ్బులను తీసుకుంటాడు.

భరత్ కు షాకిచ్చిన పల్లవి.. 

Advertisement

భరత్ ఆఫీస్ లో ఉండగా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన పల్లవి భరత్ కి లోపలికి రావచ్చా అని అడుగుతుంది. మేనేజర్ గా జాబ్ చేస్తున్నందుకు కాంగ్రెస్ అని పల్లవి అనగానే భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నన్ను తిట్టడానికి కొట్టడానికి వచ్చారు అని అనుకున్నాను. కానీ మీరు ఇలా కంగ్రాట్స్ చెప్పడం నాకు కొత్తగా ఉంది అని భరత్ అంటాడు. ఒకప్పుడు నాకు అలాంటి ఫీలింగే ఉండేది కానీ ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి నీకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను అని పల్లవి అంటుంది.. అక్కడికి వచ్చిన రాజేశ్వరి పల్లవి గురించి గొప్పగా చెప్తుంది.

కొడుకు, కూతురితో సంతోషంగా రాజేశ్వరి..

భరత్ నీ విషయానికి ఇలా వచ్చాను మామ్ అని పల్లవి చెప్పగానే రాజేశ్వరి పల్లవి గురించి నువ్వు ఎలా ఫీలవుతున్నావో నేను బాగా అర్థం చేసుకోగలను. నా కూతురు కూడా నాలాగే ఆలోచిస్తుంది. ఈ రోజు గురించి తప్ప నిన్నటి గురించి అస్సలు ఆలోచించదు అని తన కూతురు పల్లవి గురించి గొప్పగా చెప్తుంది. నా కూతురు చాలా మంచిది నువ్వు కూడా అలా అదే చూడు అని రాజేశ్వరి చెప్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేసి చాలా సంతోషంగా ఉంటారు. రాజేశ్వరి కి తన మేనేజర్ వచ్చి చక్రధర్ గారు తన అకౌంట్లో డబ్బులను డ్రా చేసి అవని అక్షయలకు ఇచ్చారు అని చెప్పగానే షాక్ అవుతారు. దీని గురించి నేను చూసుకుంటాను అని రాజేశ్వరి అంటుంది.

పార్వతి ఫుల్ హ్యాపీ..

Advertisement

అవని అక్షయ్లు చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. అవని అత్తయ్య ని కేకలు వేసి మరి పిలుస్తుంది. బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా కంగారు పడ్డాము. కానీ మా నాన్న ఆ డబ్బులు ఇవ్వడంతో అలాంటి ఆలోచన రాదు అని అర్థమవుతుంది అని అవని అంటుంది . మరి డబ్బులు ఇచ్చినట్లు రాజేశ్వరి అత్తయ్యకి తెలిస్తే పెద్ద గోల చేస్తుందేమో అని కమల్ అంటాడు. ఆయన తన పర్సనల్ అకౌంట్ నుంచి మాత్రమే ఆ డబ్బులు తీసానని చెప్తున్నాడు. అత్తయ్యకి తెలిసిన పెద్ద ప్రాబ్లం లేదులేరా అని అక్షయ్ అంటాడు. ఏది ఏమైనా కూడా మన సమస్యలు పూర్తిగా తీరిపోయాయి అని పార్వతి కూడా అంటుంది.

భరత్ కొత్త కారు..

భరత్ కు రాజేశ్వరి ఇచ్చిన కొత్త కారుని తీసుకొని చాలా సంతోషంగా తన ఇంటికి వస్తాడు.. ఆ కార్ గురించి తన ఇంట్లో వాళ్ళతో చెప్పాలని అనుకుంటాడు. అయితే కారు గురించి ఇంట్లో చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మీనాక్షిని అలాగే ప్రణతిని కార్లో బయటికి తీసుకుని వెళ్లాలని భరత్ అనుకుంటాడు. ఈ కొత్త కారు ఎక్కడిది రా నీ భరత్ నీ మీనాక్షి అడిగితే రాజేశ్వరి మేడం నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్తాడు.. నీకోసం ఒక కారు వస్తుంది కదా మళ్ళీ ఈ కార్నెందుకు గిఫ్ట్ గా ఇచ్చింది అని ప్రణతి అడగగానే.. ఆవిడ జనరల్ మేనేజర్ గా నాకు కారు లేకపోతే బాగోలేదు అని కారుని గిఫ్ట్ గా ఇచ్చింది అని చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఏపిటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :సమ్మర్ ఎఫెక్ట్..’గుండెనిండా గుడిగంటలు ‘ బాలుకు ఎన్ని కష్టాలో..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×