E-Paper
Advertisement

టైలర్ జీవితాన్ని మార్చిన వేశ్య స్పర్శ… అలా చూస్తూ ఉండిపోయే అద్భుతమైన కథ

టైలర్ జీవితాన్ని మార్చిన వేశ్య స్పర్శ… అలా చూస్తూ ఉండిపోయే అద్భుతమైన కథ
Advertisement

Romantic Movie OTT : కొన్ని ప్రేమ కథలు మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వీటిని చూస్తుంటే ఒక రకమైన మత్తులోకి వెళ్లిపోతాం కూడా. అలాంటి ఒక ఎమోషనల్ అండ్ ఆర్టిస్టిక్ లవ్ స్టోరీ ఓటీటీలో ఉంది. ఇది కేవలం 56 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇందులో మాస్ సినిమాల్లాగా ఫైటింగ్‌లు, కామెడీలు ఉండవు కానీ.. ఒక మనిషి మీద మనసు పడితే అది ఎంత పిచ్చిగా మారుతుందో చాలా డీప్ గా చూపిస్తుంది ఈ సినిమా. ఇందులో ఒక టైలర్ వేశ్యతో ప్రేమలో పడటం హైలెట్ గా ఉంటుంది. చూపులతో, స్పర్శతో పండించే ఫీలింగ్స్ ఈ సినిమాకు ప్రాణం పోసాయనే చెప్పచ్చు. తక్కువ బడ్జెట్ తో వచ్చినా, ఇది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ రొమాంటిక్ డ్రామా పేరు ‘ది హ్యాండ్’ (The Hand). ఇది ప్రముఖ దర్శకుడు వాంగ్ కర్-వాయ్ రూపొందించిన ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్. ఇందులో గాంగ్ లీ, చాంగ్ చెన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చైనాలో ‘సార్స్’ వ్యాధి విపరీతంగా ఉండటంతో, చిత్ర యూనిట్ చాలా కష్టాల మధ్య పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రజలు ఒకరినొకరు తాకడానికి భయపడేవారు. అలాంటి సమయంలో ఈ సినిమా కళాత్మకంగా రూపుదిద్దుకుంది. ఇందులో హీరోయిన్ గాంగ్ లీ వేసుకునే ‘చాంగ్‌సామ్’ అనే సాంప్రదాయ చైనీస్ దుస్తులు కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా, కథలో ఆమె ఎదుగుదలని, పతనాన్ని చూపించేందుకు వాడారు. ఒక మామూలు షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ, ఇది ప్రపంచ స్థాయి క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, MUBI ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1960ల కాలంలో హాంగ్‌కాంగ్‌లో జాంగ్ అనే ఒక కుర్రాడు టైలర్ పని నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు తన యజమాని అతన్ని మిస్ హువా అనే ఒక పెద్ద వేశ్య దగ్గరికి కొలతలు తీసుకోమని పంపిస్తాడు. ఆమె దగ్గరికి వెళ్లినప్పుడు, ఆ కుర్రాడు చాలా అమాయకంగా, బిత్తరపోయి ఉంటాడు. అప్పుడు ఆమె అతన్ని తన శృంగారంతో ఒక రకమైన మత్తును, మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఆ క్షణమే ఆ కుర్రాడు ఆమె ప్రేమలో పీకల్లోతు మునిగిపోతాడు. అప్పటి నుండి ఆ కుర్రాడు ఆమెకు బట్టలు కుడుతూ ఉంటాడు. ఆమె వేసుకునే డ్రెస్సులను తనే సొంతంగా డిజైన్ చేస్తూ, ఆమె అందాన్ని మరింత పెంచుతాడు. ఆమెకు చాలా మంది విటులు వస్తుంటారు, ఆమె జీవితం విలాసంగా సాగుతుంటుంది.

కానీ ఈ కుర్రాడు మాత్రం ఆమెను ఒక దేవతలా చూస్తూ, ఆమె మీద తనకున్న ఇష్టాన్ని ఆ డ్రెస్సుల రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఆమె గర్వంగా ఉన్నా, కోపంగా ఉన్నా వీడు మాత్రం ఆమెనే నమ్ముకుని పని చేస్తుంటాడు. కాలం మారుతుంది, మిస్ హువాకు వయసు పెరిగి, అనారోగ్యం పాలవుతుంది. ఆమె సంపాదన తగ్గిపోయి, అందరూ ఆమెను వదిలేసి వెళ్ళిపోతారు. చివరికి ఆమె దగ్గర డబ్బులు కూడా ఉండవు. కానీ జాంగ్ మాత్రం ఆమెను వదలడు. ఆమె దీనస్థితిలో ఉన్నా సరే, తన సొంత డబ్బులతో బట్టలు కుట్టి ఆమెకు ఇస్తాడు. ఆమె చనిపోయే వరకు ఆమె పట్ల అదే ప్రేమను, గౌరవాన్ని చూపిస్తాడు. కేవలం స్పర్శతో మొదలైన వీళ్ళ బంధం, చివరికి ఒక గొప్ప విషాదమైన ప్రేమ కథగా మిగిలిపోతుంది.

Advertisement

Read Also : నాలుగు గోడల మధ్య నడిచే ట్రయాంగిల్ ప్రేమ… అలాంటి సీన్లతో మతి పోగొడుతున్న మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×